1. హుషార్ హైదరాబాద్ :కేటీఆర్
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ అల్లాపూర్‌లో రోడ్‌షోతో ప్రచార భేరీ మొదలైంది. గతంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఉత్సాహం నింపిన బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరదాగా సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సైకిల్ తొక్కుతున్న బండి సంజయ్‌ని చూసి పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ రోగులకు ఓటు హక్కు: ఎస్ఈసీ
కరోనా పాజిటివ్ రోగులకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్ఈసీ వెల్లడించింది. ఇంతే కాకుండా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదు: కేకే
నిజమైన హిందువు కేసీఆరే అని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదని హైదరాబాద్‌లో చెప్పారు. ముఖ్యమంత్రిని మించిన హిందువు ఎవరూ లేరని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఫైన్ 15 లక్షలు
తమిళనాడులో ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో చెన్నై సివిల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధితుడిపై ఫిర్యాదు చేసిన మహిళ రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'చివరి దశకు కరోనా అధ్యయనం'
కరోనా వైరస్‌పై చేస్తున్న అధ్యయనం చివరి దశకు చేరుకుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోనే ఇది మొదటి జంతు అధ్యయనం అని పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో సంయుక్తంగా పరిశోధన జరుపుతున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మెట్రో పనులకు అమిత్ షా శంకుస్థాపన
తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. రెండోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు
దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 20పైసలు పెంచాయి చమురు సంస్థలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 2021లో అగ్ర దేశాలకు ఆతిథ్యం
పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పునరుజ్జీవం కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను చెరిపేసుకొనేందుకు పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక టోర్నీలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. షెర్లీ టాలీవుడ్ ఎంట్రీ
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. బ్యూటీ షెర్లీ షెటియా తెలుగులో తొలి సినిమా చేస్తోంది. అలానే శింబు 'మానాడు', 'ఓదెల రైల్వేస్టేషన్' నుంచి కూడా అప్డేట్స్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.