1. మండలిలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ తెలిపారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామన్నారు. శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భాజపా నేతలు స్పందించాలి : కేటీఆర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు నాలుగు రకాల ప్రణాళికలు రూపొందించామని మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన, లింక్ రోడ్లను దశల వారీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో పలు చోట్ల రోడ్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. శ్రీనివాస్ గౌడ్‌కు మండలి ఛైర్మన్ గుత్తాకు ఆసక్తికర చర్చ
రాష్ట్రాన్ని పెద్ద టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు, ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
అసెంబ్లీ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సోనియా, రాహుల్ గైర్హాజరు
అసాధారణ పరిస్థితుల్లో నిర్వహిస్తోన్న పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన సోనియా.. కరోనా కాలంలో కీలకమైన సమావేశాల్లో పాల్గొనకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ' ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ భేష్'
కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. విద్యార్థులను రక్షించండి: డీఎంకే
నీట్ పరీక్షలను రద్దు చేయాలని అటు పార్లమెంట్, ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టింది డీఎంకే. 'నీట్‌ను రద్దు చేయండి, తమిళనాడు విద్యార్థులను రక్షించండి' అని రాసి ఉన్న మాస్కును ధరించి నిరసనలో పాల్గొన్నారు డీఎంకే అధినేత స్టాలిన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వచ్చేసింది
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అప్డేట్ను ఎట్టకేలకు విడుదల చేసింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఫోన్లకే అందుబాటులోకి వచ్చింది ఈ అప్డేట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధోనీ అప్పుడు సరేనన్నాడు: ఉతప్ప
2007 టీ20 ప్రపంచకప్‌లో సరిగ్గా ఇదే రోజు, బౌలౌట్ విధానంలో పాక్‌ను ఓడించింది భారత్. ఆ మ్యాచ్ విశేషాలు అప్పటి జట్టు సభ్యుడు రాబిన్ ఉతప్ప మాటల్లో. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆత్మహత్యపై హీరో సూర్య ట్వీట్
నీట్ పరీక్ష రాయల్సిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనను చాలా బాధ కలిగించిందని నటుడు సూర్య చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.