1. కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రూ.2లక్షల నగదు పట్టివేత
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం... ములుగు-మెదక్ రోడ్డులో భూంపల్లి వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.2లక్షల నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేనందున స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు
రాష్ట్రంలోని పలు చోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం కాగా... వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నర్సింగ్ సిబ్బంది నిరసన
సమస్యలు పరిష్కరించాలంటూ... నిమ్స్‌లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిమ్స్ డైరెక్టర్ హామీ ఇచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరో కుట్ర- పీఓకేలో స్థావరాలు
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లక్ష్యంగా పాకిస్థాన్-చైనా కలిసి కుట్రలకు పదునుపెట్టాయి. సైనిక సదుపాయాలను పెంచుకోవడంలో భాగంగా పీఓకేలో క్షిపణి స్థావరాలు అభివృద్ధి చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. సుప్రీం కీలక తీర్పు
షాహిన్‌బాగ్ లాంటి ప్రభుత్వ స్థలాలను నిరసనల కోసం ఆక్రమించుకోవడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అలాంటి ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. చిరుతిళ్లు డోర్ డెలివరీ!
కొవిడ్ కారణంగా వీధుల్లో దొరికే చిరుతిళ్లు తినడం ఇటీవల భారీగా తగ్గిపోయింది. దీని వల్ల చిరు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్'
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. గాయంతో పేసర్ దూరం
ఐపీఎల్ నుంచి గాయం కారణంగా మరో బౌలర్ తప్పుకున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వహకులు ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రియా చక్రవర్తికి బెయిల్
సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి రూ.లక్ష పూచీకత్తుతో, బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ముంబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.