ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్ న్యూస్

etv bharat top news
ఈటీవీ భారత్
author img

By

Published : Oct 4, 2021, 6:00 AM IST

Updated : Oct 4, 2021, 9:59 PM IST

21:54 October 04

టాప్​ న్యూస్​ @10PM

  • ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్​ సేవలకు అంతరాయం

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలు గత కొన్ని నిమిషాల నుంచి నిలిచిపోయాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ నుంచి సందేశాలు వెళ్లడం, రావడం పూర్తిగా నిలిచిపోయాయి. 

  • 'అది అజీర్తి యాత్ర'

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి అయితే.. తొలి ద్రోహి రేవంత్ రెడ్డి అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ది తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దళిత బంధు పథకం రాష్ట్రమంతటా అమలు చేసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

  • 'పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలి'

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టును పాండోరా పేపర్స్​ (Pandora Papers Leak) రట్టు చేసిన నేపథ్యంలో ఎగవేతదారులకు స్వర్గధామంగా మారిన మార్గాలను తక్షణమే నిర్మూలించాలని ఆక్స్​ఫామ్​ ఇండియా (Oxfam India) పిలుపునిచ్చింది. ఈ రహస్య మార్గాల ద్వారా డబ్బు చేతులు మారుతోందని ఆ సంస్థ సీఈఓ అమితాబ్​ బెహర్​ తెలిపారు. ప్రభుత్వాలు వాటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.

  • బ్యాటింగ్​లో తడబడిన చెన్నై

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​ చెన్నై సూపర్​ కింగ్స్​(CSK Vs DC) బ్యాటింగ్​లో తడబడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఫలితంగా గెలుపు కోసం దిల్లీ జట్టు 137 పరుగులు చేయల్సిఉంది.

  • 'మాపై ఆరోపణలు హాస్యాస్పదం'

కరోనా కాలంలో తామెంతోమందికి సాయం చేశామని అన్నారు ప్రముఖ నటి జీవితా రాజశేఖర్​(Jeevitha Rajasekhar Latest News). సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశామని గుర్తుచేశారు. కళాకారులకు తమ వంతు ఎన్నో సహాయ సహకారాలు అందించినా.. కొంతమంది తమను టార్గెట్​ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

20:50 October 04

టాప్​ న్యూస్​ @9PM

  • 'అక్కడ కూడా దళితబంధు ఇస్తాం'

వ్యవసాయం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని... కేంద్రమే చెబుతుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. దేశంలో కాంగ్రెస్​ పార్టీ ఉనికిని కోల్పోతుందని.. మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ హయాంలో ఫ్లోరోసిస్​ వ్యాపించిందని ఆరోపించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో.. మునుగోడు, వికారాబాద్​ నియోజకవర్గాలకు చెందిన పలువురు కేటీఆర్​ సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు.

  • యూపీని కుదిపేశాయి..

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం జరిగిన హింసాత్మక(lakhimpur kheri violence news) ఘటనల వేడి ఇంకా చల్లారలేదు. విపక్షాల నిరసనలు, అగ్రనేతల నిర్బంధంతో సోమవారం రాష్ట్రం దద్దరిల్లింది. బాధితులను ఆదుకుంటామని, ఘటనపై విచారణ చేపడతామని ప్రభుత్వం హామీనిచ్చింది. అదే సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నేతలను అడ్డుకుని నిర్బంధించింది. ఈ వ్యవహారంపై విపక్షాలు ఘాటుగానే స్పందించాయి.

  • కరెంటు లేదని నదిలో స్నానానికి వెళ్లి..

నదిలో స్నానానికి వెళ్లిన తండ్రి, ఇద్దరు పిల్లలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్​పూర్​లో జరిగింది. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

  • హిట్​మ్యాన్​ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లాండ్​తో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్​పై టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మ(Rohit Sharma England Series) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్​ తన కెరీర్​లో ఉత్తమమైనదని వస్తున్న విశ్లేషణలపై స్పందించిన హిట్​మ్యాన్​.. తనలోని బ్యాటింగ్​ ప్రదర్శనను మరింత బయట పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

19:54 October 04

టాప్​ న్యూస్​ @8PM

  • తీర్పు రిజర్వ్​ 

రాయలసీమ ఎత్తిపోతల పథకం( Rayalaseema Lift Irrigation) పనుల్లో హరిత ట్రిబ్యునల్‌ (NGT) ఆదేశాలు ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (AP government) దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్‌ చేసింది. ఈ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపట్టారని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ-చెన్నై బెంచ్‌ విచారణను ముగించింది.

