ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ETV Bharat main news

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Dec 10, 2021, 6:10 AM IST

Updated : Dec 10, 2021, 10:00 PM IST

21:47 December 10

టాప్​న్యూస్ ​@ 10PM

  • ఏమిటీ 17 గన్‌ సెల్యూట్‌..?

Bipin Rawat funeral: భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో 17 గన్‌ సెల్యూట్‌ను సమర్పించారు. అసలు తుపాకులు, శతఘ్నులతో వందనం సమర్పించడం అంటే ఏమిటి? ఈ విధానం ఎందుకు పాటిస్తారు? ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? రావత్‌కు 17 గన్‌ సెల్యూట్‌ వందనం దేనికో తెలుసా..?

  • రూ.3.60కోట్ల బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో 7.3 కిలోల విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారం తీసుకొస్తుండగా నలుగురు సుడాన్‌ వాసులను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.

  • హెచ్ఎండీఏ ఆక్రమణలపై ప్రభుత్వం కన్నెర్ర

illegal constructions in hyderabad: హెచ్ఎండీఏ పరిధిలో ఆక్రమణలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణలపై తీసుకున్న చర్యల నివేదికను నెలాఖరులోపు ఇవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించింది.

  • 'ఆయనే 'ఆర్​ఆర్​ఆర్'కు వెన్నెముక'

RRR Press Meet : 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్పెషల్‌ చిట్‌చాట్‌ శుక్రవారం బెంగళూరులో నిర్వహించారు. తారక్‌ వరుస పంచులు.. టీమ్‌ నవ్వులు, రాజమౌళి ఆసక్తికర సమాధానాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆర్ఆర్ఆర్ చిట్​చాట్ విశేషాలు వారి మాటల్లోనే..

  • పాక్​ ఆటగాళ్లతో హర్బజన్​.. !

Harbhajan Singh Shares U-19 World Cup Photo: టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్​లో ఓ ఫొటో షేర్ చేశాడు. 1998-99 అండర్-19 వరల్డ్​ కప్ రోజులను గుర్తుచేసుకుంటూ ఈ ఫొటో షేర్​ చేసినట్లు పేర్కొన్నాడు.

20:54 December 10

టాప్​న్యూస్ ​@ 9PM

  • 'వీరుడా వందనం'.

Bipin Rawat funeral: దిల్లీలోని బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్​ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు.

  • ' ప్రాతినిధ్యం వహించటం గర్వంగా ఉంది'

Democracy summit 2021: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్యం ప్రపంచానికి కీలక సందేశాన్ని అందించినట్లు చెప్పారు. అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సులో వర్చువల్​గా పాల్గొన్నారు.

  • ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

MLC Elections Polling: ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొవిడ్​ నిబంధనల మధ్య పోలింగ్ జరిగింది.

  • ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

  • ఒక్కరోజే 7 ఒమిక్రాన్​ కేసులు

Omicron cases in India: మహారాష్ట్రలో ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.

19:57 December 10

టాప్​న్యూస్ ​@ 8PM

  • ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు..

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో ఘటన జరిగింది.

  • 'అనుమానాలుంటే కాపలా పెట్టొచ్చు'

telangana mlc elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరిగిందని సీఈవో శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు. ఐదు జిల్లాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు.

  • కరీంనగర్​లో ఫలితాలు మారనున్నాయా..?

karimnagar mlc elections 2021: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న తెరాసకు.. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఫలితాలు తారుమారు కావొచ్చనే ఆందోళన ఆ పార్టీ నాయకులను మొదటి నుంచి వెంటాడుతోంది. ఆ ఆందోళనకు కారణాలేంటంటే..?

  • 'ఆపరేషన్ దేవీ శక్తి' సక్సెస్​.

