ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

Etv bharat top news
Etv bharat top news
author img

By

Published : Oct 21, 2021, 6:27 AM IST

Updated : Oct 21, 2021, 9:57 PM IST

21:45 October 21

టాప్​​ న్యూస్​ @10PM

  •  త్రివర్ణ కాంతుల్లో చారిత్రక కట్టడాలు

దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసుల(100 crore vaccine) మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభిన్నంగా అభినందనలు తెలిపింది. దేశంలోని వివిధ చారిత్రక కట్టడాలను మువ్వన్నెల కాంతులతో ముస్తాబు చేసి, కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి కృతజ్ణతలు తెలిపింది.

  • ప్రోటోకాల్‌పై  అభ్యంతరం

  గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krishna river management board) మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం(telangana government) అభ్యంతరం వ్యక్తం చేసింది. 

  •  దళితబంధుపై  పిల్‌

 హుజురాబాద్​లో దళిత బంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది (pil in high court on dalit bandh suspension in huzurabad). సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  

  • 'వరుడు కావలెను' ట్రైలర్​

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu movie). తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు నటుడు దగ్గుబాటి రానా.

  • టీమ్ఇండియానే టైటిల్ ఫేవరెట్

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు(T20 World Cup India Team) ఛాంపియన్​గా నిలిచే సత్తా ఉందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq News) అభిప్రాయపడ్డాడు. ఏ విధంగా చూసినా భారత జట్టు దృఢంగా కనిపిస్తోందని తెలిపాడు. భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంజమామ్.

20:51 October 21

టాప్​​ న్యూస్​ @9PM

  •  అమరవీరులకు జోహార్లు 

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను పోలీసుశాఖ స్మరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి(Police flag day) ఘటించారు. అమరుల స్ఫూర్తితో మరింత నిబద్ధతతో పనిచేస్తూ ప్రజాసేవకు పునరంకితమవుతామని రక్షకభటులు ఉద్ఘాటించారు.

  • ఆ పాట విన్న ప్రధాని!

భారత్‌ 100 కోట్ల కరోనా టీకా డోసులు (India 100 crore vaccine) ఇచ్చి చరిత్ర సృష్టించిన రోజు ఛావి అగర్వాల్‌ అనే యువతికి చాలా ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీనే. అదెలాగంటారా?

  • ఆ రాష్ట్రాల్లో  తొలి డోస్‌ పూర్తి

కరోనా టీకాల(Corona vaccine) పంపిణీలో భారత్​ గురువారం వంద కోట్ల మైలురాయిని(India 100 crore vaccine) దాటింది. మరోవైపు.. వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో(Vaccine Milestone) ఇప్పటి వరకు మొత్తం 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులందరికీ తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • ' చైనాకు అడ్డుకట్ట వేయాల్సిందే'

అంతర్జాతీయ నిబంధనలను పట్టించుకోకుండా హిమాలయాల్లో దురాక్రమణకు (China Expansionism) పాల్పడుతున్న చైనా ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాల్సిందేనని అమెరికా (China US news) సీనియర్‌ దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. జపాన్‌, ఆస్ట్రేలియా, లిథువేనియాలతో పాటు దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాలపై బెదిరింపు చర్యలను చైనా మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

  •  ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో ఫుట్​బాల్ క్లబ్!

వచ్చే ఏడాది ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు(IPL 2022 New teams) చేరనున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. కొత్త ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ టెండర్లను ఆహ్వానించగా.. ప్రముఖ ఫుట్​బాల్​ క్లబ్ 'మాంచెస్టర్ యునైటెడ్'(Manchester United News) దీనిపై ఆసక్తి చూపినట్లు సమాచారం.

