ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Dec 8, 2021, 6:10 AM IST

Updated : Dec 8, 2021, 10:01 PM IST

21:55 December 08

టాప్ న్యూస్@ 10PM

  • సీడీఎస్​ బిపిన్‌ రావత్‌ దుర్మరణం- ప్రముఖుల నివాళి

తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొన్నారు

  • హెలికాప్టర్‌ ప్రమాదాల్లో ప్రముఖులు

Bipin Rawat passed away: హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్​ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో చరిత్రలో జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు చాలామందే ఉన్నారు.

  • 'ఆయన​ సేవలు అమూల్యం'

CDS Rawath death: భారత త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్​ అకాల మరణం పట్ల గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.

  • 'అఖండ' గ్రాండ్​ సక్సెస్​ మీట్

థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న 'అఖండ'.. వైజాగ్​లో సక్సెస్​ మీట్​ జరిపేందుకు సిద్ధమైంది. గురువారం సాయంత్రం ఈ వేడుక జరగనుంది.

  • మహీ లేకుంటే నా కెరీర్​ లేదు

తనకు ధోనీతో ఉన్న అనుబంధం గురించి స్టార్ ఆల్​రౌండర్ బ్రావో చెప్పాడు. మహీ లేనిదే తన కెరీర్​ లేదని అన్నాడు. సీఎస్కేలో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఆడారు.

20:54 December 08

టాప్ న్యూస్@ 9PM

  • ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి....

Bipin Rawat passed away: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ తమిళనాడు కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, 2015లోనే ఇటువంటి హెలికాప్టర్​ ప్రమాదానికి గురై.. మృత్యువును జయించారు. కానీ, బుధవారం అలాంటి హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

  • ​ సీడీఎస్​ రావత్​ దుర్మరణం

Bipin Rawat passed away: హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్​ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

  • బిపిన్​ రావత్​ నిజమైన దేశభక్తుడు

Bipin Rawat passed away: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

  • బొగ్గు వేలం ఆపేయండి

KCR letter to Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. ఈసారి.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీని కోరుతూ కేసీఆర్​ లేఖ రాశారు.

  • వన్డే కెప్టెన్​గా రోహిత్​ శర్మ

టీమ్​ఇండియా నూతన వన్డే కెప్టెన్​గా రోహిత్​ శర్మను నియమించింది బీసీసీఐ. ఈ మేరకు ఆల్​ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ఇటీవలే విరాట్​ కోహ్లీ నుంచి టీ20లు పగ్గాలు అందుకున్న రోహిత్​ను​.. వన్డేలకూ సారథిగా నియమిస్తున్నట్లు తెలిపింది.

19:51 December 08

టాప్ న్యూస్@ 8PM

  • వేలం ఆపేయండి

వేలం ఆపేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. సింగరేణిలో తలపెట్టిన 4 కోల్‌బ్లాక్స్ వేలం నిలిపివేయాలని సీఎం కోరారు.

  • హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ వాసి మృతి

తమిళనాడులోని కూనురులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామవాసి సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు

  • సినిమాకు తీసిపోని ట్విస్ట్​..!

కల్యాణమండపంలో పెళ్లి పీటలపై ముహూర్తం సమయానికి తాళి కట్టించుకోవాల్సిన వధువు.. రోడ్డుపై ట్రాఫిక్​లో దర్శనమిచ్చింది. పెళ్లికి మాట్లాడుకున్న వీడియోగ్రాఫర్ల కెమెరాల్లో అందంగా కన్పించాల్సిన వధువును.. మీడియా కెమెరాలు కవర్​ చేశాయి.

  • 'పుష్ప' స్పెషల్ సాంగ్ అప్డేట్..

చలికాలంలో హీట్​ పెంచే అప్డేట్ 'పుష్ప' నుంచి వచ్చేసింది. సమంత స్పెషల్ సాంగ్​ ఈనెల 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

18:46 December 08

టాప్ న్యూస్@ 7PM

  • మోదీ సహా ప్రముఖుల నివాళి

హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా దిల్లీ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

  • ఆ 4 గంటల్లో ఏం జరిగింది?