Operation Devi Shakti: అఫ్గాన్​లో చిక్కుకున్న 104మందిని ప్రత్యేక విమానంలో భారత్​కు తీసుకొచ్చింది కేంద్రం. వీరిలో 10మంది భారతీయులు ఉన్నారు. 'ఆపరేషన్ దేవీ శక్తి'లో భాగంగా ఈ ఏర్పాట్లు చేశామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులతో పాటు.. అఫ్గాన్​లోని చారిత్రక గురుద్వారాల హిందూ మత గ్రంథాలను సైతం తరలించారు.

  • పునీత్​ కోసం ఎన్టీఆర్​ భావోద్వేగం

Geleya Geleya NTR Song: కన్నడ పవర్​స్టార్ పునీత్​ను మరోసారి గుర్తుచేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పునీత్ నటించిన 'చక్రవ్యూహ' చిత్రంలోని గెలయా సాంగ్​ను పాడారు. పునీత్ లేకుండా కర్ణాటక శూన్యంగా కనిపిస్తోందన్నారు.

18:51 December 10

టాప్​న్యూస్ ​@ 7PM

  • 'చాలా గర్వంగా ఉంది'

  • కశ్మీర్​లో ఉగ్రవాదుల కాల్పులు

Terrorist attack: జమ్ముకశ్మీర్​లో శుక్రవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

  • 'ఇలా ఉంటే కష్టమే'

Ministry of Health on Omicron: భారతదేశంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 19 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • చిరు- బాలయ్య మల్టీస్టారర్​

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

  • ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అతనే..!

VVS Laxman Comments on Mayank Agarwal: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్​ ప్రదర్శనపై మాట్లాడాడు దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఆత్మవిశ్వాసంతో మయాంక్ రాణించాడని చెప్పుకొచ్చాడు.

17:44 December 10

టాప్​న్యూస్ ​@ 6PM

  • 'వీరుడా వందనం'.. రావత్​కు తుది వీడ్కోలు

  • ' వాళ్లకు నచ్చినవి తింటారు-?'

Gujarat High Court Non Veg: అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​పై (ఎఎంసీ) గుజరాత్​ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని తేల్చిచెప్పింది. మాంసాహార విక్రయదారులే లక్ష్యంగా ఏఎంసీ చర్యలు చేపడుతోందని వీధి వ్యాపారులు ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై ఈ విధంగా స్పందించింది.

  • ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది.

  • పెళ్లైన 6 నెలలకే అనుమానంతో..!

కొత్త కాపురం.. కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన నవ వధువుకు.. భర్త ప్రేమానురాగాలకు బదులుగా అనుమానాలు స్వాగతం పలికాయి. పెళ్లికి ముందు ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తి.. ఇప్పుడిలా మాట్లాడుతున్నాడేంటని అనిపించినా.. మారతాడులే అని సర్దుకుపోయింది. కానీ రోజురోజుకీ అతని ఆగడాలు మితిమీరిపోయాయి. ఎంతగా అంటే లేనిపోని అనుమానాలతో కన్న తల్లిదండ్రులతోనూ ఆమెను మాట్లాడనివ్వలేదు. అయినా ఓర్చుకుంది. కానీ చివరికి తన భర్త చేతిలోనే శవమై మిగిలింది.

  • ఉద్యోగులకు భారీ బోనస్​

Google Bonus For Employees: టెక్​ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్​.. ఉద్యోగులకు భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సుమారు 1600 డాలర్లను బోనస్​గా ప్రకటించింది.

16:53 December 10

టాప్​న్యూస్ ​@ 5PM

  • అంతకు ముందు ఏం జరిగింది?

Bipin Rawat helicopter video: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కూలిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? చాపర్​ను వీడియో తీసిన వై.జో అనే వ్యక్తిని ఈటీవీ భారత్​ కలవగా.. కీలక విషయాలను వివరించారు.

  • మరో ముగ్గురికి ఒమిక్రాన్

Omicron cases in Gujarat: దేశంలో మరో ముగ్గురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. గుజరాత్​లో ఇద్దరు, ముంబయిలో ఒకరికి వైరస్​ సోకింది. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు వైరస్​ను జయించారు.

