ETV Bharat / city

ఈటీవీ ముఖ్యాంశాలు - etv Bharat top news

etv top news
etv top news
author img

By

Published : Oct 23, 2021, 6:48 AM IST

Updated : Oct 23, 2021, 9:01 PM IST

20:55 October 23

టాప్​ న్యూస్​ @9PM

  • విశ్వవేదికపై బతుకమ్మ సంబురం

బతుకమ్మ ఘనతను విశ్వవేదిక(Bathukamma on burj Khalifa)పై చాటనున్నారు. ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్​లోని బుర్జ్​ ఖలీఫాపై బతుకమ్మ(Bathukamma on burj Khalifa) వీడియోను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత దుబాయ్‌ చేరుకున్నారు.

  • ఆ భేటీ వెనుక మతలబేంటి?

రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెరాస.. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెరాస ద్విదశాబ్ది వేడుకలను మాదాపూర్ హైటెక్స్​లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. సమావేశానికి 6వేలకు పైగా ప్రతినిధులు హాజరవనున్నారని చెప్పారు.

  • టీకా తయారీదారులతో మోదీ  చర్చ

టీకా తయారీదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ (PM Modi meeting today) అయ్యారు. సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా(Adar Poonawalla news), భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల సహా ఏడు సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  •  మత గ్రంథాలు అడిగిన ఆర్యన్ ఖాన్

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​ జైలు వాతావరణానికి అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడు జైలు అధికారుల నుంచి మత గ్రంథాలు అడిగినట్లు సమాచారం.

  • వారిపై గొప్పగా ఆడాలి

టీ20 ప్రపంచకప్​లో భాగంగా.. తొలి మ్యాచ్​ పాకిస్థాన్​తో ఆడేందుకు టీమ్​ఇండియా(IND vs PAK t20) సిద్ధమవుతోంది. ఈ పోరు నేపథ్యంలో పాకిస్థాన్(Pakisthan Squad t20 World Cup) 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News). పాక్​ జట్టు దృఢంగా కనిపిస్తోందని అన్నాడు.

19:53 October 23

టాప్​ న్యూస్​ @8PM

  • అలాంటిదేం లేదు

ఈటల రాజేందర్​తో తనకేమి చీకటి ఒప్పందం లేదని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఓ శుభకార్యం సందర్భంగానే కలిశామని చెప్పారు. భాజపాతో కుమ్మక్కై.. ఆ పార్టీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతుంది కేసీఆర్​ అని ఎద్దేవా చేశారు. తాము హుజూరాబాద్​ అభ్యర్థిని ఆలస్యంగా బరిలోకి దింపినా.. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా వీణవంకలో ఆయన ప్రచారం నిర్వహించారు.

  • పెళ్లైన మూడు నెలలకే !

ప్రేమపెళ్లి చేసుకున్న మూడు నెలలకే భార్యను అమ్మేశాడు ఓ భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వేరే వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. 

  •  చిన్నారిపై అమానుషం 

దేశ రాజధానిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన దుమారం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

  • పాక్​ చర్య అందుకేనా?

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి పాకిస్థాన్ భద్రతా బలగాలు. శనివారం జరిపిన దాడుల్లో 10 మంది ముష్కురులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు. మరోవైపు.. అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరు పౌరులు మరణించారు.

  •  తొలి పంచ్ ఆసీస్​దే

టీ20 ప్రపంచకప్​ సూపర్​-12 దశలోని తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై గెలిచింది ఆస్ట్రేలియా. సౌతాఫ్రిక నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

18:55 October 23

టాప్​ న్యూస్​ @7PM

  • టీకా తయారీదారులతో మోదీ

  • 'అక్కడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు'

జమ్ముకశ్మీర్​ అభివృద్ధిలో భాగస్వాములు కావడం అక్కడి యువత బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్​ లోయలో ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు, అవినీతి అంతమైనట్లు చెప్పారు. కశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితీరుతుందని స్పష్టం చేశారు.