Army helicopter crash: సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్.. తాను చదువుకున్న కళాశాలకు వెళ్తూ ​ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలలో జరిగే కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ కుప్పకూలింది.

  • 'ఆర్ఆర్ఆర్' నిడివి ఎంతంటే?

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర సెన్సార్ పూర్తయింది. ఇంతకీ సినిమా నిడివి ఎంతంటే?

  • షకీబ్ రికార్డ్

shakib al hasan news: బంగ్లాదేశ్ స్టార్​ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్ మరో రికార్టు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 4వేల పరుగులు సహా 200 ప్లస్ వికెట్లు సాధించిన క్రికెటర్​గా నిలిచాడు.

17:54 December 08

టాప్ న్యూస్@ 6PM

  • సీడీఎస్​ చాపర్​లోని 13 మంది మృతి..

తమిళనాడు కూనూర్​ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను డీఎన్​ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్లు తెలిపాయి.

  • హెలికాప్టర్​ భద్రతపై అనుమానాలు!

Army chopper crash: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ తమిళనాడు కోయంబత్తూర్​ సమీపంలోని కూనూర్​లో ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణించింన ఎంఐ-17వీ5 హెలికాప్టర్​ రష్యాకు చెందిన సంస్థ తయారు చేసింది. ఈ ప్రమాదానికి గురికావటం వల్ల చాపర్​ భద్రతపై చర్చ మొదలైంది.

  • పది అడుగుల 'కింగ్​ కోబ్రా'.

Kerala King Cobra: కేరళ ఎర్నాకుళంలో భారీ తాచుపాము కంటపడింది. కొత్తమంగళం సమీపంలోని వడట్టుపర వద్ద పనిచేస్తున్న కార్మికులు ఈ భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు.

  • 'ఇప్పుడు మాదే రియల్ కాంగ్రెస్'

Jago Bangla On Congress Party: దేశంలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్​ పార్టీని 'యుద్ధంలో అలసిపోయిన గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ'గా అభివర్ణించింది టీఎంసీ. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను నిర్వర్తించడంలో ఆ పార్టీ విఫలమైందని.. ప్రస్తుతం తామే 'నిజమైన కాంగ్రెస్‌' అని ప్రకటించింది. ఈ మేరకు తన అధికార పత్రికలో ఓ కథనాన్ని ప్రచురించింది.

  • ' తెలుగులో కొత్తేం కాదు!

'అఖండ' చిత్రంలో అఘోరాగా తెరపై బాలయ్య సృష్టించిన విధ్వంసాన్ని అభిమానులు ఇప్పుడప్పుడే మరచిపోలేరు. తమన్ అందించిన సంగీతానికి తోడు బాలయ్య డైలాగులతో థియేటర్లలో మాస్​ జాతర జరుగుతోంది

16:39 December 08

టాప్ న్యూస్@ 5PM

  • హెలికాప్టర్​ క్రాష్​పై ప్రకటన రేపే

Army chopper crash: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ తమిళనాడులో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రమాదంపై వివరించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​. అనంతరం సీడీఎస్​ రావత్​ నివాసానికి వెళ్లారు.

  • హెలికాప్టర్​ క్రాష్​ లైవ్ వీడియో!

Army chopper crash: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ తమిళనాడులో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

  • బ్రహ్మోస్ 'ఎయిర్​ వెర్షన్' సక్సెస్

Brahmos Air Version Test: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'ఎయిర్ వెర్షన్‌'ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్ సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) వర్గాలు తెలిపాయి.

  • దర్శకుడిగా హీరో..

బాలీవుడ్​ కథానాయకుడు డైరెక్టర్​గా మారారు. తన భార్యనే హీరోయిన్​గా పెట్టి, ఓ సినిమా తీస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ సినిమా తీస్తున్నారు?

  • వేలంలో దిగ్గజ బ్రాడ్​మన్ బ్యాట్​

Bradman bat auction: దిగ్గజ క్రికెటర్ సర్ బ్రాడ్​మన్ ఉపయోగించిన అపూర్వ బ్యాట్​ వేలానికి వచ్చింది. 1934 యాషెస్​ సిరీస్​లో బ్రాడ్​మన్ రెండు సార్లు త్రిశతకాలను ఈ బ్యాట్​తోనే చేయడం విశేషం.