19:52 October 21

టాప్​​ న్యూస్​ @8PM

  •  తెలంగాణ అభ్యంతరం

గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krishna river management board) మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం(telangana government) అభ్యంతరం వ్యక్తం చేసింది

  • 'ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

ప్రమోటైన ఇంటర్ మొదటి సంవత్సరం (Inter 1st year exams 2021) విద్యార్థులకు సమయం అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే చెప్పామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) తెలిపారు. ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయినందున పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

  • పట్టపగలే బ్యాంకు దోపిడీ

మహారాష్ట్ర పుణెలో పట్టపగలే భారీ చోరీ (Bank robbery Pune) జరిగింది. పింపర్​ఖేడ్​లో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి తుపాకులతో ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. ఉద్యోగులను బెదిరించి దోపిడీ (Pune robbery news) చేశారు

  • ఆర్యన్ ఖాన్ కస్టడీ పొడిగింపు

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​(aryan khan news) కస్టడీని పొడిగించింది ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానం. దీంతో మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నాడు ఆర్యన్.

  •  క్వార్టర్స్​కు సింధు

డెన్మార్క్ ఓపెన్​లో స్టార్​ షట్లర్ పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకుంది. గురువారం జరిగిన పోరులో థాయ్​లాండ్​ క్రీడాకారిణి బుసానన్​పై విజయం సాధించింది. కాగా, పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్.. జపాన్​ ఆటగాడు కెంటో చేతిలో ఓటమిపాలయ్యాడు.

18:49 October 21

టాప్​​ న్యూస్​ @7PM

  • 30 మందికి  అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

  •  పట్టాభికి  రిమాండ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్​కు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

  •  భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!

ఉప ఎన్నికలకు(West Bengal By Election 2021) గడువు సమీపిస్తున్న వేళ.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం బంగాల్​లో కలకలం సృష్టించింది. బీర్​భూమ్​ జిల్లాలో(West Bengal birbhum News) ఓ వాహనంలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • వాటికి భారీగా మూలధన సాయం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన సాయం (Capital infusion in Public Sector Banks) అందించే అవకాశముంది. బ్యాంకుల మూలధన స్థాయిని సమీక్షించి.. నియంత్రణ అవసరాలను తీర్చడానికి సహాయాన్ని (Capital infusion to banks) అందించనున్నట్లు తెలుస్తోంది.

  • ఆదేశంపై ఆంక్షలకు  డిమాండ్

వరుస క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు (North Korea missile test) విధించాలని (North Korea UN sanctions) అమెరికా, ఐరోపా సభ్య దేశాలు కోరాయి. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించాయి. బైడెన్ యంత్రాంగంతో చర్చలు జరపాలని సూచించాయి.

17:51 October 21

టాప్​​ న్యూస్​ @6PM

  •  దళితబంధుపై పిల్‌

 హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది (PIL in hc on suspension of Dalit bundh in Huzurabad). ఈసీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సామాజిక వేత్త మల్లెపల్లి లక్ష్మయ్య పిటిషన్​ దాఖలు చేశారు. ఈసీ, సీఈవో, రాష్ట్ర ప్రభుత్వాన్ని... పిటిషనర్​ ప్రతివాదులుగా పేర్కొన్నారు.  

  •  ట్రైనీ ఐఏఎస్​పై లైంగిక దాడి కేసు

ట్రైనీ ఐఏఎస్ బానోత్‌ మృగేందర్‌లాల్‌పై (Trainee IAS sexual harassment case) కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. మృగేందర్‌లాల్‌ పెళ్లి‌ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐఏఎస్‌ మృగేందర్‌లాల్‌పై కేసు చేశారు. మృగేందర్‌లాల్‌.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుమారుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

  • అక్కడ సభలు పెట్టకూడదు

ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని సీఈసీ స్పష్టం చేసింది. ఉపఎన్నిక ప్రవర్తన నియమావళిపై సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

  • . ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్'

టాలీవుడ్​కు సంబంధించిన కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సమ్మతమే'(sammathame first glimpse), 'శ్రీదేవి సోడా సెంటర్'​(sridevi soda center ott)కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

  • ఒకే ఓవర్లో 8 సిక్సర్లు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి​ అరుదైన ఫీట్​ను సాధించాడు. ఒకే ఓవర్లో 8 సిక్సర్లు బాదాడు. ఆ ఆటగాడు ఎవరంటే?