  • క్యూ2లో ఐసీఐసీఐ జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (ICICI Q2 results 2021) ఐసీఐసీఐ ఆశాజనక ఫలితాలను రాబట్టింది. నికర లాభం 24.7 శాతంతో రూ.6,092 కోట్ల ఆర్జించింది.

  • 'అన్నాత్తే' తెలుగు ట్రైలర్​'

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రజనీకాంత్​ 'అన్నాత్తే', అక్షయ్​కుమార్​ 'ఓ మై గాడ్​ 2', విజయదేవరకొండ 'లైగర్'​, విశాళ్​ 'ఎనిమీ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • కోహ్లీకి సాధ్యంకాని రికార్డు  అతని ఖాతాలో!

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup schedule 2021) భాగంగా అక్టోబర్​ 24(ఆదివారం)న భారత్​-పాకిస్థాన్​ తలపడనున్నాయి(T20 worldcup pakisthan teamindia match). అయితే వరల్డ్​కప్​ తొలి సీజన్​ ఫైనల్​లో తలపడిన ఈ రెండు జట్లలోని ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ​వారెవరు? తొలి ప్రపంచకప్​లో వారి ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం..

17:42 October 23

టాప్​ న్యూస్​ @6PM

  • కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు 

కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్(TS Inter exams) పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్ష కేంద్రాల్లో జరిగే పరీక్షలకు (TS Inter exams) 4.59 లక్షల మంది హాజరుకానున్నట్లు చెప్పారు. 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. విద్యార్థులు నీళ్ల సీసాలు తెచ్చుకోవచ్చని ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.

  • 'ఆ వ్యాఖ్యలు ఊహాజనితం'

తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతో... ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్​ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితంగా కొట్టిపారేశారు.

  • నలుగురు పిల్లలతో సహా  ఆత్మహత్య

కర్ణాటకలో అత్యంత విషాద ఘటన జరిగింది. బ్లాక్ ఫంగస్​తో భార్య మరణించిన కొద్ది రోజులకు నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. కుటుంబమంతా మరణించడం చూసి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  • కిలిమంజారోను అధిరోహించిన హీరోయిన్

ఆఫ్రికా ఖండంలోనే(niveda thomas updates) అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు నటి నివేదా థామస్‌(niveda thomas upcoming movies). ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • భారత్​పై గెలిస్తే భారీ బోనస్

టీ20 ప్రపంచకప్​లో భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్(IND vs PAK T20 Match)​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి భారత్​పై తొలి టీ20 విజయం తమ ఖాతాలో వేసుకోవాలని పాక్​(Pakistan Squad for T20 World Cup) ఆశిస్తోంది. ఈ మ్యాచ్​ నెగ్గితే పాక్​ ఆటగాళ్లకు ఫుల్ బోనస్​ లభించనుందని ఓ నివేదిక పేర్కొంది.

16:38 October 23

టాప్​ న్యూస్​ @5PM

పట్టాభికి బెయిల్‌

 ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

సిటీ బస్సు ఎక్కిన సీఎం

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు.

యూపీలో కాంగ్రెస్ యాత్ర

ఉత్తర్​ప్రదేశ్​లో ప్రతిజ్ఞ యాత్రను (Congress Pratigya yatra) ప్రారంభించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi news latest) .. రైతులకు పలు హామీలు ప్రకటించారు. వరి, గోధుమకు కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో మాట్లాడారు.

 నా కల నెరవేరింది

హీరోయిన్ (Samantha Latest News) సమంత.. స్నేహితులతో కలిసి చేపట్టిన తీర్థయాత్రలో 'ఛార్‌ధామ్‌ యాత్ర' (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌) పుణ్యక్షేత్రాల సందర్శనను పూర్తి చేసుకున్నారు. యాత్ర గురించి చెబుతూ "మొత్తానికి నా కల నెరవేరింది" అని అన్నారు.