15:48 December 08

టాప్ న్యూస్@ 4PM

  • సీడీఎస్​​ పరిస్థితిపై ఆందోళన

Army Chopper Crash: తమిళనాడు కూనూర్​ సమీపంలో మిలిటరీ చాపర్​ కూలిపోయింది. ప్రమాద సమయంలో చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • ​ ఆ కేసులో అసలు ట్విస్ట్​ ఏంటంటే?

అప్పటికే కాస్త డిప్రెషన్​లో ఉన్న అమ్మాయి.. కాలేజీకి వెళ్తేనన్న సెట్​ అవుతాననుకుంది. తనకు తెలిసిన ఆటోడ్రైవర్​తో కలిసి కళాశాల వరకు వెళ్లింది. కానీ.. ఆ డ్రైవర్​ చెప్పిన మాయమాటలు విని అతడితో పాటు మేడిపల్లికి వెళ్లింది. నమ్మి వెళ్లినందుకు మిగతా ఆటోడ్రైవర్లతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

  • స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ బూస్ట్​

Stock Market Today India: ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలతో స్టాక్​ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగింది. సెన్సెక్స్​ 1016 పాయింట్లకుపైగా లాభంతో 58,649 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 239 కుపైగా పాయింట్లు లాభపడింది.

  • మయాంక్ పైకి.. అశ్విన్ రెండుకు

ICC Test ranking: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకాడు. అశ్విన్.. బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

  • ఓటీటీలో 'థాంక్యూ'?..

చైతూ 'థాంక్యూ' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారనే వార్తలపై టీమ్​ స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం వెండితెరపైనే చూపించాలని అనుకుంటున్నామని వెల్లడించింది.

14:34 December 08

టాప్ న్యూస్@ 3PM

  • సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్

తమిళనాడులో త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది.

  • భారత్ బయోటెక్ విరాళం

Bharat Biotech MD: భారత్​ బయోటెక్​ ఎండీ డా. కృష్ణ ఎల్ల మంగళవారం.. సతీసమేతంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం.. ఆయన అన్నదానం కార్యక్రమం కోసం ఆలయానికి రూ. కోటి విరాళం ప్రకటించారు.

  • '5జీ వస్తేనే డిజిటల్​ ఫలితాలు'

ఐదో తరం సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో డిజిటల్​ విప్లవాన్ని కొత్తపుంతలు తొక్కించవచ్చని రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ అన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే.. ప్రజలకు డిజిటల్​ విప్లవ ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ఈ సాంకేతికతను దేశ ప్రాధాన్యం ఉన్న అంశంగా గుర్తించాలని కోరారు.

  • ​ 'రాధేశ్యామ్'​ మరో సాంగ్​

RadheyShyam song Release: ప్రభాస్​, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్'​ చిత్రంలోని 'సోచ్ ​లియా' సాంగ్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇది శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.

  • కరోనాతో మ్యాచ్ రద్దు

Asian Champions Trophy Hockey 2021: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత జట్టులో ఒకరికి కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్​ను అధికారులు రద్దు చేశారు.

13:27 December 08

టాప్ న్యూస్@ 2PM

  • కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

తమిళనాడు కూనూర్​లో ఓ శిక్షణ హెలికాప్టర్​ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ​ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

  • అక్రమ నిర్మాణాల తొలగింపు.. ఉద్రిక్తత

Tension at Gachibowli: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బసవతారకనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ అక్రమంగా వెలసిన 208 గుడిసెలను రెవెన్యూ అధికారుల తొలగించారు. రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ పర్యవేక్షణలో.... భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలను కూల్చివేశారు.

  • మహిళను వివస్త్రను చేసి..

Woman Stripped: మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళపై అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. చిన్న కారణంతో.. ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొడుతూ ఊళ్లో తిప్పారు. సంబంధిత వీడియో వైరల్​గా మారగా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు.