16:55 October 21

టాప్​​ న్యూస్​ @5PM

  • పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పరీక్ష ఫలితాలు (Pg Entrance Exam Results) విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల Higher Education Council Chairman Limbadri) చేశారు. సీపీగెట్​లో 92.51 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సీపీగెట్ ర్యాంకులతో ఓయూ, కేయూ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్​టీయూల్లో పీజీ కోర్సుల భర్తీ చేయనున్నారు.

  • ఇది ప్రతి భారతీయుడి విజయం

కొవిడ్​ కట్టడిలో భాగంగా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే వందకోట్ల వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసి... భారత్ గొప్ప మైలురాయిని అందుకుందని బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణాఎల్లా (Bharath Biotech MD Krishna Ella on Vaccination) ప్రకటించారు (Bharath Biotech On Vaccination). ఇటువంటి చారిత్రాత్మక ఘట్టంలో భారత్ బయోటెక్ భాగస్వామ్యంకావటం గర్వంగా ఉందన్నారు.

  • ఉద్యోగులకు దీపావళి కానుక..!

ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో డీఏ 31 శాతానికి చేరనుంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో 47.14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందుతారు.

  • ఫ్రీగా సినిమాలు చూసేయండి!

ఐనాక్స్ థియేటర్స్(inox movies) గ్రూప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 22న తమ గ్రూప్ థియేటర్లలో ఉచితంగా సినిమాలు వీక్షించొచ్చని వెల్లడించింది. మరి ఇదెక్కడో తెలుసా?

  • కొరియా సొంత రాకెట్ ప్రయోగం

సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రాకెట్ ప్రయోగానికి దక్షిణ కొరియా సర్వం సిద్ధం చేసింది. 1.5 టన్నుల బరువైన డమ్మీ పేలోడ్​ను రాకెట్​ ద్వారా భూకక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. సొంత పరిజ్ఞానంతో అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు చేపట్టిన పదో దేశంగా రికార్డు సృష్టించనుంది.

15:55 October 21

టాప్​​ న్యూస్​ @4PM

భారత్​కు  ప్రశంసలు!

కొవిడ్ టీకా పంపిణీలో 100కోట్ల డోసులను(India 100 crore vaccine) భారత్​ పూర్తి చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సంతోషం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు భారత్​ చేస్తున్న కృషిని కొనియాడింది. మరోవైపు.. తక్కువ వ్యవధిలోనే భారత్ ఈ ఘనత(Vaccine Milestone) సాధించడంపై భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

'ఇంటికో ఓటు మాకు వేయండి'

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో (huzurabad by poll) "ఇంటికో ఓటు... కాంగ్రెస్‌కు వేయండి" అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు (revanth reddy on huzurabad election campaign). నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని అయన సూచించారు.

ఉత్తరాఖండ్​లో అమిత్​ షా 

ఉత్తరాఖండ్​లో వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాా ఏరియల్​ సర్వే నిర్వహించారు. మొత్తం 3500 మందికిపైగా వరద బాధితులను రక్షించామని.. 16వేలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అమిత్​ షా వెల్లడించారు.

'భీమ్లా నాయక్'  ఫొటో వైరల్

పవన్ కల్యాణ్(pawan kalyan new movie), రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'(bheemla nayak new update). ఈ సినిమా షూటింగ్ స్పాట్​లోని ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్రబృందం. ఇందులో పవన్, రానా విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.

 మార్కెట్లపై బేర్​ పంజా

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​లోనూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 336 పాయింట్లు కోల్పోయి 60,923 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్లు దిగజారి 18,178 వద్ద ముగిసింది.

14:36 October 21

టాప్​​ న్యూస్​ @3PM

  • ప్రపంచ దేశాలకు అందించే స్థాయికి ఎదిగాం

వందకోట్ల కరోనా టీకా పంపిణీ పూర్తైన దేశంగా భారత్​ ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు. దేశీయ టీకానే తీసుకున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. 

  • రెండోరోజు  'ప్రజాప్రస్థానం' 

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా... వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర..... రెండోరోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి నుంచి మొదలైంది

  • వారికి స్మార్ట్​ఫోన్​లు, ఈ-స్కూటీలు!

