1. మొదటి డోసు నేనే తీసుకుంటా: ఈటల
రేపు రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాను టీకా తీసుకుంటానని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఇవి గుర్తుంచుకోండి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా శనివారం టీకా పంపిణీ ప్రారంభం కానుంది. 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ప్రభుత్వం సుముఖం'
భాషోపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 4. 'జూన్‌లోగా బీటీపీఎస్ పూర్తి'
బీటీపీఎస్ నిర్మాణ పనులు జూన్‌లోగా పూర్తవుతాయని జెన్కో డైరెక్టర్ సచ్చిదానందం స్పష్టం చేశారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్‌ని ఆయన సింక్రనైజేషన్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో హరియాణాలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా సహా పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మరో ఐదుగురికి కొత్త కరోనా
దేశంలో మరో 5 కొత్త రకం కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 114కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 19న మరోసారి భేటీ!
కేంద్రం, రైతుల మధ్య జరిగిన 9వ విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు మరోసారి డిమాండ్ చేశాయి. అయితే.. చర్చల ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బైడెన్ 'రిహార్సల్' వాయిదా!
అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు అమెరికాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి నిరసనకారుల నుంచి ముప్పు పొంచి ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు
టీమ్ఇండియా ఆటగాళ్లపై ఇటీవల జరిగిన జాత్యహంకార వ్యాఖ్యల దుమారం చల్లారకముందే.. మరోసారి అలాంటి తీరునే ప్రదర్శించారు. సిరాజ్, సుందర్‌లపై వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. పవన్‌తో త్రివిక్రమ్ కొత్త సినిమా
పవన్-త్రివిక్రమ్ కలిసి నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.