ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jan 15, 2021, 4:59 PM IST

1. 'వ్యాక్సిన్ వారికి లేదు'

రాష్ట్రంలో మొత్తం 139 కేంద్రాల్లో మొదటి విడతలో రేపు కొవిడ్​ నియంత్రణ టీకా ప్రారంభించడం జరుగుతుందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. రెండు కేంద్రాల్లో ప్రధాని మోదీ ద్వారా వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'రేపటి నుంచే టీకా'

రేపటి నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిమ్స్​లో గవర్నర్ తమిళిసై, గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కి రాష్ట్రంలో 1,213 సెంటర్‌లు సిద్ధం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. అఖిలప్రియ ఫోన్లు ఎక్కడ?

ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. దర్యాప్తు ముమ్మరం

రుణ యాప్​ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేశారు. లాంబో అనే చైనా వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని... వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కొలిక్కిరాని చర్చలు!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 9వ విడత చర్చలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'వారి కోసమే సాగు చట్టాలు'

నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పార్టీ వెనక్కి తగ్గబోదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. దిల్లీలో నిర్వహించిన రాజ్​భవన్​ ముట్టడి కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. శబరిమల ఆదాయం డీలా!

కొవిడ్​ కారణంగా కేరళలోని శబరిమల ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. ఈ సీజన్​లో కానుకల రూపంలో రూ.16 కోట్లు మాత్రమే వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. వారాంతంలో భారీ నష్టాలు

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 549 పాయింట్లు కోల్పోయి.. 49,050 మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 162 పాయింట్లు తగ్గి..14,450 మార్క్​ను కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. నటరాజన్​ రికార్డు

తమిళనాడు యువ పేసర్ నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే సిరీస్​ ద్వారా మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కంగనకు షాక్

ప్రముఖ నటి కంగనా రనౌత్.. 'మణికర్ణిక' సీక్వెల్ కథ విషయంలో వివాదంలో ఇరుక్కుంది. ఈ కథ తాను రాస్తున్న పుస్తకం నుంచి దొంగిలించారని రచయిత అశిష్ కౌల్ ఆమెపై ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.