1. పాఠశాలలో 14 మందికి కరోనా
మంచిర్యాల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థినికి కరోనా వచ్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 26 వరకు అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 26 వరకు పది రోజుల పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సభాపతి పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం కాగా... బడ్జెట్ సమావేశాల అజెండాపై నేతలు చర్చించారు. 18న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముందడుగు వేద్దాం
సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ.. రాష్ట్రం ఆవిర్భవించాక అన్ని రంగాల్లోనూ చెప్పుకోదగ్గ పురోభివృద్ధి సాధించిందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా.. తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ప్రైవేటీకరణతో ఉద్యోగులకు నష్టం'
నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు ఉభయసభల సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రైవేటీకరణపై తెరాస పార్లమెంటరీ పక్ష నేత నామ నాగేశ్వరరావు.. కేంద్రాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏప్రిల్ నుంచి కొత్త నియమాలు
ఈ నెలతో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌తో ప్రారంభమవనున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను నిబంధనల్లో పలు మార్పులు రానున్నాయి. వీటిని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రిజరేషన్లపై వాదనలు
1992 నాటి ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించరాదని విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించే అంశంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై అభిప్రాయాలు చెప్పేందుకు రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మహిళకు వారెంట్
మాస్కు ధరించనందుకు ఓ మహిళపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళ... "ఏం చేస్తావ్? అరెస్ట్ చేస్కో" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. భారీ నష్టాల్లో మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత కూడా భారీ నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 845 పాయింట్లకుపైగా కోల్పోయి.. 49,942 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా నష్టంతో 14,799 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం
రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదెవ్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఓపెన్ 13 టోర్నీ టైటిల్‌ను గెలుపొందిన మెద్వెదెవ్.. రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'శాకుంతలం','పుష్పక విమానం'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రానున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న 'పుష్పక విమానం' సినిమాలోని తొలి పాట విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.