'అందులో మనమే అధికం'

దేశంలో మొబైల్ డేటా(Data Consumption In India) వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. ఇంటర్నెట్‌ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని చెప్పారు. గత ఆరేడేళ్లలో అనుసంధాన రంగంలో భారత్​ మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

15:55 October 23

టాప్​ న్యూస్​ @4PM

  •  భారీగా డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ

హైదరాబాద్‌లో ఒకేరోజు రెండు చోట్ల భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఎన్​సీబీ అధికారులు 3కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపించే పార్సిల్‌లో మాదకద్రవ్యాలను గుర్తించారు

  • విశ్వవేదికపై బతుకమ్మ 

  • వాటిపై  సీజేఐ కీలక వ్యాఖ్యలు

న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ (CJI Justice Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులు.. శిథిలావస్థ భవనాల నుంచే పనిచేస్తాయన్న భావన ఉండిపోయిందని (CJI NV Ramana news) అన్నారు. ఈ నేపథ్యంలో 'నేషనల్ జుడీషియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ' ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

  • ఆ ఆకుల కోసం ఎగబడ్డ జనం.. ఎందుకంటే?

బొలీవియాలో కోకా ఆకుల ఉత్పత్తిదారులు రోడ్లపైకి వచ్చారు. తమ కోకా ఆకులను ఇతరులతో పంచుకున్నారు. కోకా ఆకులను వారు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అవి తింటే శక్తి లభిస్తుందని అక్కడి వారు విశ్వసిస్తారు.

  • భారత్​తో  మ్యాచ్​కు  పాక్ జట్టు

టీ20 ప్రపంచకప్​లో భారత్​తో తలపడేందుకు పాకిస్థాన్​(IND vs PAK T20 World Cup) సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్​ కోసం 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

14:34 October 23

టాప్​ న్యూస్​ @3PM

  • మంచిర్యాల జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి

మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంచిర్యాల, నస్పూర్‌లో స్వల్పంగా కంపించడంతో భయాందోళనతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. 

  • భారీగా డ్రగ్స్​ పట్టివేత 

మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్​ రాకెట్​ బయటపడింది. రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి 4.92 కిలోల మెపిడ్రిన్‌తో పాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో పవన్, మహేశ్‌ రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను అరెస్ట్‌ చేయగా ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • 'బానిసలు కావాలా... మీ గొంతుక వినిపించే వ్యక్తి కావాలా?'

హుజూరాబాద్(Huzurabad by elections 2021) ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని శ్రీరాములపల్లిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి(Kishan reddy Campaign)... 'బానిసలు కావాలా?.. మీ గొంతుకను వినిపించే వారు కావాలా?' అని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలు పోవాలంటే భాజపా గెలవాలని అన్నారు.

  • 'గోవాలో డబుల్​ ఇంజన్​ వేగంతో అభివృద్ధి పరుగులు'

గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను గోవా ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తోందని కితాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ ఉండడంతో అభివృద్ధి డబుల్​ ఇంజన్​ రైలులా పరుగులు తీస్తుందని అన్నారు.

  • ప్రభాస్​కు అనుష్క స్పెషల్ విషెస్

హీరో ప్రభాస్​ బర్త్​డే(prabhas birthday) సందర్భంగా హీరోయిన్ అనుష్క(anushka shetty marriage) విషెస్ చెప్పింది. ఈ పోస్ట్​ను అభిమానులు ప్రస్తుతం, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

13:56 October 23

టాప్​న్యూస్​@2PM

  • ఓట్లు వేయకపోతే ఆపేస్తామా?

రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టామని.. ఓట్ల కోసం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Telangana Planning Commission Vice President Vinod Kumar) స్పష్టం చేశారు. ఓట్లు వేయకపోతే పింఛన్లు రద్దు చేస్తారని, పథకాలు నిలిపివేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు.

