ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​ టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Aug 31, 2020, 12:59 PM IST

1. చైనాకు గట్టిగా బదులిచ్చిన భారత్​

తూర్పు లద్దాఖ్​ వద్ద చైైనా మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య చర్చల్లో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆగస్ట్​ 29న రాత్రి చైనా జవాన్లు హద్దు మీరినట్లు తెలుస్తోంది. హద్దు మీరిన చైనా బలగాలను భారత జవాన్లు దీటుగా అడ్డుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రాళ్లతో దాడి

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం చోటుచేసుకుంది. ఓ భూమి కోసం... నాదంటే నాది అని... మహిళలు, పురుషులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. బొగతలో యువకుడు గల్లంతు

బొగత జలపాతంలో గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బొగతకు వెళ్లిన యువకుడు... స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగి గల్లంతయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గరిష్ట స్థాయికి శ్రీశైలం

ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో శ్రీశైలం నుంచి నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా జలాశయాలకు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'ఓనం చిహ్నం'

ఓనం పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ పండుగ సామరస్యానికి ప్రతీక అని మోదీ ట్వీట్ చేశారు. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఓనం చిహ్నమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'విషమంగానే...'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అమిత్​ షా డిశ్చార్జ్​

ఆసుపత్రి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్​లో చేరిన ఆయన సోమవారం డిశ్చార్జి అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పాక్ ఆటగాళ్ల రికార్డులు

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో పాక్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, బాబర్ అజామ్ రికార్డులకెక్కారు. హఫీజ్ పొట్టి ఫార్మాట్​లో 2 వేల పరుగుల్ని పూర్తి చేయగా, అజామ్ అత్యంత వేగంగా 1500 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ, ఫించ్ సరసన చేరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అగ్రరాజ్యంలో నిరసనలు

అమెరికాలోని పోర్ట్​ల్యాండ్​లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'అభినందనీయం'

ప్రముఖ తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన చిత్రం 'సూరారై పొట్రు'. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. తాజాగా ఈ నిర్ణయాన్ని సమర్థించారు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.