  • 'ఆర్​ఆర్​ఆర్'​ భీమ్​ గ్లింప్స్

డిసెంబరు 9న 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేస్తూ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇస్తోంది చిత్రబృందం.​ మంగళవారం రామ్​చరణ్​కు(రామ్​ పాత్ర) సంబంధించిన గ్లింప్స్​ను ఎన్టీఆర్​ విడుదల చేయగా.. నేడు(బుధవారం) తారక్​కు(కొమురం భీమ్​) సంబంధించిన గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు చరణ్​.

12:53 December 08

టాప్ న్యూస్@ 1PM

  • ట్రిపుల్ మర్డర్ చేసి 11 ఏళ్లుగా పరారీ

Ex-Iaf Man held after 11 years: ఇద్దరు పిల్లలు సహా భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు అతడు. అరెస్టయ్యాక కారంపొడి జల్లి.. పోలీసుల చెర నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. వేరే ప్రాంతానికి చేరుకుని మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు. అలా 11 ఏళ్లపాటు పరారీలో ఉన్న అతడ్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

  • ఉద్యోగం రావట్లేదని యువకుడు ఆత్మహత్య

Unemployment Suicide at Vikarabad: వికారాబాద్ కుల్కచర్లలో విషాదం చోటు చేసుకుంది. నిరుద్యోగంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లకు చెందిన శ్రీనివాస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మధ్యలో లాక్​డౌన్ రావడంతో మరింత కుంగిపోయాడు.

  • ఒక్క శాతం జనాభా వద్దే 22% ఆదాయం!

World inequality report 2022: ప్రపంచంలోనే తీవ్రమైన అసమానతలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. 22 శాతం జాతీయాదాయం దేశంలోని ఒక శాతం ప్రజల వద్దే ఉందని ఓ నివేదికలో తేలింది. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం జనాభా సంపద వాటా కేవలం 13 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. భారత్​లో లింగ అసమానతలు కూడా తీవ్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

  • వన్డే కెప్టెన్సీపై సెలెక్టర్ల మంతనాలు!

Rohit Kohli ODI Captaincy: రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ అప్పగించే విషయమై బోర్డు ఆలోచిస్తోందని తెలిపారు ఓ బీసీసీఐ అధికారి. ఈ నిర్ణయం తీసుకునే ముందు కోహ్లీతో పాటు రోహిత్​తో చర్చలు జరిపాలని టీమ్ఇండియా సెలెక్టర్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.

  • ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి​

Jacqueline Fernandez News: మనీలాండరింగ్​ కేసులో మరోసారి ఈడీ ఎదుట హాజరైంది బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో ఆమెను అధికారులు విచారిస్తున్నారు.

11:58 December 08

టాప్ న్యూస్@ 12PM

  • భార్యలు తిట్టారని.. ఇద్దరు ఆత్మహత్య

Two men Committed Suicide: సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు లక్ష్మయ్య, వెంకట్​గా గుర్తించారు.

  • మరింత మెరుగుపరచాలి : గవర్నర్‌

Vidyut Niyantran Bhavan: లక్డీకాపూల్​లో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి భవన నిర్మాణానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భూమి పూజ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలని గవర్నర్ సూచించారు.

  • గబ్బిలాలతో మనకు లాభాలెన్నో

Importance of Bats: నిశాచర జీవి అయిన గబ్బిలంతో మానవాళికి, పర్యావరణానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వరిపైరును ఆశించే పురుగులను తినడం ద్వారా పలు రకాల తెగుళ్ల నుంచి పంటను గబ్బిలాలు కాపాడుతున్నాయి. ఇవి వైరస్​కు ఆవాసాలైనప్పటికీ.. గబ్బిలాలు జబ్బుపడవు. అయితే అభివృద్ధి, ఆధునికతల వల్ల గబ్బిలాల ఆవాసాలు ధ్వంసమవుతున్నాయి. వాటిల్లోని వైరస్​లు మానవుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఏర్పడుతోంది.

  • టెస్టుల్లో తొలి బంతికే వికెట్

AUS vs ENG Ashes 2021: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ సిరీస్​లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఈ ఘనత సాధించాడు స్టార్క్.