  • డబ్బులు లేకే చనిపోతున్నా

పేదరికం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొప్పగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలనుకుంది ఆ యువతి. తాను కన్న కలలను పేదరికం వెలివేయగా.. ఉరి వేసుకొని విగతజీవిగా మారింది. తన ఇబ్బందులను ఓ కాగితంపై పెట్టి ఇదే చివరి లేఖ.. ఇక సెలవు అని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

  • ఎంత నిద్ర పోవాలంటే!

ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. రాత్రంతా నిద్రలేని వారు అధిక రక్తపోటుకు(High blood pressure) గురయ్యే ప్రమాదం ఉంది. నీరసం, బీపీ పెరగడం, కోపం, చిరాకు రావడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుత జీవన శైలితో చాలా మందిని నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. అయితే ఏ వయసు వారు ఎంత నిద్ర పోవాలి (Sleep Time By Age) అనేది చాలా మందికి తెలియదు. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • గంగూలీ ఆశ్చర్యం

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై (virat kohli steps down as indian captain) తానూ ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. కోహ్లీ కెప్టెన్సీపై బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు చాలా కాలం కెప్టెన్​గా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డాడు.

12:41 October 23

టాప్​న్యూస్​@1PM

  • పోడు భూములపై సీఎం సమీక్ష

పోడు భూములపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్(CM KCR Review on podu lands)... ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడుభూముల సమస్య పరిష్కారంపై సమీక్షిస్తున్న సీఎం(CM KCR Review on podu lands)... అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చిస్తున్నారు. పోడు సమస్య అధ్యయనం కోసం మూడు రోజులపాటు జిల్లాల్లో పర్యటించిన అధికారులు బృందం... క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వనున్నారు. 

గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను గోవా ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తోందని కితాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ ఉండడంతో ఆభివృద్ధి డబుల్​ ఇంజన్​ రైలులా పరుగులు తీస్తుందని అన్నారు.

  • నాలుగోరోజు వైఎస్ షర్మిల 'ప్రజాప్రస్థానం'

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra) నాలుగో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పోశెట్టిగూడ క్రాస్ రోడ్​లో ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి సాయంత్రం 6 గంటల వరకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు.

  • ట్రెక్కింగ్​కు వెళ్లి 12 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్​లో ట్రెక్కింగ్​కు వెళ్లిన రెండు వేర్వేరు బృందాల్లోని 12మంది పర్వతారోహకులు మరణించారు(uttarakhand trekking death). ఆరుగురిని అధికారులు రక్షించారు. నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ఉత్తరాఖండ్​లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణమే వారి మరణానికి కారణమని తెలుస్తోంది(uttarakhand flood 2021).

  • ధోనీని మెంటార్‌గా ఎందుకు తీసుకున్నారంటే?

మాస్టర్‌ మైండ్‌... ఆధునిక క్రికెట్‌ అందులోనూ ఇండియన్‌ క్రికెట్‌లో ఈ పేరు సెట్‌ అయ్యే ఏకైక క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. టీమిండియా కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ వేసిన (dhoni strategies in cricket) ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం చూస్తే ఎవరన్నా ఈ మాటే అంటారు. మొన్నటి వరకు మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఇప్పుడు టీమ్​ఇండియాకు మెంటార్‌ ధోనీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఎందుకు 'మెంటార్‌'గా నియమించారు. అతని ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం!

11:45 October 23

టాప్​న్యూస్​@12PM

  • కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

పోడు భూముల సమస్యకు పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న సమావేశానికి కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. 

  • జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి...

  • కేటీఆర్‌, రాజాసింగ్‌ ట్వీట్ వార్

మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ నడుమ ట్విట్స్ వార్(ktr and raja singh tweets) జరుగుతోంది. హైదరాబాద్ ఓల్డ్​సిటీలోని పరిస్థితిని బైక్​పై పర్యటించి తెలుసుకోవాలని కేటీఆర్​కు రాజాసింగ్ సవాలు విసరగా... ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని మంత్రి కౌంటర్ ఇచ్చారు.

