1. మంత్రుల హోలీ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు శాసనసభ సభాపతి పోచారంతో పాటు పలుపురు మంత్రులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లో దుస్తుల్లో 40 లక్షల బంగారం
లోదుస్తుల్లో రూ.39.48లక్షల బంగారాన్ని దాచుకుని అక్రమ రవాణా చేస్తున్న మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఐఐటీ, ఐఐఎంలో కొవిడ్
గాంధీనగర్ ఐఐటీ, అహ్మదాబాద్ ఐఐఎంలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఐఐటీలో 25 మంది విద్యార్థులకు వైరస్ సోకగా.. ఐఐఎంలో విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిపి మొత్తం 40 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'తొలి విడతలో భాజపాకే పట్టం'
బంగాల్, అసోం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు భాజపాకే పట్టం గట్టారని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భక్తుల కొంగుబంగారం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో కొలువైన వెంకటగిరి లక్ష్మీనరసింహుడు భక్తుల విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6 'కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండలేకపోతోంది'
తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా... బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కొడంలో విఫలం చెందిందని చెప్పారు. చాలా మంది నాయకులు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'ఆ చట్టాలు లేనిదే రైతు ఆదాయం రెట్టింపు కాదు'
సాగు చట్టాల అమలు వెంటనే జరగకపోతే 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం సుసాధ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ అన్నారు. రైతు సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చ జరపాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. విమానం కూలి ఆరుగురు మృతి
ఉత్తర మెక్సికో ప్రాంతంలో విమానం కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ లీగ్‌లో డివిలియర్స్!
ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో నేపాల్‌లో జరిగే ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌లో డివిలియర్స్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో గేల్ భాగమయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'సీటీమార్' వాయిదాకు కారణమిదే!
కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన 'సీటీమార్' చిత్రం విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు సంపత్ నంది ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.