1. యాదాద్రిలో మరో 32 మందికి కరోనా
యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న 30 మందికి సోకిన వైరస్ మరోసారి విజృంభిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'కౌలు రైతులకు వర్తింపజేయండి'
రైతు ఆత్మహత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కౌలు రైతులకూ రైతు బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ఆ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి'
నీళ్లు అందుబాటులో ఉన్నాయని వరినే సాగు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యయసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. లాభసాటి పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ పార్టీలకు లేఖలు రాసిన కాంగ్రెస్
కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేఖలు రాసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. హిరేన్ మృతి కేసులో కీలక మలుపు
ముకేశ్ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్ సీపీయూ, వాహనం నంబర్ ప్లేట్ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కుంభమేళా భక్తులకు సేవలపై ప్రతిజ్ఞ
హరిద్వార్‌లో వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. భక్తులంతా సురక్షితంగా ఉండేలా పనిచేయనున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత్‌కు మరో 10 రఫేల్
వచ్చే నెల రోజుల్లో భారత సైన్యం అమ్ముల పొదిలో మరో 10 రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెండు, మూడు రోజుల్లో భారత్‌కు 3 రఫేల్ విమానాలు వస్తాయని పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆ నిబంధనలపై ట్రాయ్ లేఖ
బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కొత్త నిబంధనల అమలుకు సహకరించాలని.. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ సంఘాలకు లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఇంగ్లాండ్ లక్ష్యం 330
పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్‌కు 330 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు వన్డే సిరీస్ విజేతగా నిలుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. గూఢచారిగా రాధికా-'వై' టీజర్
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కొత్త సినిమాలో గూఢచారి పాత్ర పోషించనుంది. 'మిసెస్ అండర్‌కవర్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీకాంత్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'వై' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.