1. తిరిగి అర్ధరూపాయే ఇస్తోంది: కేటీఆర్
తెలంగాణకు ఈ ఆరేళ్లలో కేంద్రం చేసింది శూన్యమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కేంద్ర ప్రభుత్వం... దేశంలో మరోచోట అభివృద్ధికి ఖర్చుచేస్తోందని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే... అదే కేంద్రం తిరిగి రాష్ట్రానికి కేవలం అర్ధ రూపాయి మాత్రమే ఇస్తోందని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది: ఉత్తమ్
డబ్బు సంచులతో భాజపా కాంగ్రెస్ నాయకులను కొనుక్కోవాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందని ఓట్లు అడుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం, భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వారికి మళ్లీ సాయం: బండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌లు భాజపాను నియంత్రించలేవని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బీ-ఫారాలకు రేపటి వరకు గడువు
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారం సమర్పించేందుకు రేపటి వరకు గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అమిత్ షాకు ఘన స్వాగతం
అమిత్‌షా చెన్నై పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమిత్‌షా కార్యకర్తలతో కలిసి నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అమిత్‌షా గో బ్యాక్ పేరుతో ఉన్న ప్లకార్డును విసిరిన ఆ వ్యక్తి విసిరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'బైడెన్‌కే ఆ ఖాతాను అప్పగిస్తాం'
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే జనవరి 20న అధికారిక ఖాతా '@POTUS'ను బదిలీ చేస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోయినా.. బైడెన్‌కు అప్పగిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. అలసత్వం వద్దు: అంబానీ
కరోనాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. కొవిడ్-19 పై పోరులో భారత్ కీలక దశకు చేరుకుందని, ఈ సమయంలో అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఎల్పీఎల్ నిర్వాహకులకు షాక్
కరోనా బారిన పడుతున్న క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లంక ప్రీమియర్‌కు ఈ సెగ తగిలింది. లీగ్ ప్రారంభానికి ముందే టోర్నీలో ఆడాల్సిన పాక్ బౌలర్ తన్వీర్ కొవిడ్ బారిన పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సితార క్లాప్‌తో 'సర్కారు వారి పాట'
మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' సినిమా లాంఛనంగా మొదలైంది. జనవరి ప్రారంభం నుంచి చిత్రీకరణ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.