  • ఒకే వేదికపై చంద్రబాబు.. దగ్గుబాటి ఫ్యామిలీ

Chandrababu- Daggubati Venkateswara rao: రాజకీయంగా కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్న ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై కలిశారు. రాజకీయ విభేదాలు పక్కకు నెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారే ఒకరు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు. ఇంతకీ వీరిద్దరూ ఎక్కడ కలిశారంటే..

  • ''అఖండ' మాకు బూస్ట్​ ఇచ్చింది'

Pushpa Movie News: లాక్​డౌన్​ తర్వాత విడుదలైన 'అఖండ' చిత్రం భారీ విజయం సాధించి.. తమకు బూస్ట్​ ఇచ్చిందని 'పుష్ప' నిర్మాతలు అన్నారు. ఇక పుష్ప సినిమాలో ది బెస్ట్​ అల్లుఅర్జున్​ను చూస్తారని తెలిపారు.​

  • 'రహానేను అందుకే '

MSK prasad on Rahane: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు అవకాశం రావడంపై స్పందించాడు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. విదేశీ పిచ్‌లపై రహానే మెరుగ్గా రాణించగలడని అన్నాడు. అందుకే సెలెక్టర్లు అతడికి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

15:41 December 10

టాప్​న్యూస్ ​@ 4PM

  • రావత్​ దంపతులకు తుది వీడ్కోలు- కన్నీరుమున్నీరైన వృద్ధురాలు

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ పార్థివ దేహాల వద్ద ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది.

  • సీఎం విమానం ల్యాండింగ్​లో టెన్షన్..!

Flight Basavaraj Bommai: ప్రతికూల వాతావరణం కారణంగా కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది. ఫలితంగా చాలా సేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఫ్లైట్​లో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి కూడా ఉన్నారు.

  • మంత్రి ఎదుటే తెరాస నేతల వాగ్వాదం

trs leaders internal fight : వికారాబాద్ జిల్లా తెరాస నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. తాండూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • 'ఆర్ఆర్ఆర్' 3 గంటలపైనే..!

త్వరలో రాబోయే భారీ బడ్జెట్​ సినిమాల నిడివి ఎంతో తెలిసిపోయింది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' గురించి తెలియగా.. 'పుష్ప', 'రాధేశ్యామ్' నుంచి కూడా ఇప్పుడు అప్డేట్ వచ్చింది!

  • సైబర్ వలలో మాజీ క్రికెటర్..!

Former Cricketer Vinod Kambli: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

14:35 December 10

టాప్​న్యూస్ ​@ 3PM

  • రావత్​ దంపతుల అంతిమయాత్ర..

దిల్లీలో సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ అంతిమయాత్ర సాగుతోంది. దారిపొడవున ప్రజలు జెండాలతో వారికి సెల్యూట్​ చేస్తున్నారు.

  • రావత్​కు అమిత్​ షా, అజిత్ డోభాల్​ నివాళి

Bipin Rawat last rites: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్​కు ప్రముఖలు నివాళులర్పించారు

  • బూస్టర్ డోస్ అప్పుడే!

Booster Dose: ఒమిక్రాన్ వ్యాప్తి​ నేపథ్యంలో బూస్టర్​ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు పేర్కొంది.

  • ' ఇక విజ్ఞప్తులు చేయం.. '

KTR Pressmeet on Textiles: రాష్ట్ర సర్కార్ చేనేత రంగాభివృద్ధికి ఎంత కృషి చేసినా.. కేంద్రం నుంచి సహకారం అందడంలేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఏడేళ్లుగా కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయమని... ప్రజల పక్షాన డిమాండ్ చేస్తామని తెలిపారు.

  • యాషెస్ టెస్టులో లవ్ ప్రపోజల్.. ?

