ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 1PM - ts news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్ టెన్ న్యూస్@1PM
author img

By

Published : Aug 5, 2020, 1:01 PM IST

1. పునాది రాయితో పులకించిన అయోధ్య

కోట్లాది మంది హిందువులు శతాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేదమంత్రాలు, అతిరథుల సమక్షంలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు ప్రధాని మోదీ. కోట్లాదిమంది భారతీయులు ఈ మహోత్వాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసి పులకరించిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. హనుమాన్​గఢీలో పూజలు

రామ జన్మభూమిలో భూమిపూజకు ముందు అయోధ్య హనుమాన్​గఢీలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌... అయోధ్యలో కొత్తగా కొలువుదీరనున్న రామమందిరానికి దశ-దిశ చూపుతుంది ఇదే. నిర్మాణ దశలోనే సంరక్షణ చేపడుతూ.. సకల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఆలయ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దట‌మే కాదు... భూమిపూజకు అతిథులకు ఆహ్వాన ప‌త్రిక‌లు అందించటం మొదలు.. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించటం వరకు అన్నీ ట్రస్టు బాధ్యతలే. శ్రీరామ జన్మభూమి సంరక్షణ మొత్తం ఇక ఆ ట్రస్టు అధీనంలోనే ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ' భూములు వెనక్కి తీసుకోండి'

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీల వసూళ్లపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న విశ్రాంత ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారీ వర్షం!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మరో నాలుగు పాలసీలు

పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ద్వారా లబ్ధి, ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు కొత్త విధానాలను అమలు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మరో స్టార్ ప్లేయర్ ఔట్

కరోనా కేసులు ఎక్కువవుతున్న ఇలాంటి సమయంలో ప్రయాణం చేయడం సరికాదని, అందుకే యూఎస్ ఓపెన్​ నుంచి తప్పుకుంటున్నట్లు నాదల్ స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారీగా తగ్గించేశారు!

ఐటీఆర్​ల స్క్రూట్నీ సంఖ్యను మరోసారి భారీగా తగ్గించింది ఆర్థిక శాఖ. 2018-19 మదింపు సంవత్సరానికి దాఖలైన మొత్తం ఐటీఆర్​లలో 0.25 శాతం రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేసింది. సంఖ్యా పరంగా మాత్రం ఎన్ని రిటర్నులను ఎంపిక చేసిన విషయం వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కరోనా వేళ​ ఎన్నికలు

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ శ్రీలంక పార్లమెంట్​ ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. వైరస్​ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్​ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'బంగారు కల నెరవేరింది'

రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన పట్ల సీనియర్ నటుడు సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయం పులకించిపోతోందని అన్నారు. ఇదే విషయమై మాట్లాడిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. 'శ్రీ రామదాసు' దర్శకుడిగా తన జన్మధన్యమైందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.