  • 'ఆ టీకా పని తీరు భేష్​'

5-11ఏళ్ల వయస్సు గల పిల్లలకు కరోనా టీకా అందించాలని అమెరికా భావిస్తున్న(kids vaccine news) తరుణంలో ఎఫ్​డీఏ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలపై ఫైజర్​ టీకా(pfizer vaccine) సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫైజర్​ అందించిన డేటాను పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేసింది(us fda pfizer).

  • రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల దాహం తీర్చింది. శనివారం, ప్రభాస్​ పుట్టినరోజు కానుకగా దానిని రిలీజ్ చేశారు. రిచ్​ విజువల్స్​తో ఉన్న టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

10:40 October 23

టాప్​న్యూస్​@11AM

  • హుజూరాబాద్​లో భాజపా గెలుపు ఖాయం

రాష్ట్రంలో తెరాస కుటుంబపాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి(kishan reddy About Huzurabad by poll) అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

  • దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 16,326 మంది​కి కరోనా (Coronavirus update) సోకగా.. వైరస్​​ ధాటికి(Covid cases in India) మరో 666 మంది మరణించారు. మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,677గా నమోదైంది.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర (Gold Rate Today) శనివారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • ఏ రోజు ఏ జట్టుతో ఆడనుందంటే?

టీ20 ప్రపంచకప్​నకు (t20 world cup 2021) సర్వం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 23​) నుంచి మ్యాచ్​లు ప్రధాన మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.ఈ టోర్నీలో టీమ్‌ఇండియా మ్యాచ్​లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

  • హీరోయిన్ తమన్నా ప్లేస్​లో అనసూయ

హీరోయిన్ తమన్నా(tamanna new movie) ఓ ప్రోగ్రాంకు హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడామె స్థానంలో అనసూయ(anasuya bharadwaj family) రానున్నారు. శుక్రవారం-శనివారం రాత్రి ఈ షో ప్రసారమవుతుంది.

09:54 October 23

టాప్​న్యూస్​@10AM

  • భాగ్యనగర ప్రజలకు నరకమే!

భాగ్యనగరంలో ఉదయం 8 అయిందంటే చాలు బస్టాపులన్ని సందడి మారుతున్నాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత బస్సుల(Shortage of City Buses)న్ని కిటకిటలాడుతున్నాయి. కరోనా వల్ల కొన్ని బస్సుల సర్వీసులను నిలిపివేసిన అధికారులు.. ప్రస్తుతం వాటిలో కొన్నింటినే పునరుద్ధరించారు. దీనివల్ల ఉదయం కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి కూడా చోటులేని స్థితిలోనూ ఫుట్​బోర్డుకు వేలాడుతూ ప్రమాదకరంగా వెెళ్తున్నారు. మరో బస్సు(Shortage of City Buses) కోసం వేచిచూసే సమయం లేక.. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే స్తోమత సరిపోక ప్రాణాలు పణంగా పెట్టి పయనిస్తున్నారు.

  • వారెంత చెబితే అంతివ్వడమేనట!

ఎన్నికల వేళ హుజూరాబాద్‌(Huzurabad by election 2021)లో ఆయా పార్టీలు ఎవరికి వారిగా లెక్కలు వేసుకుంటున్నాయి. ఎలాగైనా నెగ్గాలనే ఆరాటంతో ఎదురయ్యే చిక్కుముడులను విప్పుతూ విజయం కోసం పోరాటాన్ని సాగిస్తున్నాయి.. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు అనుకూలమైన ఏ అంశాన్నీ వదలడంలేదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడిని అనుసరిస్తున్నారు.

  • గంజాయి కట్టడికి అధికారులు సమాయత్తం

తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా(Marijuana smuggling)కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ఎక్కువగా రవాణా జరుగుతోందని గుర్తించిన అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దులపై నిఘా పెట్టనున్నారు.

