ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

author img

By

Published : Feb 28, 2021, 7:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేటు సోలార్ ప్లాంట్‌లో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కోట్లలో ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ఉద్యోగాల విషయంలో చిత్తశుద్ధి లేదు'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. భాజపా, తెరాసలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మేడారంలో గుడి మూసివేత

రేపటి నుంచి 21 రోజుల పాటు మేడారం సమ్మక్క-సారక్క గుడిని మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అన్నదానంలో ప్లాస్టిక్​ అన్నం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఓ గ్రామంలో ప్లాస్టిక్ అన్నం కలకలం రేపింది. ఓ అన్నదాన కార్యక్రమంలో వడ్డించిన అన్నం.. ప్లాస్టిక్​దని తేలడంతో గ్రామస్థులు విక్రయించిన వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'భాజపాతో మమత పొత్తు'

బంగాల్​లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్​ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు వామపక్షాలు సహా.. ఇతర పార్టీలతో కలసి కోల్​కత్తాలో 'పీపుల్స్ బ్రిగేడ్​' పేరిట నిర్వహించిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ బల ప్రదర్శనకు తెరతీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ఆ ఘటనకు భాజపానే కారణం'

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాకాండకు భాజపానే కారణమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆరోపించారు. ఎర్రకోట ఘటన భాజపా నాయకుల పథకం ప్రకారమే జరిగిందని విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పుదుచ్చేరి స్పీకర్ రాజీనామా

పుదుచ్చేరి స్పీకర్​ వీపీ శివకొలుందు తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల వేళ కొలుందు సోదరుడు భాజపాలో చేరడం వల్ల ఈ రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు శివకొలుందు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. చైనా 'పైనాపిల్​' కుతంత్రం!

పొరుగు దేశాల పట్ల చైనా మరింత కుటిల విధానాలను అవలంబిస్తోంది. తైవాన్​ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆ దేశం నుంచి పైనాపిల్​ దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో డ్రాగన్ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పసిడి గెల్చుకున్న వినేశ్

భారత రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్​ రెజ్లర్​ వెనెసాపై విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. విజయ్ దేవరకొండ మరో చిత్రం

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో నిర్మాతగా విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు, మరక్కర్, రొమాంటిక్ తదితర చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.