ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Apr 27, 2021, 3:03 PM IST

1. ఎమ్మెల్యే సీతక్క అరెస్టు

హైదరాబాద్​లో ఎమ్మెల్యే సీతక్క నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆమెను అరెస్టు చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ సీతక్క నిరాహార దీక్ష చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'పరీక్షల పెంపునకు చర్యలు'

మద్యం దుకాణాలు, పబ్​లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్​ను రాష్ట్రానికి చేరవేస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కేంద్రమంత్రి రోడ్ షో

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. చెంప చెళ్లుమనిపించిన నర్సు

ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ వైద్యుడు, నర్స్‌ ఘర్షణకు దిగి.. పరస్పరం దాడి చేసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాంపుర్‌ జిల్లా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని.. పని భారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్‌తో ఘర్షణకు దిగిన నర్స్‌.. వైద్యుడి చెంప చెళ్లుమనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఐసీయూకు స్కూటీపైనే

స్ట్రెచర్​ లేక కొవిడ్ రోగిని స్కూటీపై ఆస్పత్రికి తరలించిన ఘటన ఝార్ఖండ్​లో సోమవారం జరిగింది. మేదినగర్​లోని పాలము వైద్య కళాశాల, ఆస్పత్రిలో కనీసం స్ట్రెచర్లు కరవయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పీపీఈ కిట్లు ధరించి పెళ్లి

కరోనా మహమ్మారి కమ్మేస్తున్న వేళ... పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలుగా ధరించి ఆ యువ జంట ఒక్కటైంది. వేద మంత్రాల నుంచి అప్పగింతల వరకు.. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగగా.. కొవిడ్‌ నిబంధనల మధ్య ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే ఆ యువ జంట ఏకమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. వాట్సాప్​ మెసేజ్​లు 24 గంటల్లో మాయం!

వాట్సాప్​.. రోజువారీ జీవితంలో ఇదో భాగమైపోయింది. అయితే ఇందులో అవసరమైన మెసేజ్​లతో పాటు.. మీరు కనీసం పట్టించుకోని సందేశాలు ఎన్నో వస్తుంటాయి. వాటన్నింటిని రోజూ డిలీట్ చేయడం కుదరకపోవచ్చ. ఈ ఇబ్బంది లేకుండా 24 గంటల్లో మొత్తం అన్ని రకాల పోస్టులు డిలీట్‌ చేసే ఆప్షన్ తెేనుందట వాట్సాప్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారత్​లో టీ20 జరిగేనా?

భారత్​లో విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులు కారణంగా అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్​ విజృంభణ కారణంగా టీ20 ప్రపంచకప్​ నిర్వహించడం కష్టమనే కొందరు క్రికెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మరక్కార్', 'సత్యమేవ జయతే 2' వాయిదా

మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చారిత్రక చిత్రం 'మరక్కార్' 2021, ఆగస్టు 12న రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'సత్యమేవ జయతే 2' విడుదల వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.