Ashes Proposal: యాషెస్ సిరీస్​లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఇంగ్లాండ్ ఫ్యాన్.. ఆస్ట్రేలియా అభిమానికి స్టాండ్స్​లోనే ప్రపోజ్ చేశాడు. మరి ఆమె ఒప్పుకుందో? లేదో? తెలుసుకోండి.

14:08 December 10

టాప్​న్యూస్ ​@ 2PM

అవేవీ నమ్మొద్దు

సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ట్రై-సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) తెలిపింది. ఆ విచారణ పూర్తయ్యే వరకు ప్రమాదంపై ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వవద్దని కోరింది.

కొత్త సీడీఎస్.?

సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన నేపథ్యంలో.. తదుపరి సీడీఎస్​ ఎంపిక ప్రక్రియను కేంద్రం అతి త్వరలోనే ప్రారంభించనుంది. ఇందుకోసం ఆర్మీ, నేవీ, వాయుసేనకు చెందిన సీనియర్​ కమాండర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. అయితే.. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవణెకు త్రిదళాధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

3 గంటలపైనే

మొదటికే మోసం!

Money Saving Tips: ఇటీవల కాలంలో స్టాక్​మార్కెట్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. చాలామంది లాభపడ్డారు. దీనిని చూసి కొందరు ఇప్పుడిప్పుడే మార్కెట్​లోకి అడుపెట్టాలని అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనే ఆశతో అప్పు చేసి మరీ పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఇది వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెడుతుందని నిపుణులు చెప్తున్నారు.

కెప్టెన్​గా రోహిత్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే?

Ravi Shastri on Rohit Sharma: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్​గా ఎంపికైన రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. అతడు అనవసర విషయాలకు స్పందించడని పేర్కొన్నాడు.

12:54 December 10

టాప్​న్యూస్ ​@ 1 PM

  • మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

AP CID Raids : హైదరాబాద్​లోని మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. లక్ష్మీనారాయణ పలు అక్రమాలు చేశారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

  • ఓటేసిన ప్రముఖులు

MLC Elections Voting : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 12 స్థానాలకు 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మరో 6 స్థానాలకు ఇవాళ పోలింగ్​ జరుగుతోంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు పలు జిల్లాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • సీఎం​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్​లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి కరణం రవికుమార్(40) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో మృతుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

  • 'ఆర్ఆర్ఆర్' రికార్డుల మోత

RRR trailer record: 'ఆర్ఆర్ఆర్' సినిమా రోజురోజుకు అంచనాలు పెంచేస్తుంటే.. మరోవైపు ట్రైలర్​ రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజైన 24 గంటల్లో దేశంలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ట్రైలర్​గా నిలిచి ఘనత సాధించింది.

  • సచిన్ చెక్కుచెదరని రికార్డు

Sachin Tendulkar breaks Sunil Gavaskars Record: టెస్టుల్లో అత్యధిక సెంచరీలు ఎవరివంటే వెంటనే గుర్తొచ్చే పేరు సచిన్ తెందూల్కర్. అయితే సచిన్ కంటే ముందు ఈ రికార్డు మరో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. అతడి రికార్డును సచిన్ తిరగరాసింది ఈరోజే.

11:47 December 10

టాప్​న్యూస్ ​@ 12PM

  • రావత్ దంపతులకు ప్రముఖుల నివాళి

సీడీఎస్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులిక రావత్​కు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీలు బిపిన్​ రావత్​ దంపతులకు నివాళులర్పించారు.

  • సైబర్ చీటర్స్​కు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్

Cyber Crime case : సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లాట్ రెంట్ పేరిట రాజస్థాన్ భరత్​పూర్​కి చెందిన నిందితుడు సునీల్​... సైబర్ నేరస్థులకు సహకరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  • వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​!

Vivo Y55s 5G Features: స్మార్ట్​ఫోన్​ ప్రియులకు శుభవార్త. వివో మొబైల్​ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. వివో వై55ఎస్​ 5జీ మోడల్​ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్​ ఫీచర్స్​ ఏంటో చూద్దాం.

