1. 'ఆ రంగాల్లో పెట్టుబడులకు అవకాశం'
రాష్ట్రంలో సౌర విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. హరీశ్‌రావును ఆస్ట్రేలియా హైకమిషనర్, ప్రతినిధులు కలవగా.. రాష్ట్రంలో పెట్టుబడులు, కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. యాచించొద్దు.. శాసించాలి: సంజయ్
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పీఆర్సీని ఏ విధంగా ప్రకటిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలదీశారు. ఉద్యోగ సంఘాల నాయకులు యాచించొద్దని శాసించాలన్నారు. పీవీ నరసింహారావు మీద కేసీఆర్‌కు ఆకస్మాత్తుగా ప్రేమేందుకు పుట్టిందో బయటపెడతానని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏపీలో పోలింగ్ ప్రశాంతం
ఏపీలో నగరపాలక, పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నీటిపాలైన 200 ఎకరాలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నాణ్యత లోపం మరోసారి బయటపడింది. రంగంపల్లి శివారులో పైపులైన్ పగిలి సుమారు 200 ఎకరాలు నీటమునిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఖట్టర్ సర్కార్ సేఫ్
హరియాణా ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకుంది. హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం 88 సభ్యులుండగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది ఎమ్మెల్యేల ఓటు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఉగ్ర కుట్ర-నలుగురు అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా తరహాలో దాడి చేసేందుకు సిద్ధం చేస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆందోళన ప్రదేశంలో ఇల్లు
నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళ చేస్తున్న రైతుల ఎంత దృఢమైందో చెప్పడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. సాగు చట్టాలను రద్దు చేసే వరకు దిల్లీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఓ రైతు సింఘూ సరిహద్దులో ఇల్లును నిర్మించుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. నిరసనకారుల నయా ట్రెండ్
మయన్మార్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న క్రమంలో నిరసనకారులు ట్రెండ్ మార్చారు. సొంతంగా తయారు చేసుకున్న రక్షణ కవచాలతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. పోలీసులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ప్రపంచకప్‌నకు..ఐపీఎల్!'
ఐపీఎల్ ఆడడం వల్ల రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ప్రాక్టీసులా ఉపయోగపడుతుందని అన్నాడు ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్. ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిల్లింగ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. పవన్ సినిమా- ఆచార్య షెడ్యూల్ పూర్తి
శివరాత్రి కానుకగా తమ సినిమాలకు సంబంధించిన కొత్త అప్టేట్స్‌ను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి ఆయా చిత్రబృందాలు. ఇందులో పవన్‌కల్యాణ్-క్రిష్, కార్తికేయ, విజయ్ ఆంటోని సినిమా విశేషాలు ఉన్నాయి. కాగా, 'ఆచార్య' సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.