ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @7PM

author img

By

Published : Jan 7, 2021, 6:56 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​ టెన్ న్యూస్ @7PM

1. ఆ ఉపఎన్నిక తర్వాతే టీపీసీసీ

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్ష నియామకం ఉంటుందని మాణిక్యం ఠాగూర్‌ వెల్లడించారు. సాగర్‌ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. డీమార్ట్​ సీజ్​

హైదరాబాద్ కుషాయిగూడలోని డీ మార్ట్​ను కాప్రా మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కిమియా ఖర్జూరాలు కొనుగోలు చేసిన పద్మారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'భూ లావాదేవీలు జరపలేదు'

భూమా అఖిలప్రియతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని ప్రవీణ్​రావు సోదరుడు ప్రతాప్​రావు స్పష్టం చేశారు. హఫీజ్​పేట భూమి వాళ్లదైతే న్యాయపరంగా స్వాధీనం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. తహసీల్దార్​ సస్పెండ్​

అనేక భూ కుంభకోణాలు బయటపడుతున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మరో అధికారి భూ అక్రమాలకు పాల్పిడి దొరికిపోయాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్​ ఆయనను సస్పెండ్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'శబరిమల రైలు'కు ఓకే

ఎన్నో ఏళ్లుగా కోట్లాదిమంది భక్తులు ఎదురుచూస్తోన్న శబరిమల రైలు మార్గానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్ట్​కు అయ్యే ఖర్చులో 50 శాతం భరించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ఆస్పత్రిలోనే వరవరరావు'

ఎల్గర్‌ పరిషత్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రముఖ కవి, విరసం సభ్యుడు వరవరరావు మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని బాంబే హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. జులై 3న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను జులై 3న నిర్వహించనుంది కేంద్ర విద్యాశాఖ. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షల తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ట్రంప్​నకు అరెస్ట్​ వారెంట్​

ఇరాన్​ జనరల్​ సులేమానీ హత్యతో సంబంధం ఉందంటూ.. ఇరాక్​లోని ఓ కోర్టు అమెరికా అధ్యక్షుడి ట్రంప్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. నేరం రుజువైతే పరిణామాలు మరణశిక్షకు దారితీస్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'కన్నీరు ఆపుకోలేకపోయా'

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆట సమయంలో.. ఇటీవల చనిపోయిన తన తండ్రి గుర్తుకురావడం వల్లే ఉద్వేగానికి లోనైనట్లు వివరించాడు టీమ్​ఇండియా పేసర్​ సిరాజ్​. తాను టెస్టు మ్యాచులు ఆడితే చూడాలనేది తన తండ్రి కోరిక అని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'బుట్టబొమ్మ' రికార్డు

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్​లో రికార్డు సాధించింది. ఈ ప్లాట్​ఫామ్​లో 500 మిలియన్ల వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.