  • యోగి సర్కార్​కు నిరసన సెగ

  • ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలన్న డిమాండ్​తో కలెక్టర్​ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​లో జరిగింది.

  • చెన్నై బ్యాటింగ్​

ఐపీఎల్​ 2021లో (IPL 2021 news) భాగంగా సోమవారం (అక్టోబర్ 4) చెన్నై సూపర్​కింగ్స్​, దిల్లీ క్యాపిటల్స్​ ​మధ్య (CSK Vs DC) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ​.. బౌలింగ్​​ ఎంచుకుంది.

  • 'చిత్రసీమకు ఎప్పటికీ చిరంజీవే పెద్ద దిక్కు'

ఇన్నాళ్లూ 'మా' అసోసియేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పెద్దలను ప్రశ్నించేందుకే ఎన్నికల్లో(MAA Elections 2021) పోటీ చేస్తున్నట్లు చెప్పారు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj). కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది సినీ కార్మికులను మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారని.. మంచు కుటుంబం ఎంతమందికి సహాయం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా ప్రకాశ్​ రాజ్​ ప్రశ్నించారు.

18:51 October 04

టాప్​ న్యూస్​ @7PM

  • 'పాతబస్తీకి మెట్రో పక్కా..'

హైదరాబాద్​ పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్​ (Minister KTR on Old City Development) అసెంబ్లీలో మాట్లాడారు. కాంగ్రెస్‌ కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం (telangana government) కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో పాతబస్తీకి మెట్రో (metro) వస్తుందని తెలిపారు.

  • 'పాండోర్​ పేపర్స్​'పై కేంద్రం దృష్టి

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేసిన పాండోరా పేపర్స్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పత్రాల్లో ఉన్న భారతీయులకు సంబంధించిన కేసులపై విస్తృత దర్యాప్తు జరపాలని నిర్ణయించింది.

  • జపాన్​ కొత్త ప్రధాని కిషిడాకు మోదీ శుభాకాంక్షలు

జపాన్​ నూతన ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు ప్రధాని నరేంద్ర మోదీ(modi news today) శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

  • తాగు నీరు, కరెంట్ లేక థాయిలాండ్ వాసుల అష్టకష్టాలు

థాయిలాండ్​లోని పలు రాష్ట్రాల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వరద ఉద్ధృతి తగ్గినా.. ప్రజలు భయం గుప్పిట్లోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా, తాగు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.

  • ఎన్​సీబీ కస్టడీకి ఆర్యన్​ ఖాన్​

డ్రగ్స్​ కేసులో భాగంగా అరస్ట్​ అయిన ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ను తిరస్కరించిన ముంబయి కోర్టు.. అక్టోబరు 7 వరకు ఆర్యన్​ను ఎన్​సీబీ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ఆర్యన్​తో పాటు అర్బాజ్​, దమేచాలను విచారించాలని కోర్టు తీర్చునిచ్చింది.

17:55 October 04

టాప్​ న్యూస్​ @6PM

  • ఆంధ్ర, తెలంగాణ సీఎంలకు స్టాలిన్​ లేఖ

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు ఎంకే స్టాలిన్(stalin cm of tamil nadu)​. అందులో నీట్​ను ప్రస్తావించారు తమిళనాడు సీఎం(stalin neet news). విద్యాశాఖ నిర్వహణ రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని బలంగా చెప్పారు.

  • 'దళితబంధు తరహాలో ముస్లింలకు కూడా ఇవ్వాలి'

దళితబంధు తరహాలో ముస్లింలకు కూడా ఇవ్వాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్​మెంట్​ నిధులు విడుదల చేయకపోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అందువల్ల రాష్ట్రంలో సుమారు వందకు పైగా కళాశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. 

  • పోలీసులుగా మారిన తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో రెండు దశాబ్దాల పోరాటం తర్వాత అధికార పీఠాన్ని అధిష్ఠించిన తాలిబన్లు (Taliban Afghanistan) షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. నేరం చేసిన వారికి అనాగరికమైన శిక్షలు విధిస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఆయుధాలు ధరించి వీధుల్లో గస్తీ నిర్వహిస్తూ తప్పుచేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇస్లాం పండితులే న్యాయమూర్తులుగా మారి షరియా చట్టం ప్రకారం శిక్షలను విధిస్తున్నారు.