ఉత్తర్​ప్రదేశ్​లో అధికారంలోకి వస్తే ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్​ఫోన్లు (Smartphones for students) అందిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi twitter) ప్రకటించారు. డిగ్రీ చదివిన యువతులకు విద్యుత్ స్కూటీలు ఇస్తామని తెలిపారు.

  • సరిహద్దులో సైనికుల డ్రిల్

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అరుణాచల్​ ప్రదేశ్​లోని తవాంగ్​ సెక్టార్​లో భారత జవాన్లు చైనాకు దీటుగా డ్రిల్​ నిర్వహించారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ విన్యాసాల​ ద్వారా చైనాకు సంకేతాలు అందించారు.

  • డైరెక్టర్  అల్లుడిపై పోక్సో కేసు

తమిళ దర్శకుడు శంకర్​ అల్లుడిపై(shankar son in law name) పోలీసులు కేసు పెట్టారు. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఇతడితోపాటు మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేశారు.

13:59 October 21

టాప్​​ న్యూస్​ @2PM

  • గర్వంగా ఉంది: తమిళిసై

వందకోట్ల కరోనా టీకా పంపిణీ పూర్తైన దేశంగా భారత్​ ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు. దేశీయ టీకానే తీసుకున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వంద కోట్ల కరోనా టీకా పంపిణీ పూర్తైన సందర్భంగా హైదరాబాద్ సనత్​నగర్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి వైద్యులు, వైద్య సిబ్బందిని గవర్నర్(Telangana Governor Tamilisai soundararajan) సత్కరించారు.

  • రామప్పలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

ఇటీవల ప్రపంచ వారసత్వ సంపద(World Heritage Recognition to Ramappa Temple) గా గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు.

  • ఆటగాళ్లు ఎలాంటి ఫామ్​లో ఉన్నారంటే?

ఈ సారి టీ20 ప్రపంచకప్​ను(T20 worldcup 2021 schedule) ఎలాగైనా ముద్దాడాలనే పట్టుదలతో ఉంది టీమ్​ఇండియా. దీనికోసం ఆటగాళ్లు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో ఉన్న మన ప్లేయర్స్​ ఇటీవల జరిగిన ఐపీఎల్​లో ఎలా ఆడారో తెలుసుకుందాం..

  • ​ ప్రైమ్​ యూజర్లకు బ్యాడ్​ న్యూస్!

ప్రైమ్​ యూజర్లకు, కొత్తగా ప్రైమ్​ సేవల్ని పొందాలనుకుంటున్నవారికి అమెజాన్(Amazon Prime) షాకింగ్​ న్యూస్​. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon Prime Subscription) ధరలను ఏకంగా 50 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్​తో పాటు నెలవారీ, మూడు నెలల కాలానికి చెల్లించాల్సిన మెంబర్​షిప్​ ధరల కూడా ఈ మేరకు పెరగనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో సోదాలు

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు ఎన్​సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమె ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్యన్​ఖాన్ ఫోన్ చాట్​లో ఉన్న నటి అనన్య పాండే అని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రైడ్స్ జరిగినట్లు కనిపిస్తుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను ప్రశ్నించనున్నారు.

12:56 October 21

టాప్​​ న్యూస్​ @1PM

  • రామప్ప సందర్శనలో కిషన్​రెడ్డి

  • నిర్బంధించడం సరికాదు

దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు అక్కడి నుంచి వెళ్లేలా చేయాలని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొన్న న్యాయస్థానం... (Farmers protest Supreme Court) రహదారులను నిరవధికంగా నిర్బంధించకూడదని వ్యాఖ్యానించింది.

  • హైకోర్టులో పిటిషన్

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Intermediate First year Exams) రద్దు చేయాలని హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ తల్లిదండ్రుల సంఘం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు.

  • టీమ్​ఇండియా 'స్క్విడ్​గేమ్'​ ఛాలెంజ్

'స్క్విడ్​గేమ్​'లోని(squid game movie) 'డల్​గోనా క్యాండీ' ఛాలెంజ్​ను స్వీకరించారు టీమ్​ఇండియా ప్లేయర్స్​(t20 worldcup teamindia squad). దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్​ చేయగా.. అది కాస్త వైరల్​గా మారింది. అభిమానులను ఆకట్టుకుంటోందీ వీడియో.