  • టార్గెట్‌ చేసి ఇబ్బంది పెట్టొద్దు: బ్రహ్మానందం

Alitho Saradaga Brahmanandam: తనను నవ్వించేవారు ఎవరు? ఎప్పుడు అవమాన పడ్డారు? ప్రస్తుత కమెడియన్లలో ఎవరంటే ఇష్టం? సహా పలు విశేషాలు గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి తెలిపారు హాస్యనటుడు బ్రహ్మానందం. ఆ ఆసక్తికర సంగతులు మీకోసం..

10:48 December 08

టాప్ న్యూస్@ 11AM

  • కీలక వడ్డీ రేట్లు యథాతథం

నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. మరోసారి కీలక వడ్డీ రేట్లను వరుసగా 9వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

  • వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం

హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అధునాతన వసతులను అందుబాటులోకి తెచ్చారు. అదనపు పడకల సముదాయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  • రాత్రికి రాత్రే లక్షాధికారైన కూలీ

Labourer finds diamond: రాత్రికి రాత్రే ఓ గిరిజన రైతుకూలీ లక్షాధికారిగా మారాడు. గనుల్లో పని చేసే అతనికి రూ.60లక్షలు విలువ చేసే ఓ వజ్రం(mine labourer finds diamond) దొరికింది. దీంతో అతను సంతోషంలో మునిగిపోయాడు.

  • కమిన్స్ విధ్వంసం.. ఇంగ్లాండ్ ఆలౌట్

AUS vs ENG Ashes 2021: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 147 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్. ఆసీస్ కెప్టెన్, పేసర్ కమిన్స్​ 5 వికెట్లతో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు.

  • విక్కీ-కత్రిన పెళ్లికి సల్మాన్​ సిస్టర్స్

Salman Khan Katrina Kaif Marriage: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ విక్కీ కౌశల్​-కత్రినాకైఫ్​ పెళ్లికి స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ వస్తారా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాహ వేడుకకు భాయ్​ హాజరుకావట్లేదని, ఆయన చెల్లిల్లు మాత్రమే వస్తున్నారని తెలిసింది.

09:58 December 08

టాప్ న్యూస్@ 10AM

  • మళ్లీ పెరిగిన కరోనా కేసులు

India Covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 8,439 ‬ మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ కారణంగా మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు

Awards for SC Railway: సౌత్​ సెంట్రల్​ రైల్వేను జాతీయ పురస్కారాలు వరించాయి. ఇంధ‌న పొదుపులో ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు నాలుగు జాతీయ పుర‌స్కారాలు వ‌చ్చాయి. బ్యూరో ఆఫ్ ఎన‌ర్జీ ఎఫిషియ‌న్సీ, విద్యుత్ శాఖ సంయుక్తంగా ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించాయి.

  • బిట్​కాయిన్లను సృష్టించడం ఎలా?

What is Bitcoin: అది 19వ శతాబ్దం. లక్షలాది మంది కెనడాలోని క్లోండిక్‌ దిశగా సాగిపోయారు. ఎందుకో తెలుసా? బంగారాన్ని తవ్వుకోవటానికి. 'గోల్డ్‌ రష్‌'గా పేరొందిన అలనాటి పరుగులో కొందరిని అదృష్టం వరిస్తే, కొందరికి నిరాశే మిగిలింది. ఇప్పుడూ అలాంటి తవ్వకమే మొదలైంది. అయితే ఈసారి పలుగు, పారలతో కాదు. కంప్యూటర్‌తో! బంగారం కోసం కాదు. అంతకన్నా విలువైన క్రిప్టోకరెన్సీ కోసం! అదే 'క్రిప్టో మైనింగ్‌'. తొలి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ 2009లో వెలుగులోకి వచ్చినప్పట్నుంచే ఇది ఆరంభమైంది.

  • దక్షిణాఫ్రికాలో భారత్​దే విజయం

IND vs SA Series: త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​లో భారత్​దే విజయమని ధీమా వ్యక్తం చేశాడు టీమ్ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్. సౌతాఫ్రికా బౌలింగ్​లో బలంగా ఉన్నా.. బ్యాటింగ్​లో పేలవంగా కనిపిస్తోందని తెలిపాడు.

  • శాన్వీ మైండ్​ బ్లాక్​ అందాలు!