  • కేదార్​నాథ్​కు పోటెత్తిన భక్తులు

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాల అనంతరం కేదార్​నాథ్​ యాత్ర తిరిగి ప్రారంభమైంది. దీంతో భక్తులు వేల సంఖ్యలో సోనాప్రయాగ్​ బ్రిడ్జ్​ వద్దకు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో భక్తులు గుమికూడి వంతెన దాటుతున్న చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • 'చాయ్​' పాత్ర గురించి మీకు తెలుసా?

నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా లెక్కనేనన్నిసార్లు గొంతులో పడనిదే మనసును ప్రశాంతంగా ఉండనివ్వని చాయ్‌కీ.. మన జాతీయోద్యమానికీ సంబంధం ఉంది. బ్రిటన్‌లో డబ్బులు కాపాడుకోవటానికి తెల్లవారు వేసిన ఎత్తుగడ మన గొంతులకూ చుట్టుకుంది.. ఇప్ప'టీ'కీ వదలకుండా!

08:47 October 23

టాప్​న్యూస్​@9AM

  • కోల్‌కతా నుంచి బాలిక అక్రమ రవాణా

కోల్‌కతాలో అపహరణకు గురైన బాలికను తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో గుర్తించారు. నాలుగు నెలల అనంతరం బాలికకు నిందితుడి చెర నుంచి విముక్తి కలిగించారు. జూన్‌ 19న పశ్చిమ్‌బెంగాల్‌లోని కనకుల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాల ఆధారంగా బాలికను రక్షించడంతో పాటు నిందితుడినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

  • పెరిగిన వంట నూనెల ధరలు

వంట నూనెల ధరల (Edible Oil Price) పెంపుపై కేంద్రం స్పందించింది. అంతర్జాతీయంగా నూనె ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్‌లో ఆ ప్రభావం కనిపించినట్టు ఆహార, ప్రజా పంపిణీశాఖ వెల్లడించింది.

  • మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • ఆట సిక్సరూ.. చదువులో బౌల్డ్

టీ20 ప్రపంచకప్​లో టీం ఇండియా (T20 world cup 2021) భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. బంతుల్ని అలవోకగా బౌండరీలు దాటిస్తుంటే కేరింతలు కొట్టడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరి.. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలు రచించే ఈ క్రికెటర్లు డిగ్రీ కూడా దాటలేదనే విషయం మీకు తెలుసా? ఆఫ్‌కోర్స్‌.. చదువుకి, ప్రతిభకు ముడిపెట్టలేం. మన క్రికెట్లర్లలో ఎవరెవరి చదువులు ఎలా ఉన్నాయో సరదాగా తెలుసుకుందామా?

  • ఢీ డ్యాన్స్​ షోలో పవన్​ కల్యాణ్..!

ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్​ షో తుదిదశకు చేరువవుతోంది. దీంతో కంటెస్టెంట్​లో హోరాహోరీగా డ్యాన్స్​ చేస్తున్నారు. ఈ వారంలానే వచ్చే వారం కూడా పలువురు సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేశారు. 'డ్యాన్స్ విత్ సెలబ్రిటీ' ఎపిసోడ్​-2కు సంబంధించిన కొత్త ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.

07:54 October 23

టాప్​న్యూస్​@8AM

  • 25, 26న కృష్ణాబోర్డు సమావేశం

గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ కోసం శ్రీశైలంలో... సోమ, మంగళవారాల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. సోమవారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. రాత్రికి శ్రీశైలంలో బసచేసి మంగళవారం స్పిల్ వే, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలిస్తారు. ఉపసంఘం నాలుగో సమావేశం కూడా శ్రీశైలంలోనే జరుగుతుంది.'

  • కందికొండకు మరో కష్టం

రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలతో బయటపడ్డ ప్రముఖ గేయ రచయిత కందికొండకు మరో కష్టం ఎదురైంది. క్యాన్సర్ చికిత్స ప్రభావం కందికొండ వెన్నెముఖపై పడటంతో కొంత భాగం దెబ్బతింది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి దాతల సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న కందికొండ... మరింత దుర్భరస్థితిలో కూరుకుపోయారు. వెన్నెముఖ శస్త్రచికిత్స కోసం మరోసారి దాతలు సహాయం చేయాలని ఆయన కుటుంబం అర్థిస్తోంది.

