1. ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
కొత్తగా ఎన్నికైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం ఆమె శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్వచ్ఛ నగరం:కేటీఆర్
రాష్ట్రంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ.. స్వచ్ఛత చాలా ముఖ్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 325 స్వచ్ఛ ఆటోలను గ్రేటర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నేడు షర్మిల సమావేశం
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో వైఎస్ షర్మిల నేడు సమావేశం కానుంది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం- బహిరంగసభ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మరో 493 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మోర 493 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొవిడ్ మళ్లీ 50 వేల మార్క్
భారత్‌లో కొవిడ్ కేసులు మరోసారి 50 వేల మార్క్‌ను దాటాయి. మరో 251 మంది కొవిడ్‌తో మరణించారు. 26 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అంబానీ ఇంటి వద్ద మరో వాహనం
అంబానీ ఇంటి వద్ద స్కార్పియో పార్క్ చేసిన ప్రాంతంలోనే ఓ ద్విచక్ర వాహనం కనిపించడం కలకలం రేపుతోంది. ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ఆర్టీఓ అధికారుల వద్ద కూడా లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నష్టాల బాటలో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల మధ్య.. సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఆ టీకా సామర్థ్యం 76 శాతం'
తాము అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా సామర్థ్యం 76 శాతం అని ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. అమెరికాలో ఈ టీకా పనితీరుపై విమర్శలొచ్చిన నేపథ్యంలో రెండోసారి టీకా సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా ప్రకటన చేయడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వికెట్ల వీరులు!
టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్‌మెన్‌కు పండగే. కానీ కొందరు బౌలర్లూ వారి ప్రతిభతో జట్టుకు విజయాలనందించారు. ఐపీఎల్ అందుకు మినహాయింపు కాదు. చాలా సందర్భాల్లో బౌలర్లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం వహించిన నేపథ్యాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సెలబ్రిటీల బ్రేకప్!
అభిమానులకు సెలబ్రిటీలు దగ్గరగా ఉండేందుకు సామాజిక మాధ్యమాలు మంచి వేదికవుతాయి. వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలన్నా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకోవాలన్న సోషల్ మీడియా వారికి మొదటి ప్రాధాన్యత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.