'లవ్లీ' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన శాన్వీ శ్రీవాస్తవ ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన హాట్​ పోజులతో కుర్రోళ్లను కవ్విస్తోంది. నేడు(బుధవారం) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

08:47 December 08

టాప్ న్యూస్@ 9AM

  • రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు

TS Employees Transfers: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఊపందుకోనుంది. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి రేపు ఐచ్ఛికాలు స్వీకరించనున్నారు. ప్రాధాన్యాల ప్రకారం సీనియార్టీ జాబితాను రూపొందించి ఈనెల 15వ తేదీలోపు కేటాయింపులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొసీడింగ్స్ అందుకున్న వారం రోజుల్లోపు ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుంది.

  • ఫేస్‌బుక్‌పై పరువునష్టం దావా

Rohingya refugees sue Facebook: మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టు కాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఫేస్‌బుక్‌లో పోస్టు అయిన ప్రసంగాలు తమపట్ల హంసకు కారణమయ్యాయని దావాలో పేర్కొన్నారు.

  • టీకాపై నిర్ణయం వచ్చే ఏడాదే

Vaccine for children: చిన్నారులకు కరోనా టీకా ఇచ్చే విషయంపై నిపుణుల బృందం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని స్పష్టం చేసింది. ఎప్పుడు ఇవ్వాలనే విషయాన్ని వచ్చే ఏడాది నిర్ణయిస్తామని చెప్పుకొచ్చింది.

  • వేలానికి ముందు హజారే టోర్నీ

Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే టోర్నీకి రంగం సిద్ధమైంది. ఐపీఎల్​ మెగావేలానికి ముందు ఈ దేశవాళీ టోర్నీ యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం. దీంతో ఈ టోర్నీలో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఆటగాళ్లు. ఫిట్​నెస్​పై దృష్టిపెట్టిన హార్దిక్ పాండ్యా మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.

  • నేనిచ్చే సలహా అదే: రెహమాన్

యువతలో ఉండే ఉత్సాహం తనను ప్రేరేపిస్తుందని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహ​మాన్​. దేని గురించి దిగులు చెందకుండా చేయాలనుకున్న పనిని నిబద్ధతతో చేస్తే సొంత వ్యక్తిత్వం అలవడుతుందని సూచించారు. ఇదే విషయాన్ని తన కుమార్తెలకు ఎప్పుడూ చెప్తానని పేర్కొన్నారు.

07:39 December 08

టాప్ న్యూస్@ 8AM

  • టాలీవుడ్​ ట్రాగ్స్​ కేసు ముగిసినట్టేనా?

Tollywood drug case: సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తు మందుల వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు తుస్సుమంది. మత్తుమందుల దిగుమతితోపాట నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉంది.

  • ప్రభుత్వాల​పై పెరిగిన రుణభారం

debt burden of india: రాను రాను దేశం రుణభారతంగా రూపాంతరం చెందుతోంది. గత ఆరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020-21 జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 87.8%కి చేరింది.

  • చేపల నుంచి మనుషులకు ముప్పు!

Plastic Ocean pollution: సముద్రాలను ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీటి వల్ల అనేక జీవులు మృత్యువాత పడుతున్నాయి. చేపల్లోకి పలు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఈ చేపలను తినడం వల్ల మనుషుల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతోంది.

  • రిలయన్స్‌ భారీ పెట్టుబడులు

Reliance ta'ziz: అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మంగళవారం వెల్లడించింది. ఈ రెండు సంస్థలు కలిసి 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో పశ్చిమ అబుదాబిలో సంయుక్తంగా పెట్రోరసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

  • ఆ పాత్ర నాకు సవాల్​ : శ్రియ

Gamanam Shriya Saran: జీవితంలోని చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది తన కోరిక అని చెప్పింది నటి శ్రియ. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లోనూ ప్రస్తుతం మహిళలు కనపడటం ఓ విప్లవాత్మక మార్పు అని తెలిపింది. ఈ నెల 10న ఆమె నటించిన 'గమనం' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను వెల్లడించింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

06:53 December 08

టాప్ న్యూస్@ 7AM

  • యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

Telangana Grama Panchayat: పంచాయతీల్లో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించినట్లు రాష్ట్ర ఆడిట్ శాఖ గుర్తించింది. 2.12 లక్షల ఆడిట్‌ అభ్యంతరాలున్నాయని తెలిపింది. నిధుల వినియోగంలో గ్రామ పంచాయతీలు అడ్డగోలుగా వ్యవహారించాయని... దీనిపై త్వరలోనే వివరణ ఇవ్వాలని ఆడిట్ శాఖ కోరింది.

