ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

etv bharat
ముఖ్యాంశాలు
author img

By

Published : Sep 30, 2021, 5:55 AM IST

Updated : Sep 30, 2021, 10:35 PM IST

21:45 September 30

టాప్​న్యూస్​ @10PM

  • ' మిత్తితో సహా చెల్లిస్తాం'

తెలంగాణ క్రియాశీల రాజకీయాల్లో 20 ఏళ్లు ఉంటానన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(revanth reddy speech latest).. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. భూపాలపల్లి బహిరంగ సభ(congress meeting)లో పాల్గొన్న రేవంత్​రెడ్డి.. గండ్ర సత్యనారాయణరావుకు కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. కార్యకర్తలంతా అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

  •  ఏపీని కచ్చితంగా శిక్షించాల్సిందే

నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులును ఏపీ చేపట్టిందని ఎన్టీటీ ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. నిబంధనలను ఉల్లంఘించిన ఏపీని కచ్చితంగా శిక్షించాల్సిందేనని కోరింది.

  • మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకేశాడు

హైదరాబాద్​లో దిల్​సుఖ్​నగర్ మెట్రోస్టేషన్​ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాధితునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

  • అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్​ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. అక్టోబర్ 8 నుంచి పర్యటకులను అనుమతించనున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు.

  • చెన్నై లక్ష్యం 135

చెన్నై సూపర్ కింగ్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు సాధించింది. సాహా (44) ఒక్కడే ఆకట్టుకున్నాడు.

20:45 September 30

టాప్​న్యూస్​ @9PM

  • ఆ పనులు ఆపండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krmb)ను తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్(krmb chairman)​కు తెలంగాణ నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు.

  • నేనేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా..!

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా గొంతుకకు ప్రణామం పేరుతో కాంగ్రెస్​ పార్టీ.. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా వేదికగా.. గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో నాయకులు హస్తం పార్టీలో చేరారు.

  • 'సీడబ్ల్యూసీకి గ్రీన్​సిగ్నల్'

సీడబ్ల్యూసీ సమావేశం (Congress CWC Meeting)త్వరలోనే జరగనుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా వెల్లడించారు. శిమ్లాకు బయల్దేరే ముందు సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీ భేటీపై సంకేతాలు (Sonia Gandhi CWC Meeting) ఇచ్చారని చెప్పారు.

  •  'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

  •  మీపై ఆధారపడి ఉన్నాం.. 

తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టాల్లో ఉందని, సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు విజ్ఞప్తి చేశారు. 

19:50 September 30

టాప్​న్యూస్​ @8PM

 తెలంగాణ మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krmb)ను తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్(krmb chairman)​కు తెలంగాణ నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు

 'కేసీఆర్ మోసం చేశారు'

 మంత్రులపై  నాన్​ బెయిలబుల్ వారెంట్​

హెరిటేజ్ పరువు నష్టం(Heritage defamation case) కేసులో ఏపీ మంత్రి కన్నబాబు(Minister kannababu), వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు(mla ambati rambabau)పై నాన్ బెయిలబుల్ వారెంట్(NBW)  అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాదులోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది

 'మీపై ఆధారపడి ఉన్నాం'

సన్​రైజర్స్ బ్యాటింగ్

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు (సెప్టెంబర్ 30) చెన్నై సూపర్ కింగ్స్​తో తలపడనుంది సన్​రైజర్స్ హైదరాబాద్(SRH vs CSK 2021). ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.

18:48 September 30

టాప్​న్యూస్​ @7PM

  • ఆ పనులు ఆపాలి

గాలేరు నగరి, సుజల స్రవంతి విస్తరణ పనులు ఆపాలని కృష్ణాబోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ఈఎన్సీ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. 

  • ముగిసిన భవానీపుర్ పోలింగ్​

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోరు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్​ అంతా ప్రశాంతంగానే జరిగినట్లు చెప్పారు.  