  • డ్రోన్ల సాయంతో టీకాల సరఫరా

ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మణిపుర్​లోని విష్ణుపుర్​ జిల్లా ఆసుపత్రి నుంచి కరాంగ్​ అనే ప్రాంతానికి డ్రోన్​ సాయంతో టీకాలను అందించారు.

  • మరో పాన్​ ఇండియా సినిమాలో ప్రభాస్​!

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రెబల్​స్టార్​ ప్రభాస్(Prabhas New Movie)​ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రానుంది. అక్టోబరు 7న ప్రభాస్​ నటించనున్న 25వ చిత్ర(Prabhas 25th Movie) వివరాలను ప్రకటించనున్నారు.

16:52 October 04

టాప్​ న్యూస్​ @5PM

  • 'వ్యాపారులకు తగిన సమయమివ్వాలి'

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఈ నెల 18 వరకు అక్కడే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా బాట సింగారంకు తరలించడంపై హోల్ సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ పిటిషన్‌పై  హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. 

  • సూత్రధారి ఎవరు..?

తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్​ (Telugu academy fd scam)వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అకాడమీ, బ్యాంకు అధికారులు పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నలుగురిని.. కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్​ వేశారు. వీరిని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • గృహ నిర్బంధంలో ప్రియాంక నిరాహార దీక్ష

ఉత్తర్​ప్రదేశ్​లో నిరాహార దీక్ష చేపట్టారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news today). లఖింపుర్​ హింసాత్మక ఘటన(lakhimpur kheri news today) నేపథ్యంలో ప్రియాంక దీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

  • వార్నర్​ వచ్చాడు.. జోష్​ తెచ్చాడు

గత కొన్ని మ్యాచుల్లో (IPL 2021) సన్​రైజర్స్​ హైదరాబాద్​ తుది జట్టులో డాషింగ్ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్​కు (David Warner) చోటు లభించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జట్టు తనను తప్పించినా.. ఆరెంజ్ ఆర్మీ జెర్సీలోనే కనిపించి సన్​రైజర్స్​పై అభిమానాన్ని చాటుకున్నాడు వార్నర్.

  • రెబల్​స్టార్​ను కలిసిన మంచు విష్ణు

'మా' ఎన్నికలు(MAA Elections) దగ్గర పడుతున్న క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ పడనున్న ప్రకాశ్​ రాజ్​, మంచు విష్ణు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అసోసియేషన్​ సభ్యుల సమావేశాల్లో ప్రకాశ్​ రాజ్​(Prakash Raj MAA Elections) బిజీగా ఉండగా.. మరోవైపు మంచు విష్ణు(Manchu Vishnu MAA Elections) సీనియర్​ నటుల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు.

15:48 October 04

టాప్​ న్యూస్​ @4PM

  • పోలీసులపై కేటీఆర్​ ప్రశంసలు

రాంగ్​రూట్​లో వచ్చిన తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై మంత్రి కేటీఆర్​ ప్రశంసలు కురిపించారు. తన కార్యాలయానికి పిలిపించుకొని శాలువతో సత్కరించారు. నిజాయతిగా వ్యవహరించే అధికారులకు తాము ఎప్పుడు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

  • వివాహితపై దారుణం

వివాహితపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

  • డేవిడ్​-ఆర్డెమ్​కు వైద్య శాస్త్రంలో నోబెల్​ బహుమతి

మెడిసిన్​ విభాగంలో నోబెల్​ బహుమతి -2021ని ప్రకటించారు. డేవిడ్​ జులియస్​, ఆర్డెమ్​ పటాపౌటియన్​కు సంయుక్తంగా అవార్డు లభించింది.

  • వరుస నష్టాలకు బుల్​ బ్రేకులు

స్టాక్ మార్కెట్లు (Stock Market) నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి సోమవారం కాస్త తేరుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 534 పాయింట్లు పెరిగి 59,300 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 159 పాయింట్ల లాభంతో 17,700 మార్క్​కు చేరువైంది.