  • దిగ్గజాల అభిప్రాయాలు

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021) అక్టోబర్ 24న భారత్​ పాక్​తో తలపడనుంది. దాయాది దేశంతో మ్యాచ్ అంటే తగ్గపోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే?

  • టాలీవుడ్​ మేనరిజం, హాలీవుడ్ కటౌట్

'డార్లింగ్'​ ప్రభాస్​..(prabhas birthday) 'ఈశ్వర్'​ సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. పాన్ ​ఇండియా స్టార్​గా ఎదిగాడు. వివిధ భాషల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన కొత్త చిత్రాన్ని 8 భాషల్లో చేస్తూ పాన్ వరల్డ్​ స్టార్​గా గుర్తింపు పొందాడు. నేడు ప్రభాస్ బర్త్​డే(prabhas birthday) సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

  • మా నాన్న గర్వపడేలా నటిస్తా..

'రొమాంటిక్' ప్రీ రిలీజ్​ హీరో ఆకాశ్ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్న పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేసేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06:53 October 23

టాప్​న్యూస్​@7AM

  • సోషల్​మీడియాలో అసత్య ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ వార్తలు(Fake News) క్రమంగా పెరుగుతున్నాయి. మొబైల్ యాప్స్ సాయంతో కొందరు కేటుగాళ్లు బోగస్ వార్తలు సృష్టించి ప్రజల్లోకి వదిలి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీలల్లో ఇలాంటి కేసులు(Fake News) రోజురోజుకు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఫేక్ న్యూస్(Fake News) చాలా త్వరగా చక్కర్లు కొడుతున్నాయని తెలిపారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • గ్రామం కోసం ద్విపాత్రాభినయం

ఆమె ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలు.. ఉదయం సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తూ.. మధ్యాహ్నం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గ్రామ అభివృద్ధి చేస్తూనే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తన పూర్వ వృత్తిని చేపట్టింది. పంచాయతీ అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులతోపాటు... తన భర్త అనారోగ్యం కోసం చేసిన అప్పులు... ఆమె ద్విపాత్రాభినయం చేసేలా పరిస్థితులు దోహదం చేశాయి.

  • అందనంత ఎత్తులో ఉన్నత విద్య

విద్యాసంస్థలు కోర్సు రుసుములను నానాటికీ భారీగా పెంచడం మూలంగా సామాన్యులపై రుసుముల పెనుభారం పడుతోంది. బడుగు బలహీన వర్గాల్లో అధికశాతం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే యూనివర్సిటీలు, కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీల ద్వారా ఈ వర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల రుసుముల పెంపు ఈ వర్గాలపై పెనుభారంగా పరిణమిస్తుంది.

  • తీర్థయాత్రలో సమంత

స్నేహితులతో కలిసి తీర్థయాత్రలో ఉన్న హీరోయిన్ సమంత(Samantha Latest News).. శుక్రవారం హెలీకాప్టర్​లో కేదార్​నాథ్ చేరుకుంది. అనంతరం బద్రీనాథ్​ ధామ్​ను దర్శించుకుంది.

  • రామోజీ ఫిల్మ్​సిటీలో 'పుష్ప'

బన్నీ హీరోగా నటిస్తున్న 'పుష్ప'(pushpa release date) షూటింగ్ రామోజీ ఫిల్మ్​సిటీ(ramoji film city hyderabad) జరుగుతోంది. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

06:06 October 23

టాప్​న్యూస్​@6AM

  • చరిత, భవిత తెరాసదే...

ఏడెనిమిది దశాబ్దాలైనా చెక్కుచెదరని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీర్చిదిద్దుతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజాభిమానంతో తెరాస అప్రతిహతంగా ముందుకు సాగుతోందని, సంస్థాగత నిర్మాణంతో మరింత దృఢంగా తయారు చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ మరో 20 ఏళ్లు సీఎంగా ఉంటారన్నారు. తెలంగాణ సాధనే పార్టీకి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు.