  • వెబ్ సిరీస్​లో మోహన్​బాబు

తెలుగు నటీనటులు మెల్లగా ఓటీటీలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు తారలు సిరీస్​లు, షోలు చేస్తుంటగా.. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్​బాబు(mohan babu movies) కూడా ఓ వెబ్ సిరీస్​లో నటించేలా కనిపిస్తున్నారు.

11:47 October 21

టాప్​టెన్​ న్యూస్​ @12PM

  • ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి సొంతం

దిల్లీ ఎయిమ్స్​లో ఇన్ఫోసిస్​​ సంస్థకు చెందిన విశ్రామ సదన్​ను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో టీకా పంపిణీ 100కోట్లు దాటిన క్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడికి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

  • దేశంలో టీకా పంపిణీ సాగిందిలా..

100కోట్ల టీకా పంపిణీ మార్కును గురువారం అందుకుంది భారత్​. మూడో ముప్పు అనివార్యం అన్న వార్తల నేపథ్యంలో ఈ రికార్డు ఊరటనిచ్చే విషయం అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మార్కును అందుకోవడం అంత సులభంగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడుదొడుకులను జయించి టీకా పంపిణీలో భారత్​ ఈ స్థాయికి చేరింది. ఆ విశేషాలను ఓసారి చూద్దాం..

  • తెదేపాను అంతం చేసేందుకే దాడి

కొందరి తీరు వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu)మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టే వారిని వదలమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని అన్నారు.

  • 'ఏడేళ్లుగా మతఘర్షణలు లేవు'

తెలంగాణలో ఏడేళ్లుగా ఎలాంటి మతఘర్షణలు లేకుండా పోలీసు శాఖ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ(Telangana Home Minister Mahmood Ali) పునరుద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Martyrs Remembrance Day in Telangana) సందర్భంగా హైదరాబాద్​ గోషామహల్​ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.

  • ఐదుగురు హీరోయిన్లు.. ఒకే స్టేజీపై

ఈసారి దీపావళికి దుమ్మురేపే ప్రోగ్రాంను(etv deepavali special event) ఈటీవీలో ప్రసారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది.
 
10:50 October 21

టాప్​టెన్​ న్యూస్​ @11AM

  • నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

నిండా నాలుగేళ్లు లేవు. స్నేహితులతో ఆడుకుందామని బయటకు వెళ్లింది. చాక్లెట్ ఇస్తానని పిలిస్తే అతని వెంటవెళ్లింది. గంజాయి కంపు కొడుతుంటే.. ముక్కు మూసుకుంది. తూలుతూ నడుస్తుంటే.. అంకుల్​కి ఏమైందోనని కంగారు పడింది. అంకుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. చాక్లెట్ ఇవ్వండి అంటే.. అక్కడికి వెళ్లాక ఇస్తానని చెబితే నిజమేనేమోనని నమ్మేసింది. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్తే భయపడింది. చాక్లెట్​ ఇస్తానని వెళ్తే.. అఘాయిత్యానికి పాల్పడతాడని ఊహించలేకపోయింది. 

చరిత్ర సృష్టించిన భారత్

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భారత్​ చరిత్ర సృష్టించింది. టీకా పంపిణీలో 100కోట్ల మార్కును అందుకుంది(india vaccination count). జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంతో అక్టోబర్​ 21 నాటికి 100కోట్లకు చేరింది.

  • కొత్తగా 18,454 కరోనా కేసులు

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 18,454 మంది​కి కరోనా (Coronavirus update) సోకగా.. వైరస్​​ ధాటికి(Covid cases in India) మరో 160 మంది మరణించారు. ఒక్కరోజే 17,561 మంది రికవరీ అయ్యారు.

  • భారీగా పెరిగిన వెండి ధర

బంగారం ధర (Gold Rate Today) గురువారం పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • ముంబయి జైలుకు హీరో షారుక్​

బాలీవుడ్ హీరో షారుక్​ఖాన్.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్​ఖాన్​ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. ముంబయిలోని ఆర్థర్​ రోడ్​ జైలుకు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెళ్లారు.
 