  • ఆర్యన్‌తో ఫోన్​లో మాట్లాడిన షారుక్

డ్రగ్స్​ కేసులో(Drugs Case News) అరెస్టయిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్​తో బాలీవుడ్​ సూపర్ స్టార్ షారుక్ ఖాన్​ మాట్లాడారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతడితో షారుక్​ రెండు నిమిషాలపాటు ఫోన్​లో మాట్లాడారని ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

14:37 October 04

టాప్​ న్యూస్​ @3PM

  • కోకాపేట భూముల వేలంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

కోకాపేట భూముల వేలంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ మరోసారి డిమాండ్‌ (Congress demands CBI probe into Kokapet land auction) చేసింది. హెచ్​ఎండీఏలో కీలక సమాచారం మాయమైందని రేవంత్‌ ట్వీట్‌ (revanth tweet) చేశారు. ఈ విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (clp leader batti vikramarka) అసెంబ్లీలో ప్రస్తావించారు.

  • 'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే'

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు(Supreme court news) ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారాన్ని(Covid death compensation) రాష్ట్ర ప్రభుత్వాలే అందించాలన్న కోర్టు.. ఏ రాష్ట్రం కూడా నిరాకరించరాదని స్పష్టం చేసింది. దరఖాస్తు అందిన 30 రోజుల్లోపు ఇవ్వాలని పేర్కొంది.

  • డబుల్​ ధమాకా

ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. అందులో ఓ యువతితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉండటం విశేషం. (Lohardaga news)

  • 40 రైతు సంఘాలకు సుప్రీం నోటీసులు

దిల్లీ సరిహద్దుల్లో రహదారులు దిగ్బంధంపై వివరణ ఇవ్వాలని రాకేశ్​ టికాయిత్​ సహా 40 రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

  • రెండు టవర్లు కూల్చివేయాల్సిందే

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో నిర్మించిన 40 అంతస్తుల ట్విన్​ టవర్స్​ను కూల్చివేయాల్సిందేనని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. టవర్స్ నిర్మాణ సంస్థ సూపర్​టెక్​.. తీర్పును సవరించాలని దాఖలు చేసిన పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.

14:02 October 04

టాప్​ న్యూస్​ @ 2 PM

టాప్​ న్యూస్​ @ 2 PM

  • ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్​ వేళ చీపురు పట్టి...

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. చీపురు పట్టి స్వయంగా తన గదిని ఊడ్చుతూ కనిపించారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ హింసాత్మక ఘటన నేపథ్యంలో.. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆదివారం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సీతాపుర్​లోని ఓ అతిథి గృహంలో ఉన్న ప్రియాంక.. ఇలా చీపురుతో గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

  • అమల్లో లేని చట్టాలపై నిరసనలేల?

సాగు చట్టాలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను ప్రశ్నించింది సుప్రీం కోర్టు. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై విచారణ చేపట్టింది.

  • బండి సంజయ్​కు పార్టీనేతల స్వాగతం

యాత్ర పూర్తి చేసుకుని తొలిసారిగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్​కు (Bandi Sanjay) పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన... హుజూరాబాద్​ ఉపఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

  • 'ఉమ్రన్​ను ముందే ఎందుకు తీసుకోలేదు?'

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2021(IPL 2021 News)లో అరంగేట్రం చేశాడు సన్​రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్(umran malik ipl 2021). గంటకు 150.06 కి.మీ వేగంతో బంతి సంధించి క్రికెట్‌ పండితుల మన్ననలు పొందాడు. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. సన్​రైజర్స్ ముందుగానే అతడిని ఎందుకు ఆడించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

  • నేనే మారాలి

నాగచైతన్యతో విడిపోయాక తాజాగా నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేసింది నటి సమంత(samantha instagram post). ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటాననే సారాంశంతో కూడిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్​గా మారింది.

14:00 October 04

టాప్​ న్యూస్​ @ 1 PM

  • సిర్పుర్కర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సజ్జనార్

'దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీ, సైబరాబాద్‌ అప్పటి సీపీ సజ్జనార్‌ ఇవాళ విచారణకు హాజరయ్యారు. సజ్జనార్‌ను అధికారులు ఎన్‌కౌంటర్‌ గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్ ఛైర్మన్ మహేశ్‌ భగవత్‌ను కమిషన్‌ ప్రశ్నించింది.  ఘటన జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను ఇవాళ విచారిస్తోంది. ఎన్​కౌంటర్​ గురించి ప్రశ్నిస్తోంది.

  • రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల కొరత

రాష్ట్ర రవాణా శాఖ(Telangana Transport Ministry)లో స్మార్ట్‌కార్డుల కొరత(shortage of smart cards) మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు 45 రోజులుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వేలాది మంది వాహనదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకుని, డ్రైవింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

  • 'నా కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం'

'ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరు.' అని లఖింపుర్​ ఖేరి హింసాత్మక సంఘటనను సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. లఖింపుర్​ లాంటి ఘటనలు జరగకుండా.. ఆందోళనలకు అనుతించటం లేదని కోర్టుకు తెలిపారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. 

  • లఖింపుర్​ హింసపై రిటైర్డ్​ జడ్జితో విచారణ

లఖింపుర్​ ఖేరి(Lakhimpur Kheri news) హింసాత్మక ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. ప్రాణాలు కోల్పోయిన(Lakhimpur Kheri violence) నలుగురు రైతులకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. హింసలో మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు.

  • హీరో రామ్​కు గాయం

హీరో రామ్​(ram injured) పోతినేనికి గాయమైంది. జిమ్​ చేస్తుండగా ఆయన మెడ పట్టేసింది. దీంతో తన 19వ సినిమా(ram linguswamy movie) షూటింగ్​ తాత్కాలికంగా నిలిచిపోయింది.

11:57 October 04

టాప్​ న్యూస్​ @ 12 PM

  • ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్​ వల్లే..

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సాగునీటిపైనే దృష్టిసారించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను 100 శాతం వినియోగించుకోవాలని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్​డ్యాంలు, చెరువుల్లో 365 రోజులు నీరు నిల్వ ఉండేలా తీసుకున్న చర్యల వల్ల గతేడాది కంటే భూగర్భజలాలు 3.06 శాతం పెరిగాయని వెల్లడించారు. 

  • న్యాయపోరాటంలో అన్నదాతలదే విజయం

లఖింపుర్​ పర్యటనకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ప్రియాంక ధైర్యాన్ని చూసి వాళ్లు భయపడ్డారు' అంటూ ట్వీట్ చేశారు.

  • ఐఓసీఎల్​లో ఉద్యోగావకాశాలు

ప్రముఖ ఇంధన సంస్థ ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్(apprenticeship in iocl )​.. పైప్​లైన్​ ప్రాజెక్టుల్లో అప్రెంటీస్‌షిప్(iocl apprenticeship 2021)​ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు అక్టోబర్​ 25 అని ప్రకటించింది. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా ఉన్నాయి.

  • ఇదే తొలిసారి: కోహ్లీ

2011 తర్వాత తమ జట్టు తొలిసారి ఐపీఎల్ లీగ్‌ దశలో పలు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌ చేరినట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (ipl 2021 virat kohli) సంతోషం వ్యక్తం చేశాడు. తమకింకా రెండు మ్యాచ్‌లు ఉండటం వల్ల పాయింట్ల పట్టికలో (rcb in playoffs or not) టాప్‌-2లో నిలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తపరిచాడు.

డ్రగ్స్​ కేసులో(ncb arrested aryan khan) షారుక్​ ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​ అరెస్ట్​ అయిన నేపథ్యంలో బాద్​షా ఇంటికి వెళ్లాడు సల్మాన్​ ఖాన్​. షారుక్​కు(shahrukh khan salman khan house) అండగా ఉండేందుకు ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది.
 
10:54 October 04

టాప్​ న్యూస్​ @ 11 AM

  • చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు

చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడించింది స్వతంత్ర దర్యాప్తు కమిషన్​. ఫ్రాన్స్​ క్యాథలిక్​ చర్చిలో గడిచిన 70 ఏళ్లలో 3వేల మంది నేరాలకు పాల్పడినట్లు తేల్చింది. పూర్తి నివేదికను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

  • 'దహీ కచోరి'తో రాత్రికి ఫేమస్

రోడ్డు పక్కన బైక్​పై టిఫిన్స్​ విక్రయిస్తున్న వారు చాలా మందే కనిపిస్తారు. అలా.. ద్విచక్రవాహనంపై 'దహీ కచోరీ'లు(Dahi Kachori news) విక్రయిస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే పాపులర్​గా మారిపోయాడు. ఎలాగంటారా.. అదంతా సోషల్​ మీడియా పుణ్యమే మరి.

  • వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులకు ముప్పు

ఎన్ని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్ల వలకు చిక్కి వన్యప్రాణులు ఊపిరి వదులుతున్నాయి. అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో.. పెద్దపులులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆవులు, మనుషులపై దాడి చేస్తున్నాయని వాటిని పట్టుకునేందు బిగించిన ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు కొందరు వ్యక్తులు మాత్రం.. మాటు వేసి.. పక్కా ప్లాన్​తో.. పులులకు వలవేసి వాటి ఆయువు తీస్తున్నారు. వాటి చర్మం, గోళ్లను అమ్ముకుని తమ కక్కుర్తి చూపిస్తున్నారు.

  • భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 640 పాయింట్లకుపైగా పెరిగి 59,417 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా లాభంతో 17,707 వద్ద కొనసాగుతోంది.

  • ఎలాగో పోటీలో లేము.. అందుకే అలా

ఆదివారం(అక్టోబర్​ 3) జరిగిన మ్యాచ్​లో(srh vs kkr 2021) సన్​రైజర్స్ హైదరాబాద్​​పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది కోల్​కతా నైట్​రైడర్స్. ఈ నేపథ్యంలో మ్యాచ్​ విజయం పై కోల్​కతా సారథి మోర్గాన్​ మాట్లడగా.. ఓటమిపై కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. ఇంతకీ వీరిద్దరు ఏం అన్నారంటే?

09:51 October 04

టాప్​ న్యూస్​ @ 10 AM

  • దిగొస్తున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా 20,799 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 180 మంది మృతి చెందారు.

  • ప్రాణాలు నిలపడమే కాదు.. పచ్చదనానికీ తోడ్పడతాయి

డ్రోన్ల వినియోగం(Drones usage In Telangana)లో తెలంగాణ రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. డ్రోన్ల ద్వారా సమయానికి ఔషధాలు పంపి ప్రాణాలు నిలపడమే కాదు.. వాటి సాయంతో విత్తనాలు చల్లుతూ మొక్కల పెంపకానికి నాంది పలుకుతోంది. హరితహారంలో వంద కోట్ల మొక్కల పెంపకం లక్ష్య సాధనకు విత్తనాలు జల్లే డ్రోన్ల(సీడ్​కాప్టర్ల)ను రంగంలోకి దించింది.

  • 'మెగా ఫ్యామిలీ నిలబడి ఉంటే.. విష్ణుకి నో చెప్పేవాడిని'

ప్రకాశ్‌రాజ్‌తో(Maa elections prakash raj panel) తనకేమీ గొడవలు లేవని చెప్పారు సీనియర్​ నటుడు మోహన్​బాబు. చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా 'మా' ఎన్నికల్లో నిలబడి ఉండుంటే మంచు విష్ణును ఎలక్షన్స్(maa elections manchu vishnu panel)​ నుంచి తప్పుకోమని చెప్పేవాడినని అన్నారు. చిరు ఇప్పటికీ తన స్నేహితుడేనని వెల్లడించారు.

  • బైక్‌ కొనుగోలుదారులకు రెండు హెల్మెట్స్​ ఫ్రీగా ఇవ్వాల్సిందే!

ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని (Helmets) ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అనే విషయం ఎంత మందికి తెలుసు. శిరాస్త్రణం (Helmets) ఉచితంగా పొందే హక్కు వాహనాన్ని కొనగోలు చేసేవారికి ఉంది. ఈ విషయం తెలియక చాలా మంది... శిరాస్త్రణం (Helmets) లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మృత్యుబారిన పడుతున్నారు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) వెండి (Silver price today) ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరల్లోనూ (Fuel price today) ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత రేట్లు ఇలా ఉన్నాయి.

08:58 October 04

టాప్​ న్యూస్​ @ 9 AM

  • ఫిబ్రవరిలోనే ఎఫ్​డీలు కాజేసేందుకు యత్నం!

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌(Telugu academy FD scam 2021)పై భాగ్యనగర సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫిబ్రవరిలోనే వాటిని సొంతం చేసుకునేందుకు ఒకరిద్దరు అధికారులు ప్రయత్నించినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా విచారిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం అకాడమీ అధికారులను సీసీఎస్‌కు పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. అకాడమీ(Telugu academy FD scam 2021) మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

  • హుజూరాబాద్‌ కార్యాచరణపై కాంగ్రెస్‌ కసరత్తు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election) కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి అధికార తెరాస వ్యూహరచన చేయడంతోపాటు అభ్యర్థిని కూడా ప్రకటించింది. తెరాసను వీడి భాజపా అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఈటల రాజేందర్‌ ఇప్పటికే నియోజక వర్గం అంతా చుట్టేశారు. ఈ క్రమంలో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ కార్యచరణను సిద్ధం చేస్తోంది.

  • కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

ఓ గ్రామంలో కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆస్పత్రిపాలయ్యారు. గ్రామపంచాయతీ నిర్లక్ష్యం వల్లే కలుషిత నీరు ఇంటింటికి సరఫరా అయిందని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

  • స్డేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి

యూఏఈ(t20 world cup 2021 venue) వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​ను అభిమానులు ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించింది ఐసీసీ. స్టేడియం సామర్థ్యంలో 70శాతం మంది ప్రేక్షకులకు అనుమతించనున్నట్లు తెలిపింది.

  • రష్మి కన్నీటి పర్యంతం.. ఏమైందంటే?

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రష్మి (Rashmi Gautam news).. ట్విట్టర్​లో ఓ నెటిజన్ పంచుకున్న వీడియోపై విచారం వ్యక్తం చేశారు. ఓ వీధి కుక్కను చనిపోయే వరకు కొట్టిన వీడియోపై భావోద్వేగంతో స్పందించారు.

07:57 October 04

టాప్​ న్యూస్​ @ 8AM

  • లఖింపుర్ ఖేరి హింస

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్.. సోమవారం తెల్లవారుజామున ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా అన్నదాతలను కలిసి వారితో మాట్లాడతామని టికాయిత్ చెప్పారు. గ్రామస్థులు, రైతులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.

  • హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభపై ఉత్కంఠ

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad by election 2021) రోజురోజుకు రసవత్తరంగా తయారవుతోంది. ఇప్పటికే తెరాస-భాజపాలు ప్రచార జోరును సాగిస్తుంటే.. కాంగ్రెస్​ ఇటీవలే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా సభ నిర్వహించాలని తెరాస భావిస్తోంది. అయితే బహిరంగ సభలకు వెయ్యి మందినే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. దీంతో సీఎం ​సభలపై ఉత్కంఠ నెలకొంది.

  • డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ లింకులపై ఎన్​సీబీ ఆరా!

సముద్ర జలాలపై విహరిస్తూ(cruise ship rave party ) విచ్చలవిడిగా సాగిస్తున్న అకృత్యాలకు పకడ్బందీ వ్యూహంతో కళ్లెం వేశారు మహారాష్ట్ర పోలీసులు. ప్రయాణికుల్లా వెళ్లి విహారనౌకలో రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. మాదకద్రవ్యాల స్వాధీనం(Drugs case) చేసుకుని బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుక్​ఖాన్​ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ సహా మరో ఏడుగురిని అరెస్టు(Aryan Khan arrest news) చేశారు. డ్రగ్స్​ వ్యవహారంతో బాలీవుడ్‌ లింకులు బయటకు తీస్తామని స్పష్టం చేసింది ఎన్‌సీబీ.

  • 'పాండోరా పేపర్స్'​ లీక్..

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు అయింది. (Pandora Papers ICIJ) ఈ జాబితాలో 380 మంది భారతీయులు ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ICIJ Leaks) వెల్లడించింది. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్ద ఎత్తున తరలించిన రహస్య సంపద వివరాలు వీటిలో ఉన్నట్లు తేలింది.

  • భారత్​కు ఒక్క రోజే నాలుగు స్వర్ణాలు

ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో(junior shooting world championship 2021) భారత్‌ అద్భత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఒక్క రోజే నాలుగు స్వర్ణాలను(issf junior shooting world cup 2021) ఖాతాలో వేసుకుంది. ఎవరెవరు మెడల్స్​ సాధించారంటే?

07:00 October 04

టాప్​ న్యూస్​ @ 7AM

  • ప్రాణాలు నిలపడమే కాదు..

  • పంట దక్కక.. అప్పు తీర్చలేక..

వారు నేలతల్లిని నమ్ముకున్న భూమిపుత్రులు. చెమటోడ్చి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు. పంటలు సాగు చేసేందుకు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. మంచి దిగుబడి వస్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడీ చేతికందే అవకాశం కనిపించలేదు. అప్పుల్ని ఎలా తీర్చాలో మార్గం తోచక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. ఇలా వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

  • రాహుల్‌ పునరాగమనానికి బాటలు పడినట్లేనా..?