  • అక్టోబర్​లో భారీ మార్పులు ఇవే...!

ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆటో డెబిట్​, నిరుపయోగంగా మారనున్న పలు బ్యాంక్​ల చెక్​బుక్​లు, పోస్టాఫీస్ ఛార్జీలు సహా పలు ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి. వాటన్నింటి పూర్తి వివరాలు మీ కోసం.

  • డేనైట్​ టెస్టులో భారత్​ పైచేయి

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న చారిత్రక డేనైట్ టెస్టులో గొప్ప ఆటతీరు ప్రదర్శిస్తోంది భారత మహిళల జట్టు. తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడం వల్ల 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

  • అఖిల్​ సినిమా ట్రైలర్​.. !

మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌​', 'అరన్​​ మనాయ్​ 3' ట్రైలర్స్((Most eligible bachelor trailer)​ సహా 'మహా సముద్రం', 'కొండపొలం' చిత్రంలోని సాంగ్స్​ విడుదలయ్యాయి.

17:52 September 30

టాప్​న్యూస్​ @6PM

  •  మరో రూ.131 కోట్ల జప్తు

రుణ యాప్‌ల కేసులో మరో రూ.131 కోట్లను డఈడీ జప్తు  చేసింది. రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. 

  •  12 భాషల్లో హర్షణీయం

హైదరాబాద్‌లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ హెల్ప్‌ (Ushalakshmi Breast Cancer Foundation Help) ప్రారంభమైంది. యూబీఎఫ్ హెల్ప్‌ను (ubf help) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు (Venkaiah Naidu launched UBF Help). కార్యక్రమంలో యూబీఎఫ్‌ ఛైర్మన్ డా.రఘురామ్, డా.ఉషాలక్ష్మీ పాల్గొన్నారు.

  • 'వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ'

కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ (Muslim girl Painting) ఇప్పటివరకు 500కు పైగా శ్రీకృష్ణుడి బొమ్మలను గీశారు. వీటిని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం వల్ల.. చాలావరకు గుళ్లకు, తెలిసినవారికి దానం చేశారు. ఈ పెయింటింగ్​లకు పూజచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయన్న వార్తతో.. ఆమె చిత్రా​లకు డిమాండ్ పెరిగిపోయింది.

  • ప్రముఖ నటి ఆత్మహత్య

ప్రముఖ నటి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి గల కారణాన్ని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  •  ఇదే జరిగితే!

రవిశాస్త్రి(ravi shastri news) తర్వాత టీమ్ఇండియాకు కోచ్​గా ఎవరు ఎంపికవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ స్థానంలో ధోనీ, ద్రవిడ్(rahul dravid news) తమ సేవలందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై స్పందించాడు భారత జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్.

16:50 September 30

టాప్​న్యూస్​ @5PM

  • రెయిన్​ అలర్ట్ 

ఇప్పుడిప్పుడే గులాబ్​ నుంచి కోలుకుంటోన్న రాష్ట్రాన్ని.. మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • భాజపా భారీ సభ

అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు భాజపా వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ రోడ్ షో నిర్వహించనున్నారు.

  •  నాలుకపై కత్తెరతో పొడిచి...!

ఇద్దరు మైనర్ల మధ్య తలెత్తిన వివాదం.. హింసాత్మకంగా మారింది. ఓ బాలుడి కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి, మరో బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

  • అదరగొడుతున్న ఐపీఎల్..

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021 News) ప్రేక్షకాదరణలో అదరగొడుతోంది. గతేడాది కంటే ఈ సీజన్​ వ్యూయర్​షిప్(ipl 2021 tv viewership) భారీగా పెరిగిందంటూ వెల్లడించారు బీసీసీఐ సెక్రటరీ జై షా(jay shah in ipl 2021).

  • 'దసరాకే 'అఖండ'.. 