  • రోహిత్ ముందున్న కీలక సవాళ్లివే!

Rohit Sharma ODI Captain Challenges: ఇటీవలే టీ20 కెప్టెన్​గా ఎంపికైన రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇకపై టెస్టులకు కోహ్లీ, పరిమిత ఓవర్లకు రోహిత్ సారథ్య బాధ్యతలు వహించనున్నారు. అయితే ప్రస్తుతం రెండేళ్లలో రెండు ప్రపంచకప్​లు ఉన్న దృష్ట్యా.. రోహిత్​ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవేంటో చూద్దాం.

  • సమంతకు ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డు

Samantha family man 2: స్టార్ హీరోయిన్ సమంత మరో ఘనత సాధించింది. ఇప్పటికే దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించి, అభిమానుల్ని మెప్పించిన సామ్.. వారి అభిమానంతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో అవార్డు చేరింది.

11:02 December 10

టాప్​న్యూస్ ​@ 11AM

  • కొనసాగుతున్న సింగరేణి కార్మికుల సమ్మె

సింగరేణిలో 4 గనుల వేలాన్ని నిరసిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కార్మికులంతా ఇళ్ల వద్దే ఉంటూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని మద్దతునిస్తున్నారు. దీనివల్ల సింగరేణిలో నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

  • బ్రిగేడియర్‌ లిద్దర్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ భౌతికకాయానికి దిల్లీ బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

  • 'రావత్‌.. నీళ్లు కావాలని అడిగారు'

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ జనరల్ రావత్ ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతావనికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే.. హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో మంటల్లో చిక్కుకున్న తర్వాత కొంతసేపు జనరల్‌ రావత్‌ ప్రాణాలతోనే ఉన్నారని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారని ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు చెబుతున్నారు.

  • 'గమనం' సినిమా ఎలా ఉందంటే?

Shriya gamanam: శ్రియ, నిత్యామేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'గమనం'.. థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

  • తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్..

Ashes 2021 live: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో 425 పరుగులకు ఆలౌటైన కంగారూ జట్టు కీలక ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

09:55 December 10

టాప్​న్యూస్​@ 10AM

  • నివాసానికి రావత్ దంపతుల భౌతికకాయాలు

Last Rites of CDS: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో నేడు సాయంత్రం జరగనున్నాయి.

  • భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​లో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యను... భర్త కిరాతకంగా హత్య చేశాడు. రాజేంద్రనగర్​లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ భార్య సమ్రిన్​తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్-సమ్రిన్​లకు 14 ఏళ్ల క్రితం వివాహం కాగా.. భర్త వేధింపులు తాళలేక సమ్రిన్ విడాకులు తీసుకుంది. భార్యకు నచ్చజెప్పిన ఫర్వేజ్​... గతేడాది ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

  • ఏపీ, తెలంగాణలో తగ్గిన పసిడి ధర

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.76 తగ్గింది. కిలో వెండి ధర రూ.882 మేర దిగొచ్చింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • ప్రతి ఆటగాడితో ద్రవిడ్​కు అనుబంధం

Rohit Sharma praises Rahul Dravid: టీమ్ఇండియా వన్డే కెప్టెన్​గా ఎంపికైన రోహిత్ శర్మ.. కోచ్ రాహుల్ ద్రవిడ్​పై ప్రశంసల జల్లు కురిపించాడు. ద్రవిడ్‌కు ప్రతి ఆటగాడితో మంచి అనుబంధం ఉందని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి నిర్వర్తించాల్సిన పాత్రల గురించి స్పష్టతనిస్తాడని రోహిత్ పేర్కొన్నాడు.