కాంగ్రెస్‌లో 70 మందికిపైగా సీనియర్‌ నేతలను తోసిరాజని రాహుల్‌ విధేయులను పైకి తీసుకురావడానికి సోనియా కంకణం కట్టుకున్నారు. ఈ పని ఆమె ఏడాది క్రితమే మొదలుపెట్టారు. నిరుడు ఆగస్టులో 23 మంది అసమ్మతీయుల బృందం కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని లేఖ రాయడాన్ని తన నాయకత్వానికి సవాలుగా ఆమె పరిగణించారు.

  • గాడ్‌ఫాదర్‌ కొత్త షెడ్యూల్​..

చిరంజీవి(chiranjeevi lucifer) హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్​ఫాదర్'(chiranjeevi godfather movie) ​ సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఇటీవలే ఊటీలో చిత్రీకరించారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్​ సోమవారం(అక్టోబర్​ 4) నుంచి హైదరాబాద్​లో ప్రారంభంకానుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొననుంది.

  • అమెజాన్‌ విక్రయాల జోరు.. 

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌-2021(Amazon Great Indian Festival) అమ్మకాలు ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రారంభమయ్యాయని అమెజాన్‌(Amazon Sale) ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ తెలిపారు. విక్రయదారుల సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 60 శాతం పెరిగిందన్నారు.

05:47 October 04

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • ఉభయసభల సమావేశాలు

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి పనులపై శాసనసభ(Assembly)లో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో హరితహారం(Haritaharam)పై చర్చ చేపడతారు. టౌటింగ్ బిల్లుతో పాటు జీఎస్టీ చట్టసవరణబిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తారు. 

  • పదునెక్కిన ప్రచారం

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార (Huzurabad By Election Campaign) జోరు పెంచాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తెరాస(Trs), విపక్ష భాజపా (Bjp) నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్న నాయకులు వ్యక్తిగత విమర్శలతో హోరెత్తిస్తున్నారు. 

  • ఐటీ రంగంలో పురోగతి

ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పురోగతి (It Progress) సాధించినట్టు... ఐటీ ఎగుమతులు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. విజయవంతమైన ఈ ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

  • సినిమా చూసిన రేవంత్

సాయిధరమ్​తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రాన్ని (Republic Cinema) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy), ఎమ్మెల్యే సీతక్క (Mla Seethakka) వీక్షించారు. ప్రజాస్వామ్య విలువలను అందించే విధంగా రిపబ్లిక్ చిత్రాన్ని దర్శకుడు (Republic Director Devakatta) నిర్మించారని వారు అన్నారు.

  • సెల్ఫీ సరదా

సెల్ఫీ సరదా (Selfi Tragedy) ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. మంజీరా (Manjeera River) అందాలను చరవాణిలో బంధించాలనుకున్న వ్యక్తిని కాపాడబోయి మరో యువకుడు ప్రాణాలు వదిలాడు. విహారం కోసం వచ్చిన అన్నదమ్ములు కథ విషాదాంతమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

  • రైతులను అణచివేస్తారా?

కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi News) లఖింపుర్​కు(lakhimpur kheri news) చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రియాంకతో పాటు లఖింపుర్​కు వచ్చారు. అంతకుముందు.. తమను వెళ్లకుండా తనను లఖ్​నవూ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిచారని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi News) తెలిపారు. 

  • నిరసనలో హింస

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

  • రికార్డు స్థాయి మరణాలు

రష్యాలో కరోనా మహమ్మారి(Russia Covid Cases) మరోసారి కోరలు చాస్తోంది. మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 890 మరణాలు సంభవించాయి.

  • సాయి తేజ్​పై పవన్​ కామెంట్స్

యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్​ చిత్రం మంచి టాక్​తో దూసుకుపోతోంది. ఈ చిత్రంపై స్పందించారు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్. సాయి తేజ్ నటనను ప్రశంసించారు.

  • కోల్​కతా విజయం

సన్​రైజర్స్ హైదరాబాద్​​పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది కోల్​కతా నైట్​రైడర్స్. శుభ్​మన్ అర్ధసెంచరీతో రాణించాడు.

Last Updated : Oct 4, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.