'అఖండ'(akhanda movie villain) సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు హీరో శ్రీకాంత్​. ఈ చిత్రంలో తాను అతిక్రూరమైన ప్రతినాయకుడి పాత్ర పోషించినట్లు వెల్లడించారు. దీంతోపాటు తన తనయుడు రోషన్​ నటించిన 'పెళ్లిసందD' సినిమా విశేషాలను చెప్పారు. కాగా.. రామ్ చరణ్, శంకర్ కలయికలో రాబోతున్న చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

15:40 September 30

టాప్​న్యూస్​ @4PM

  •  వైమానిక దళాధిపతిగా వీఆర్ చౌదరి

భారత వాయుసేన దళాధిపతిగా (New IAF chief of India) ఎయిర్​చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. గురువారం పదవీ విరమణ చేసిన ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా (RKS Bhadauria) స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. (IAF Chief)

  • కేఆర్​ఎంబీ సమావేశం

హైదరాబాద్​లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna river management board- KRMB) ఉపసంఘం(KRMB subcommittee meeting) సమావేశమైంది. బోర్డు సభ్యుడు ఆర్​.కె.పిళ్లై నేతృత్వంలో ఉపసంఘం చర్చలు జరుపుతోంది.

  •  షర్మిలకు  ఊరట

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో వైఎస్​ షర్మిల, విజయమ్మకు ఊరట లభించింది. ఈ కేసును హైదరాబాద్​లోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది.

  • మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు శిక్ష!

ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న ఓ కేసులో.. ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడు సర్కోజీని దోషిగా తేల్చింది కోర్టు.

  • మూడో రోజూ నష్టాలే

స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా మూడో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 287 పాయింట్లు తగ్గి 59,150 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 93 పాయింట్ల నష్టంతో 17,650 మార్క్​ కోల్పోయింది.

14:38 September 30

టాప్​న్యూస్​ @3PM

  • ఫోన్​ చూడొద్దన్నారని..!

ఫోన్​ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్​లోని న్యూహఫీజ్‌పేట్ హనీఫ్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది.  ఈ నెల 28న జరిగిన ఘటనపై  బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

  • ఆ కేసులో అసలేం జరిగిందంటే?

తెలిసిన వాడేనని నమ్మి వెంటవెళ్లింది. తన స్నేహితులేనని చెబితే వారితో మాట్లాడింది. కలిసి భోజనం చేద్దామంటే సరేనంది. భోజనంతో పాటు మద్యంకూడా సేవించింది. అందరూ మనవాళ్లేనని నమ్మి వెళ్తే.. మృగాళ్లలా ఆమెపై అఘాయిత్యాని(Nizamabad Girl Gang Rape case)కి పాల్పడతారని ఊహించలేకపోయింది. 

  •  
  • 'నాపై తప్పుడు ప్రచారం'

హుజూరాబాద్​ ఉపఎన్నికలో భాగంగా భాజపా నేత ఈటల రాజేందర్​ (Etela Rajender) ప్రచార జోరును పెంచారు. కరీంనగర్​ జిల్లా సిర్శపల్లిలో ప్రచారం నిర్వహించిన ఈటల... తనదైన శైలిలో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... నమ్మొద్దని సూచించారు.

  •  భాజపాలో మాత్రం చేరను

పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీకి భారీ షాక్​ తగిలింది. ఊహించినట్లుగానే పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​. అయితే భాజపాలో చేరట్లేదని, కాంగ్రెస్​ను మాత్రం కచ్చితంగా వీడతానని స్పష్టం చేశారు. 

