ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@11AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

etv-bharat-top-ten-11am-news
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Oct 24, 2020, 11:00 AM IST

1. హైదరాబాద్‌లో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు

హైదరాబాద్‌లో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు ఇవ్వనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. నేటి నుంచి రైతుబజార్లలో విక్రయించనున్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దేశంలో 78లక్షలు దాటిన కేసులు

దేశంలో కొత్తగా 53వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 78లక్షలు దాటాయి. మరో 650మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా

రాష్ట్రంలో కొత్తగా 12 వందల 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల 274కరోనా కేసులను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ముంబయి మాల్​లో ఆరని మంటలు

ముంబయిలోని సిటీ సెంటర్​ మాల్​ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకులతో 36 గంటలుగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలాన్ని సందర్శించారు రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భారత్​లో ఐరాస స్టాంప్​

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్​.. పోస్టల్​ స్టాంప్​ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో ఐరాస దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చంద్రుడి గురించి కొత్త కబురు

జాబిల్లి గురించి కొత్త కబురును ఈనెల 26న వెల్లడిస్తామని తెలిపింది అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా. ఈ కొత్త ఆవిష్కారం.. సుదూర అంతరిక్ష యాత్రలకూ దోహదపడుతుందని వివరించింది. నాసాకు చెందిన 'సోఫియా' అబ్జర్వేటరీ దీనిని కనుగొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'కోలుకుంటారో..కూరుకుపోతారో తేల్చుకోండి'

డెమోక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ లక్ష్యంగా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి.. కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటారో, లేక బైడెన్​ను గెలిపించి నిరాశావాదంలో కూరుకుపోతారో తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చేరాలంటే గెలవాల్సిందే

శనివారం జరిగే మ్యాచ్​లో హైదరాబాద్​, పంజాబ్​ హోరాహోరీగా తలపడనున్నాయి. ఫ్లేఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్​ ఎంతో కీలకం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కాజల్ ఎంగేజ్​మెంట్​ !

నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్ సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.