ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​ టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Mar 24, 2021, 1:00 PM IST

1. 'నగర పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు'

రాష్ట్రంలోని నగరపాలికల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పట్టణ పేదలకు బస్తీ దవాఖానాలతో మేలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ఫోన్‌కాల్‌తో యంత్రాలు'

వ్యవసాయ యాంత్రీకరణకు ఊబర్‌ తరహా విధానం తీసుకువస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా యాంత్రీకరణకు 15 వందల కోట్లు కేటాయించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'పదేళ్లకోసారి పీఆర్సీ'

ఏడేళ్ల తెలంగాణలో ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ ఇస్తే చెప్పాలని స్థానిక భాజపా నాయకులను ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస పథకాల లబ్ధి లేకుండా ఏదైనా కుటుంబం ఉంటే తాను బాధ్యత వహిస్తానని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్​కు వెళ్తున్న మహ్మద్​​పై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద రూ.1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తదుపరి సీజేఐ రమణ!

సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు సీజేఐ జస్టిస్ బోబ్డే. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ముందున్న భారత్'

అంటువ్యాధులు కాని రోగాల నివారణకు చేపట్టే కార్యక్రమాల విషయంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్​సీడీ మరణాలను తగ్గించినందుకు భారత్​పై ఐరాస ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'దీదీ పాలనకు చరమగీతం'

బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్​​ ప్రభుత్వానికి మే 2 చివరి రోజు అని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కొత్త సర్కారు వస్తేనే బంగాల్​లో మార్పు సాధ్యమవుతుందని తూర్పు మెదినీపుర్​ జిల్లా కాంతిలో భాజపా నిర్వహించిన ప్రచార సభలో అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అమెరికా సర్జన్​ జనరల్​గా వివేక్

అమెరికా సర్జన్ జనరల్​గా భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తి ఎంపికయ్యారు. ఈ మేరకు.. బైడెన్ నామినేషన్​ను సెనేట్ ఆమోదించింది. పలువురు రిపబ్లికన్ సభ్యులు సైతం మూర్తి ఎంపికను సమర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ప్రపంచకప్​లో మరో స్వర్ణం

పారా షూటర్​ మనీశ్ నర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 మీటర్ల పిస్టోల్ మిక్స్​డ్ విభాగంలో స్వర్ణం చేజిక్కుంచుకోవడం సహా ఈ ఘనత అందుకున్నాడు. షూటింగ్ ప్రపంచకప్​లో ప్రతాప్ సింగ్ తోమర్ కూడా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పవర్​ఫుల్​ రోల్​లో శ్రీకాంత్​!

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయకుడు శ్రీకాంత్​ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేసే విధంగా.. శ్రీకాంత్​ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం బుధవారం ట్వీట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.