ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM

author img

By

Published : Apr 26, 2021, 6:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @7PM

1. ఆ తరగతుల విద్యార్థులు ప్రమోట్‌

రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 21 మంది సస్పెండ్‌

వరంగల్‌ పుర పాలక ఎన్నికల వేళ పార్టీ నుంచి 21 మందిని తెరాస సస్పెండ్‌ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని 21 మందిని సస్పెండ్‌ చేసినట్లు తెరాస పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'అక్కడ బెల్టు షాపులపై చర్యలు'

ఎక్సైజ్ అధికారులతో ఎస్‌ఈసీ పార్థసారథి సమావేశం నిర్వహించారు. మినీ పురపోరు దృష్ట్యా మద్యం దుకాణాల మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరవద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం దుకాణాలు తెరవద్దని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'కేసీఆర్​ ఖాళీ పోస్టులు నింపు జర'

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వై.ఎస్.షర్మిల సీఎం కేసీఆర్​ను ట్విట్టర్ వేదికగా కోరారు. కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట ఇటీవల 755 ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో షర్మిల స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

5. 'హైకోర్టు చెప్పింది నిజమే!'

దేశంలో వైరస్​ వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణమని మద్రాస్​ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్​ను కట్టడి చేసేందుకు ఎన్నికల విధుల్లో ఉండి వైరస్​ సోకిన కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ముందుగానే సుప్రీంకు సెలవులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వారం రోజులు ముందుగానే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మే 8 నుంచి జూన్ 27 వరకు సెలవులు కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఎన్నికలు 6 నెలలు వాయిదా'

పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని మాజీ ప్రధాని దేవెగౌడ సూచించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారత్​కు చైనా అడ్డుపుల్ల!

చైనా ప్రభుత్వ ఆధర్యంలో నడిచే సిచువాన్​ ఎయిర్​లైన్స్​ సంస్థ.. భారత్​కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'పీఎం కేర్స్​'కు ఆసీస్​ పేసర్​ విరాళం

కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు చేయూత అందించేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్‌ పాట్‌ కమ్మిన్స్‌ పీఎం కేర్స్ ఫండ్‌కు ఆర్థిక సాయం ప్రకటించాడు. భారత్‌ సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సామగ్రిని కొనుగోలు చేసేందుకు రూ.37.36 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కరోనాతో దర్శకుడు కన్నుమూత

తెలుగు సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కరోనాతో కన్నముశారు. గచ్చిబౌలిలోని టిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.