1. చిరంజీవికి కరోనా పాజిటివ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా సోకింది. అయితే లక్షణాలు ఏం లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతుందని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మరికొన్ని గంటల్లో ఉపఎన్నిక ఫలితం
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. ఫలితాలపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఈసారి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బాణసంచా అమ్మకాలపై నిషేధం
దిల్లీతోపాటు దేశంలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో టపాసుల విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించింది. వాయునాణ్యత మోస్తరుగా ఉన్న ప్రాంతాల్లో హరిత టపాసుల వినియోగించవచ్చని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మోదీ, నితీశ్‌కూ ట్రంప్‌కు పట్టిన గతే: శివసేన
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ లాంటివారు నిలువలేరంటూ శివసేన వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరాభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పెళ్లి కోసం హోర్డింగ్పైకి ఎక్కిన బాలిక
తను ఇష్టపడే బాలుడితో వివాహానికి తల్లి అడ్డు చెప్పిందని ఓ మైనర్ హల్చల్ చేసింది. ఎత్తైన హోర్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానని బెదిరించింది. చివరకు తనకు నచ్చిన బాలుడే నచ్చజెప్పడం వల్ల దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ట్రంప్‌కు బుష్ ఝలక్
ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత జార్జి డబ్ల్యూ బుష్ స్పందించారు. ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని ప్రజలు నమ్మొచ్చని చెప్పారు. అయితే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించే హక్కు ట్రంప్‌కు ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో మార్కెట్లు
అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 470 పాయింట్ల బలపడి 42,334 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 12,387 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సెహ్వాగ్ క్రేజీ ట్వీట్
దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ చేరుకోవడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ జట్టుకు అభినందనలు తెలిపాడు . బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సినిమాలోని ఓ పాట మీమ్‌ను జోడిస్తూ ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. షూటింగ్‌కు 'పుష్ప'రాజ్ సిద్ధం
'పుష్ప' షూటింగ్ మంగళవారం నుంచి తిరిగి మొదలు కానుందని చిత్రబృందం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.