09:45 October 21

టాప్​టెన్​ న్యూస్​ @10AM

  • నెహ్రూ కంటే ముందే..

భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రమాణం చేయటానికి నాలుగేళ్ల ముందే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆ పని చేశారు. 1943లో సరిగ్గా ఇదే రోజు (అక్టోబరు 21) నేతాజీ సారథ్యంలో సింగపూర్‌ వేదికగా భారత తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. వారి చేతిలో ఉన్న భారత భూభాగం.. అండమాన్‌ నికోబార్‌ దీవి మాత్రమే!

  • జాబ్ రాలేదని.. కలవరం వద్దు!

ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎక్కువ మందికి ఉండే ఆందోళన ఇది. అలాంటి భయం అవసరమే లేదని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌(Campus Placements)లో ఉద్యోగం రాకున్నా, ఆఫ్‌ క్యాంపస్‌(Off campus recruitment) మార్గాల్లో కొలువుకు ఎన్నో అవకాశాలున్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. 

  • చిన్న పిల్లల్లో అలర్జీలా..

అలర్జీలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మనకు పడనివి ఏమి తిన్నావెంటనే దాని ప్రభావం చూపిస్తుంది. ఒంటి మీద దద్దుర్లు రావడం, దురద రావడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. మరి పిల్లల్లో ఎలాంటి అలర్జీలు వస్తాయి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం?

  • మాజీ క్రికెటర్​ అరెస్ట్​

గృహహింస కేసులో(michael slater news) ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ మైకేల్​ స్లేటర్​ను పోలీసులు అరెస్ట్​ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని(michael slater commentary) అక్కడి ఓ వార్త సంస్థ తెలిపింది.

  • ఎక్కడ చూసినా కొరియన్​ హవా!

కొంత కాలం(squid game netflix review) నుంచి కొరియన్​ సినిమాలు, పాటలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ పెరిగింది. వీటిని ఎక్కువగా వీక్షించే దేశాల్లో భారత్​ కూడా ఉండటం విశేషం(korean movies netflix india). ఇవి చూసి ఇక్కడి సినీప్రియులు కొరియన్​ భాష నేర్చుకోవడం సహా ఆ దేశ సంస్కృతి, జీవనశైలి​, ఫ్యాషన్​ను అలవరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొరియన్​ హవా ఎలా మొదలైందో తెలుసుకుందాం.

08:49 October 21

టాప్​టెన్​ న్యూస్​ @9AM

  • పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

పాఠశాల విద్యాశాఖ(Telangana Education Ministry)లో కొత్తగా 5,323 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • నిత్యావసరాల ధరల పెరుగుదల

ఖర్చులు పెరుగుతున్నాయి.. ఆదాయం మాత్రం పడిపోయింది. దాదాపు అన్ని వర్గాలను కరోనా దెబ్బకొట్టింది. మార్కెటింగ్‌ ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, మెకానిక్‌లు, ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు, ఇతర వృత్తుల వారిదీ ఇదే పరిస్థితి. ఖర్చులు పెరిగిన స్థాయి(Commodity price Hike)లో ఆదాయం పెరగకపోవడంతో అనేక మంది అప్పుల పాలవుతున్నారు. 15 రోజులకోసారి ఏదో ఒక రూపంలో సామాన్యుడిపై భారం పడుతూనే ఉంది.

  • అన్నంత పని చేసిన ట్రంప్

క్యాపిటల్​ హింసాత్మక ఘటన అనంతర పరిణామాలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను(trump latest news) సామాజిక మాధ్యమాలు బహిష్కరించాయి. అప్పటి నుంచి.. సొంత సామాజిక మాధ్యమ వేదికను ట్రంప్​ తీసుకొస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ ట్రంప్​ తాజాగా తన 'ట్రూత్​ సోషల్​'(truth social media) యాప్​ను ప్రకటించారు. త్వరలో ట్రూత్​ సోషల్​ను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు.