  •  కాంస్య పతక విజేత రిటైర్మెంట్​

అంతర్జాతీయ హాకీకి తాను వీడ్కోలు పలుకుతున్నట్లు భారత హాకీ క్రీడాకారుడు రూపీందర్​ పాల్​ సింగ్​(Rupinder Pal Singh Retirement) గురువారం ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) కాంస్య పతకం గెలిచిన జ్ఞాపకాలతో తాను రిటైర్మెంట్​ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

13:44 September 30

టాప్​న్యూస్​ @2PM

  • తెలంగాణలో తైవాన్​ పెట్టుబడులు

తెలంగాణ- తైవాన్(telangana- taiwan) మధ్య అద్భుతమైన భాగస్వామ్యం(Ktr on Taiwan investments) ఉందని మంత్రి కేటీఆర్(minister ktr) వెల్లడించారు. తైవాన్​ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం తైవాన్​లో పర్యటించినట్లు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రంలో తైవాన్​ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. తైవాన్- కనెక్ట్ తెలంగాణ స్టేట్(taiwan connect telangana state) సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

  • 'పాలిచ్చేందుకు కన్న తల్లికి పూర్తి హక్కు'

బిడ్డకు పాలిచ్చేందుకు(Breast feeding) కన్న తల్లికి పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు(karnataka high court ). వారికి ఆర్టికల్​ 21 ప్రకారం పూర్తి రక్షణ ఉంటుదని తెలిపింది. ఓ చిన్నారి పెంపకం విషయంలో పెంపుడు తల్లి, కన్న తల్లి మధ్య వివాదంపై ఈ వ్యాఖ్యలు చేసింది.

  • డోభాల్​తో అమరీందర్​ భేటీ

పంజాబ్​ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్​ సింగ్(Amarinder singh news)​.. జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్​తో భేటీ అయ్యారు. మరోవైపు కెప్టెన్​.. భాజపాలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్​ అధిష్ఠానం బుజ్జగింపు చర్యలకు దిగింది.

  • భారత జట్టులో మార్పులా?

టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) కంటే ముందు టీమ్ఇండియాలో కొన్ని మార్పులు(Changes in Team India) జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​ స్పందించారు. ఐపీఎల్​లో(IPL 2021) పేలవ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ఉంచుతారా తీసేస్తారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

  • ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది!

'ధోని: ఏ అన్​టోల్డ్ స్టోరీ'.. మహీ అభిమానులకే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు తన గుండెల్లో దాచుకున్న చిత్రం. ఈ సినిమాలో టైటిల్ రోల్​ పోషించిన సుశాంత్ సింగ్ రాజ్​పుత్(sushant singh rajput movies).. తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశాడు. ఈ చిత్రం విడుదలై గురువారానికి(సెప్టెంబరు 30) ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు మీకోసం.

12:44 September 30

టాప్​న్యూస్​ @1PM

  • పంజాబ్​ సీఎంతో సిద్ధూ కీలక భేటీ

కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news).. నేడు పంజాబ్ (Punjab news Live​) ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీని కలవనున్నారు. సీఎం తనను చర్చలకు ఆహ్వానించినట్లు ట్వీట్​ చేసిన సిద్ధూ(Sidhu news).. మధ్యాహ్నం 3 గంటలకు పంజాబ్​ భవన్​కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి చర్చలకైనా సిద్దమేనని తెలిపారు.  

  • పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి

సినీనటుడు పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు(attack on posani house). ఘటనలో పోసాని ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

  • అఖిలపక్ష నేతల భేటీ..

గాంధీభవన్​లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో తెజస, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అక్టోబరు 2 నుంచి జరగనున్న కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్, విద్యార్థి పోరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన రోజు వరకు 67 రోజులపాటు జనంలోకి వెళ్లేందుకు రూపొందించిన కార్యాచరణపై మాట్లాడుతున్నారు. 

  • ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు

జైపుర్​లో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్​ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్​ను(cipet jaipur college) ప్రారంభించారు ప్రధాని మోదీ(pm modi news). అలాగే.. రాజస్థాన్​లోని నాలుగు జిల్లాల్లో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. దేశ ఆరోగ్య రంగంలో మార్పు కోసం నూతన జాతీయ ఆరోగ్య విధానంపై కృషి చేస్తున్నట్లు చెప్పారు. దాని ద్వారా ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

  • ఆర్సీబీ దశ తిరిగేనా?