  • హాలీవుడ్ ఛాన్స్​ వచ్చినా.. అలానే చేస్తా

RRR Trailer Launch: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. గురువారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

08:54 December 10

టాప్​న్యూస్​@ 9AM

  • కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

MLC Election Polling 2021 : తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • ఘోర ప్రమాదం- 53 మంది దుర్మరణం

Mexico road accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 53 మంది మరణించారు. 54 మంది గాయపడ్డారు.

  • 'న్యాయవాద వృత్తిని వ్యాపారంగా చూడొద్దు'

CJI NV Ramana on law course: న్యాయవాద వృత్తి చాలా గొప్పదని.. విద్యార్థులు వ్యాపారంగా చూడొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. లాభార్జన కోసం ఈ వృత్తిని ఉపయోగించొద్దని హితవు పలికారు. మరోవైపు గదుల్లోనే చిన్నారుల ప్రతిభ ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

  • ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ

Home Rates: దేశవ్యాప్తంగా 2022లో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. 'ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్పేస్‌'కు గిరాకీ ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది.

  • కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా!

ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ట్రైలర్ రిలీజైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్​లో చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

08:02 December 10

టాప్​న్యూస్​@ 8AM

  • ఎన్నికల పోలింగ్ ప్రారంభం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన, భద్రతా సన్నద్ధత సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

  • ప్రమాదం గుట్టు విప్పే బ్లాక్‌ బాక్స్‌

సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్ తాలూకు బ్లాక్​ బాక్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో ఇది లభ్యమైంది. ప్రమాదానికి కారణాలను నిగ్గు తేల్చడంలో ఇది కీలక పాత్ర పోషించబోతోంది.

  • రిటైల్‌ మదుపర్ల కోసం అల్గో ట్రేడింగ్‌

Algo trading: స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్‌లో భద్రతను పెంచడం కోసం, అవకతవకలు జరగకుండా చూసేందుకు రిటైల్‌ మదుపర్ల కోసం ప్రత్యేకంగా అల్గారిథమ్‌ ట్రేడింగ్‌(అల్గో ట్రేడింగ్‌)ను తీసుకురావడానికి నిబంధనావళిని సెబీ ప్రతిపాదించింది. ఇంతకీ అల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? దానితో కలిగే ప్రయోజనాలు ఏంటి?

  • హైదరాబాద్​ జోరు.. ఆంధ్రకు ఓటమి

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకోగా.. జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ ఆంధ్ర ఓటమిపాలైంది. గురువారం జరిగిన మ్యాచ్​ల్లో దిల్లీపై హైదరాబాద్ విజయం అందుకోగా.. విదర్భ చేతిలో ఆంధ్ర పరాజయంపాలైంది.

  • తొమ్మిదిరోజులు నీళ్లు తాగలేదు

Naga shourya interview: 'లక్ష్య' విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు హీరో నాగశౌర్య. ఆర్చరీని గుర్తుచేద్దామనే ఈ సినిమా చేశానని అన్నారు.

06:51 December 10

టాప్​న్యూస్​@ 7AM

  • ఉపాధి పొందేందుకు మార్గాలు

పొట్ట చేత పట్టుకొని ఉపాధి మీద ఆశతో ఎడారి దేశాలకు వెళ్తున్న వలస కార్మికులను నకిలీ ఏజెంట్లు అనేక రకాలుగా మోసగిస్తున్నారు. వర్క్‌ పర్మిట్‌ వీసాలకు బదులు పర్యాటక వీసాలను అంటగడుతూ పరాయి గడ్డపై కష్టాలపాలు చేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో 44 మంది మహిళలు ఇలాగే వెళ్తూ ఇమిగ్రేషన్‌ అధికారులకు దొరికిపోయారు.

  • వధువును సంతోషపెట్టడానికి..

గాజియాబాద్​లో ఓ వరుడు చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసింది. పెళ్లి కూతురును సంతోషపెట్టడానికి పెళ్లిలోనే గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియో సామాజికా మాధ్యమాల్లో వైరల్​గా​ మారింది.

  • డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

vaccine hoarding who: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కరోనా టీకాలు పూర్తి స్థాయిలో పంపిణీ అయితేనే కరోనాపై విజయం సాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ పునరుద్ఘాటించింది. సంపన్న దేశాల టీకా నిల్వలు కరోనా కొనసాగింపునకు కారణమని హెచ్చరించింది.

  • భారత హాకీకి కొవిడ్ దెబ్బ

Asian Champions Trophy Hockey 2021: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత మహిళల జట్టు అర్ధాంతరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. జట్టులోని ఓ సభ్యురాలికి కరోనా సోకడమే ఇందుకు కారణం.

  • సుకుమార్​-బన్నీకి దణ్ణం పెట్టేశా

'పుష్ప' పాటల కోసం ఎంతలా కష్టపడ్డానో గేయరచయిత చంద్రబోస్ వివరించారు. అలానే సినిమాలోని మూడు సీన్లు చూసి బన్నీ-సుకుమార్​కు దణ్ణం పెట్టేశానని అన్నారు.

03:59 December 10

టాప్​న్యూస్​@ 6AM

  • నేడే రావత్ అంత్యక్రియలు..

Cremation of CDS General Rawat: సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం దిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు.

  • బిపిన్‌ రావత్‌కు'సైకత' నివాళి

Sand Art on CDS General Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌కు ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

  • సర్వం సిద్ధం..

MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన, భద్రతా సన్నద్ధత సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

  • మాయమవుతున్న మైదానాలు...

Govt utilizing public school Places: సర్కారు పాఠశాలల్లో మైదానాలు మాయం అవుతున్నాయి. ప్రభుత్వపరమైన ఏ నిర్మాణం చేపట్టాలన్నా ప్రభుత్వ బడుల్లోని స్థలాలనే వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల్లోనే ఆట స్థలాల కొరత ఎక్కువగా ఉండేది. ఆ దుస్థితి ఇప్పుడు సర్కారు బడులకూ వచ్చింది.

  • గల్ఫ్‌ యానానికి రాచబాటలివిగో..

Safe ways to get job in Gulf: గల్ఫ్‌ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు వలస వెళ్తున్న నేపథ్యంలో బోగస్‌ ఏజెంట్ల మోసాలు ఎలా జరుగుతుంటాయి.. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందేందుకు సురక్షిత మార్గాలేంటి.. వంటి అంశాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

  • ఆధార్, పాన్‌ కార్డు ఎవరికైనా ఇస్తున్నారా?..

CYBER CRIME:అతడిది ఒక చిన్న దుకాణం... కానీ, 26 లక్షల పన్ను కట్టాలని నోటీసు వచ్చింది...! మీకు తెలియకుండానే... మీ ఆధార్‌, పాన్‌కార్డులతో రుణాలు తీసుకుని సైబర్‌ నేరస్థులు మోసాలు చేస్తున్నారు. నిన్నటివరకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేసిన కేటుగాళ్లు... ఇప్పుడు గుర్తింపు కార్డుల క్లోనింగ్‌ ద్వారా కోట్లు కొళ్లగొడుతున్నారు.

  • చట్టప్రకారమే జరిగింది..

TS HIGH COURT: డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. చట్టప్రకారమే మహేందర్ రెడ్డి నియామకం జరిగిందన్న ఏజీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం...పిల్​ను కొట్టేసింది.

  • డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

vaccine hoarding who: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కరోనా టీకాలు పూర్తి స్థాయిలో పంపిణీ అయితేనే కరోనాపై విజయం సాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ పునరుద్ఘాటించింది. సంపన్న దేశాల టీకా నిల్వలు కరోనా కొనసాగింపుకు కారణమని హెచ్చరించింది.

  • 'చేసిన తప్పే చేస్తున్నారు'

VVS Laxman on Team India: భారత జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.

  • 'హాలీవుడ్ ఛాన్స్​ వచ్చినా.. అలానే చేస్తా'

Last Updated : Dec 10, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.