  • మరోసారి పెరిగిన చమురు ధరలు

దేశంలో ఇంధన​ ధరల (Fuel Price Today) పెంపు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • నీరజ్ వేట.. మళ్లీ మొదలైంది

టోక్యో ఒలింపిక్స్​లో(neeraj chopra tokyo olympics) గోల్డ్​ మెడల్​ సాధించిన నీరజ్​ చోప్డా తిరిగి తన శిక్షణను ప్రారంభించాడు. తన(tokyo olympics gold medal india) ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
 
07:53 October 21

టాప్​టెన్​ న్యూస్​ @8AM

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని(World Heritage Recognition to Ramappa Temple) కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఇవాళ సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్​ను సందర్శించి.. గట్టమ్మ దేవాలయం వద్ద పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

  • నేటి నుంచి గురుకులాలు

కరోనా వ్యాప్తితో గతేడాది మూపడిన తెలంగాణ గురుకులాలు(Telangana Gurukul Schools Reopened) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో దానికనుగుణంగా సొసైటీలు కార్యాచరణ ప్రకటించాయి. పాఠశాల/కళాశాలకు వచ్చే విద్యార్థులకు కరోనా పరీక్ష తప్పనిసరికాదని స్పష్టం చేశారు.

  • విద్యార్థిని కొట్టిచంపిన టీచర్​!

హోంవర్క్​ చేయలేదన్న కారణంతో 7వ తరగతి విద్యార్థిని చితకబాదాడు ఓ టీచర్​. విద్యార్థి తలని నేలకేసి కొట్టడం వల్ల అతను స్పృహ కోల్పోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రాజస్థాన్​ కోలాసర్​ గ్రామంలో జరిగింది.

  • 'ఇది స్పిన్నర్ల ప్రపంచకప్‌'

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup 2021) స్పిన్నర్లు బాగా రాణించగలరని అభిప్రాయపడ్డాడు అఫ్గానిస్థాన్​ బౌలర్ రషీద్​ ఖాన్(rashid khan t20 world cup)​. యుఏఈ పిచ్​లు తమకు అనుకూలంగా ఉంటాయని అన్నాడు.

  • 'బ్రీత్' సిరీస్​కు​ సీక్వెల్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో బీస్ట్, సూర్యవంశీ, రాజా విక్రమార్క చిత్రాలతో పాటు 'బ్రీత్' వెబ్ సిరీస్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

06:42 October 21

టాప్​టెన్​ న్యూస్​ @7AM

  • భారత్ మరో మైలురాయి

టీకా పంపిణీలో శుక్రవారం భారత్​ చరిత్ర సృష్టించనుంది. గురువారం నాటికి 100 కోట్ల వ్యాక్సిన్లను అందించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రముఖ గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ రాసిన పాటను, మరో చిత్రాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఎర్రకోట వద్ద ఆవిష్కరించనున్నారు.

  • జోరందుకున్న ఉపఎన్నిక పోరు

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక(huzurabad by election) ప్రచారం జోరందుకుంది. ఎన్నికలో గెలుపు కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. విమర్శలను ఎక్కుపెట్టిన అధికార, విపక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • చైనా బహుముఖ దాడి

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ కోసం కమాండర్ స్థాయి చర్చల్లో పాల్గొంటూనే.. కుటిల నీతికి అవలంబిస్తోంది చైనా. ప్రపంచదేశాల్లో.. ముఖ్యంగా భారత్​ పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కుట్రలకు తెరలేపుతోంది.

  • ఆ ఛాంపియన్లు టీ20 వేటకొచ్చారు

2019 వన్డే ప్రపంచకప్‌ను(2019 odi world cup winner) సొంతం చేసుకుని.. దశాబ్దాల కల సాకారం చేసుకున్న జట్టు ఒకటి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా(world test championship winner) నిలిచినప్పటికీ.. ఇంకా తొలి ప్రపంచకప్‌ను అందుకోవడానికి పోరాటం సాగిస్తున్న జట్టు మరొకటి. 

  • నటించడమే నాకిష్టం: నిధి

గ్లామర్, మోడ్రన్​ పాత్రలే కాకుండా డిఫరెంట్​గా ఉండే రోల్స్​లో కనిపించడం తనకు ఇష్టమని హీరోయిన్ నిధి అగర్వాల్(nidhi agarwal movie list) చెబుతోంది. 'హరిహర వీరమల్లు' సినిమాలో తనకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపింది.