  • పోడు సమస్య కొలిక్కొచ్చేనా..?

పోడుభూముల సమస్య పరిష్కారంపై ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరగనుంది.అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీఅధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ పోడు సమస్య పరిష్కారంతో పాటు అడవుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చిస్తారు. హరితహారంతో విస్తృత ఫలితాల అంశంపైనా చర్చ జరగనుంది. గత మూడు రోజులుగా జిల్లాల్లో పర్యటించిన అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పోడుభూముల అంశంపై ముఖ్యమంత్రికి నివేదిక అందించనున్నారు.

  • విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి..

బతుకమ్మ ఘనతను మరోసారి విశ్వవేదిక(Bathukamma on burj Khalifa)పై చాటనున్నారు. ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్​లోని బుర్జ్​ ఖలీఫాపై.. బతుకమ్మ(Bathukamma on burj Khalifa)ను ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన తెరపై బతుకమ్మకు సంబంధించిన వీడియోను.. ఒకేసారి లక్ష మంది వీక్షించనున్నారు.

  • ప్రభుత్వాస్పత్రుల్లో కేసీఆర్​ ఆహారామృతం..

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కేసీఆర్​ ఆహారామృతం పేరుతో భోజనం అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్‌లోని 18 దవాఖానాల్లో అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • పంజాబ్​లో కొత్త పొత్తులు...

పంజాబ్​లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పార్టీల పొత్తులు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్‌, అకాలీదళ్‌, ఆప్‌, బాప్‌లతో పాటు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఏర్పాటుచేసే కొత్త పార్టీ భాజపాతో కలిసి పోటీ చేస్తామనడం వల్ల శాసనపోరు రసవత్తరంగా మారనుంది.

చైనాపై అమెరికా ఆగ్రహం..

తైవాన్​ విషయంలో అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. తైవాన్‌ తమతో పునరేకీకరణ సాధించి తీరవలసిందేనని ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ చేసిన వ్యాఖ్యలను తైవాన్ ఖండించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే తైవాన్‌ను తాము రక్షిస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించడం ఉత్కంఠ కలిగిస్తోంది.

  • ఇక నుంచి ఫోన్​పే వడ్డింపు..

యూపీఐ ఆధారిత లావాదేవీలపై ప్రాసెసింగ్​ రుసుములు (Phonepe UPI Transaction Charges) విధించడం ప్రారంభించింది ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్​పే (Phonepe News). రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది.

  • వాళ్ల దగ్గర ప్లాన్​-బీ లేదు..

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) టీమ్​ఇండియా ఫేవరెట్ అని మాజీలందరూ చెబుతుంటే.. ఇంగ్లాండ్​ మాజీ సారథి నాసర్ హుస్సేన్(Nasser Hussain on Team India) మాత్రం భిన్నంగా స్పందించాడు. ఏ జట్టైనా టీమ్​ఇండియాను చిత్తు చేయొచ్చని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వద్ద ప్లాన్-బి లేదని తెలిపాడు.

  • అనన్య సంపాదనెంతంటే...

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైంది బాలీవుడ్ నటి అనన్యా పాండే. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​తో చేసిన వాట్సాప్ చాట్​లో డ్రగ్స్ సంబంధించిన విషయాలు ఉన్నాయని.. అధికారులు ఆమెను ప్రశ్నించారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రశ్నించిన అధికారులు.. అనన్యకు డ్రగ్స్​తో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. అయితే కెరీర్ పరంగా చూసుకుంటే ఆమె చేసింది మూడు సినిమాలే అయినా గొప్ప ఫేమ్ సంపాదించుకుంది. లగ్జరీ కార్లు, సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె లగ్జరీ లైఫ్​ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • డార్లింగ్​కు హ్యాపీ బర్త్​డే...

Last Updated : Oct 23, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.