ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 3PM
author img

By

Published : Mar 11, 2021, 3:00 PM IST

1. 25 గేదెలు మృతి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం డి-53 కెనాల్‌లో 25 గేదెలు పడి మృతి చెందాయి. డి-53 కెనాల్‌కు అకస్మాత్తుగా నీరు విడుదల చేయడంతో ఘటన జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దుర్గామాత సేవలో హరీశ్​రావు

మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్ రావు వన దుర్గాభవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం

మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శివాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ మొక్కలు చెల్లించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బాలుడు అదృశ్యం

స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ జవహర్​నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సీఎం 'పూలవర్షం'

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో​​ ముఖ్యమంత్రి తీరథ్​ సింగ్ రావత్​ పాల్గొన్నారు. ఈ క్రమంలో.. శివ దర్శనానికి వచ్చిన భక్తులపై స్వయంగా పూలు చల్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లోదుస్తుల్లో కోటి బంగారం

కర్ణాటకలో భారీ స్థాయిలో బంగారం బయటపడింది. దీని విలువ రూ.కోటికిపైగా ఉంటుందని కస్టమ్స్​ అధికారులు వెల్లడించారు. పసిడితో పాటు, విదేశీ సిగరెట్​లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన అధికారులు.. నిందితురాలిని అరెస్ట్​ చేసినట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. నాగ్​పుర్​లో లాక్​డౌన్​

కరోనాను కట్టడిచేసేందుకు నాగ్​పుర్​లో లాక్​డౌన్​ విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజా మార్గదర్శకాల ప్రకారం.. మార్చి 15 నుంచి 21 వరకు అక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆ అధ్యక్షురాలు కన్నుమూత

బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 93 ఏళ్ల దాదీ హృదయ మోహిని గురువారం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పృథ్వీ షా రికార్డ్

విజయ్​ హజారే టోర్నీలో ముంబయి కెప్టెన్ పృథ్వీ షా రెచ్చిపోయాడు. ఈ ట్రోఫీలో మరో శతకం సాధించాడు. కెప్టెన్సీ చేపట్టాక మూడో సెంచరీ చేసిన ఈ ఓపెనర్​.. మొత్తంగా ఈ టోర్నీలో నాలుగో శతకాన్ని పూర్తి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. చిరు గిఫ్ట్

మేనల్లుడు వైష్ణవ్ తేజ్​కు అదిరిపోయే గిఫ్ట్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. 'ఉప్పెన' చిత్రంలో వైష్ణవ్ నటనకు ఫిదా అయిన చిరు అతడికి ఖరీదైన వాచ్​ గిఫ్ట్​గా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.