06:07 October 21

టాప్​న్యూస్​ @ 6AM

  • గంజాయిపై ఉక్కుపాదం..

"మత్తు పదార్థాల కారణంగా రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనవుతోంది. గ్రామ గ్రామాన గంజాయి వాడకం ఉంది. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కలిసి ఏమి చేస్తారో.. నాకు తెల్వదు. బయట నుంచి బయట నుంచి రావద్దు, స్థానికంగా సాగు కానీ.. వాడకం కానీ,, జరగకూడదు" అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టంచేశారు.

  • విదేశాలతోనూ పోటీకి సిద్ధం..

యూరోపియన్ బిజినెస్ గ్రూప్ నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ వ్యాపార వాణిజ్య వర్గాలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, ఇక్కడి వ్యాపార అనుకూలతలను మంత్రి కేటీఆర్ వివరించారు. యూరప్ వ్యాపార వాణిజ్య వర్గాలను చేరుకుని తెలంగాణ గురించి వివరించేందుకు సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

  • రెండోరోజుకు ప్రజాప్రస్థానం..

వైఎస్​ షర్మిల పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు సుమారు 10 కిలోమీటర్ల వరకు నడిచి.. పలు గ్రామాల ప్రజలను కలిశారు. గ్రామస్థులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు సందర్భంగా ఇవాళ ఉదయం 9:30కు షర్మిల పాదయాత్ర నక్కలపల్లి నుంచి ప్రారంభమవనుంది.

  • నేడో, రేపో అమలుపై సమీక్ష..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికీ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించకపోవటం వల్ల.. గెజిట్ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) అమలు పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళో, రేపో సమీక్షించనుంది.

  • ఫలితాలు నేడే విడుదల..

రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీజీఈటీ-2021 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫసర్ లింబాద్రి.. ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • వైకాపా జనాగ్రహ దీక్షలు..

తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలో.. వైకాపా ఆధ్వర్యంలో నేడు, రేపు రెండు రోజులపాటు జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala comments on tdp leaders news) ప్రకటించారు. ఈ దీక్షలపై బుధవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీ.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ జనాగ్రహ దీక్షలకు వైకాపా పిలుపునిచ్చింది. 

  • చంద్రబాబు 36 గంటల దీక్ష

ఏపీలో తెదేపా కార్యాలయాలపై దాడి(attack on tdp offices)కి నిరసనగా దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) నిర్ణయించారు. ఈరోజు ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 36 గంటల పాటు ఆయన దీక్ష చేపట్టనున్నారు. మంగళవారం జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెదేపా కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నట్లు సమాచారం.

  • మళ్ళీ కొవిడ్‌ కల్లోలం..

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోందా? దేశంలో థర్డ్​ వేవ్ తప్పదా? ఉత్పరివర్తనాల ముప్పు నుంచి తప్పించుకోలేమా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. ఆయా దేశాల్లో తగ్గినట్టే తగ్గి.. మళ్లీ తిరగబెడుతున్న కొవిడ్ కేసులే దీనికి నిదర్శనం. బ్రిటన్ సహా.. పలు దేశాల్లో రోజువారీ కేసుల్లో పెరగుదల కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని చెబుతోంది.

  • టీ20 సెలెక్షన్​పై అసహనం..

టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో పాకిస్థాన్​ టీమ్ సెలెక్షన్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ జట్టు మాజీ కోచ్ మిస్బా ఉల్​ హక్. జట్టును ఎంపిక చేసిన పది రోజులకే ముగ్గురు ఆటగాళ్లను మార్చడం వల్ల సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  • సర్కారు వారి పాట ట్యూన్​ అదిరింది..

మహేశ్ బాబు(mahesh babu movies) హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata songs). ఈ చిత్రంలోని ఓ సాంగ్​కు సంబంధించిన ఆసక్తికర ట్వీట్ చేశారు సంగీత దర్శకుడు తమన్.

Last Updated : Oct 21, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.