1. ఆ గ్రామంలో 51 మందికి కరోనా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. తాజాగా జయవరం గ్రామంలో 51 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కోర్టుల పని విధానంలో మార్పులు
కరోనా తీవ్రత దృష్ట్యా కోర్టుల పనితీరులో హైకోర్టు మార్పులు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల పనివిధానంలో పలు సూచనలు చేసింది. గతంలో మాదిరి పరిమిత సంఖ్యలోనే కేసుల విచారణ జరపాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సీఐ, ఎస్ఐ సహా 11 మందికి కరోనా
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 11 మంది పోలీసులకు కొవిడ్ సోకింది. సీఐ, ఎస్సైతో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లకు వైరస్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'గెలుపే లక్ష్యంగా పని చేయాలి'
నాగార్జున సాగర్ ఎన్నికలను ఒక ఉప ఎన్నిక మాదిరి చూడొద్దని... ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి స్థాయిలో కష్టపడి జానారెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కేరళ బరి: 957 మంది
కేరళలో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 140 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రసవత్తరంగా మూడో విడత
బంగాల్ శాసనసభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 8న సీఎంలతో ప్రధాని భేటీ
ఈ నెల 8న.. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 7 నెలల కనిష్ఠానికి తయారీ రంగం!
దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కారణంగా.. తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రకారం.. మార్చిలో తయారీ రంగ పీఎంఐ ఏడు నెలల కనిష్ఠ స్థాయి అయిన 55.4 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఈసారి ఆ 'క్యాప్' ఎవరిదో?
ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. ఆధిపత్యం కోసం తలపడనున్నారు. అయితే ఇందులో గెలిచేది ఎవరు? ఎక్కువ పరుగులు చేసే బ్యాట్స్‌మన్ ఎవరు? ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశం ఎవరికి ఉంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'నాకు కరోనా నిజమే.. కానీ'
తనకు కరోనా సోకడం నిజమేనని స్పష్టం చేశారు నిర్మాత అల్లు అరవింద్. అయితే తాను రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నా వైరస్ సోకిందని వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.