1. దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కేసులు
భారత్‌లో కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 29,164 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 449 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో 952 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 952 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 13,732 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి 2 తుపాకులు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పోలిస్తే తగ్గిన కాలుష్యం
రాష్ట్రంలో ఈ ఏడాది దీపావళి పండుగ రోజున భారీగా టపాసులు కాల్చారు. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి నాడు స్వల్పంగా కాలుష్యం పెరిగినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా లాభంతో 43,968 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు పెరిగి 12,867 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూఢనమ్మాకాలతో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ప్రాణం తీశారు ఇద్దరు యువకులు. ఆపే ఆమె శరీరాన్ని కోసి కాలేయాన్ని బయటకు తీశారు. ఫతేహ్‌పుర్‌లో మరో దారుణం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భాజపా ఎంపీ మనవరాలు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఎంపీ రీతా బహుగుణ ఎనిమిదేళ్ల మనువరాలు మరణించింది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చుతుండగా జరిగిన ప్రమాదంలో గాయపడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మన్మోహన్ అసాధారణ వ్యక్తి: ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గొప్ప జ్ఞానశీలిగా అభివర్ణించారు. 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పేరుతో ఒబామా రాసిన పుస్తకంలో అమెరికా అధ్యక్ష హోదాలో మన్మోహన్సింగ్ను కలినప్పటి పలు విశేషాలను పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సిరీస్ సవ్యంగా జరిగేనా?
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో అంతర్గత గొడవల కారణంగా, ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాచ్‌లు జరుగుతాయా? లేదా? అని అభిమానులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విహారయాత్రలో సెలబ్రిటీలు
లాక్డౌన్ ప్రభావం తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ విహారయాత్రలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ఛలో మాల్దీవులు అంటూ ఆ దేశంలో వాలిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.