  • అమిత్ షా వివరణ అసంబద్ధం

Nagaland Army killings: నాగాలాండ్​లో భద్రతా బలగాల దుశ్చర్యను సమర్థించే విధంగా పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అధికారిక స్పందన నూటికి నూరుశాతం అసంబద్ధంగా ఉంది. ఆత్మరక్షణ కోసమే భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయన్న అమాత్యుల వివరణ నివ్వెరపరుస్తోంది. నిర్లక్ష్యంగా పౌరుల ప్రాణాలు తీశాక.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కంటితుడుపు చర్యలాగే ఉంది.

  • ఆఫ్రికాలో 9 దేశాలకు ఒమిక్రాన్​

Omicron news: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌.. ఆఫ్రికాలో తొమ్మిది దేశాలకు పాకింది. ​ దక్షిణాఫ్రికా నుంచి ఆయా దేశాలకు చేరుకున్నవారికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. అటు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు యూకే కొత్త నిబంధనలు విధించింది. 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది.

  • బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్​ సిరీస్​కు వేళైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తొలుత టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. కీలక బౌలర్ జిమ్మీ అండర్సన్, స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో​ లేకుండానే బరిలో దిగుతోంది ఇంగ్లీష్ జట్టు.

  • ప్రీ వెడ్డింగ్​ వేడుకలు షురూ

Vicky Katrina Wedding: ఎంతో గోప్యంగా జరుగుతున్నా.. అందరి చూపు బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్‌ వివాహ కార్యక్రమంపైనే ఉంది. వివాహ వేదిక అయిన రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారా దీప కాంతులతో వెలిగిపోతోంది.

05:35 December 08

టాప్ న్యూస్@ 6AM

  • స్కీములే స్కాములు!...

Cheeting cases in telangana: మాటలే పెట్టుబడి.. మోసమే వ్యాపారం.. సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్‌ కేసులు మాత్రం పెరుగుతున్నాయి.

  • సింగరేణిలో సమ్మె సైరన్ ...

Singareni strike: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ... ఈనెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

  • గవర్నర్‌ పరామర్శ ..

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మాజీ తమిళనాడు గవర్నర్‌ రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం రోశయ్య ఇంటికి వెళ్లిన గవర్నర్​ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు.

  • ఎస్పీ-ఆర్​ఎల్​డీ పొత్తు ఖరారు..

RLD SP Rally 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్​ఎల్​డీ) కలసి పోటీచేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పొత్తు ఖరారు అనంతరం కలసి ఒకే వేదికను పంచుకున్నాయి. 'భాజపా ద్వేషపూరిత రాజకీయాలను' ప్రజలు తిరస్కరిస్తారని ఈ సందర్భంగా అఖిలేశ్ విమర్శించారు.

  • నందా ప్రస్తీ ఇకలేరు..

Nanda Prusty News: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు నందా ప్రస్తీ (104) మంగళవారం కన్నుమూశారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • కారుతో బైక్​ను ఢీకొట్టిన నటి...

శంషాబాద్ పీఎస్ పరిధిలో సీరియల్‌ నటి లహరి తన కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • బాలికపై​ టీచర్ అత్యాచారం

ట్రిప్​ పేరుతో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్​ జిల్లాలో జరిగింది. డిసెంబరు 2న ఈ దుర్ఘటన జరిగనట్లు పోలీసులు వెల్లడించారు.

  • యూకే కొత్త నిబంధనలు

  • బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్​

ASHES 2021: యాషెస్​ టెస్టు సిరీస్​​ బుధవారం(డిసెంబర్​ 8) ప్రారంభమైంది. తొలి టెస్టులో భాగంగా టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్ ఎంచుకుంది.

  • ప్రీ వెడ్డింగ్​ వేడుకలు షురూ..

Last Updated : Dec 8, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.