ఐపీఎల్​లో(IPL 2021) సాధారణ బౌలర్​గా ఎంట్రీ ఇచ్చి.. కేవలం 11 మ్యాచ్​ల్లోనే స్టార్​ బౌలర్​గా ఎదిగాడు హర్షల్​ పటేల్​(Harshal Patel News). ఆర్సీబీకి ఆడుతున్న ఇతడు.. ప్రస్తుత సీజన్​లో అద్భుతమైన బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు టోర్నీలోని పర్పుల్​ క్యాప్​ రేసులో ముందున్న హర్షల్​.. సరికొత్త రికార్డుకు కొద్ది దూరంలో ఉన్నాడు.

11:59 September 30

టాప్​న్యూస్​ @12NOON

  • గెజిట్​ అమలుపై చర్చ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (Godavari River Ownership Board Subcommittee Meeting) సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ (grmb subcommittee meeting) అయింది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో సమావేశమయ్యారు. సమావేశంలో బోర్డు సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చిస్తున్నారు. 

  • ప్రశాంతంగా భవానీపుర్​లో పోలింగ్​

ఒడిశాలోని పిపిలి నియోజకవర్గంలోనూ ఉపఎన్నిక జరుగుతోంది. రెండున్నర లక్షల మంది ఓటర్లు పది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. అధికార బీజేడీ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి, భాజపా నాయకుడు ఆశ్రిత్‌ పట్నాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బిశ్వోకేషన్‌ హరిచందన్ మధ్య ప్రధాన పోటీ ఉంది. పిపిలిలో బీజేడీ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి తన ఓట హక్కును వినియోంగించుకున్నారు.  

  • కెమికల్స్​ ఇన్​స్టిట్యూట్​కు శ్రీకారం

జైపుర్​లో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్​ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్​ను(cipet jaipur college) ప్రారంభించారు ప్రధాని మోదీ(pm modi news). అలాగే.. రాజస్థాన్​లోని నాలుగు జిల్లాల్లో నిర్మిస్తోన్న కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు.

  • వాగులో పడ్డ యువకుడు

గులాబ్ తుపాను(cyclone gulab effect) ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు ఏకధాటిగా వానలు(Telangana rains 2021) కురిశాయి. భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు వరద నీటితో రోడ్డుపై పేరుకుపోయిన నాచు వల్ల జారి వాగులో పడ్డాడు. గమనించిన స్థానికులు అతణ్ని రక్షించారు.

  • పెరగనున్న ఛార్జీల భారం

దక్షిణ మధ్య రైల్వే తాజాగా తీసుకొచ్చిన కొన్ని మార్పులతో టికెట్ ఛార్జీలు(Train ticket price hike) పెరగనున్నాయి. ఆరు ఎక్స్​ప్రెస్ రైళ్లును సూపర్ ఫాస్ట్​గా.. 22 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్​ప్రెస్​లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

10:51 September 30

టాప్​న్యూస్​ @11AM

  • దక్షిణ కొరియాతో కిమ్​ స్నేహగీతం

ఉభయ కొరియాల మధ్య వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాతో మెరుగైన సంబంధాల కోసం సుముఖత వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ (north korea president). శాంతి స్థాపనలో భాగంగా మూసివున్న సరిహద్దులను తెరవనున్నట్లు చెప్పారు. అమెరికాపై విమర్శలు(north korea criticizes us) గుప్పించారు. మరోవైపు కిమ్​ సోదరికి కీలక బాధ్యత అప్పగించారు.

  • దహన సంస్కారాలు నిర్వహించిన తనయ

కుమారుడు తల కొరివి పెడితే పున్నామ స్వర్గానికి చేరుతారనేది ప్రధాన నానుడి. మరి మగబిడ్డల్లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారసుడుల్లేని తండ్రికి.. కూతురే కుమారుడిలా మారి తండ్రికి అంత్యక్రియలు (Last Rites Rituals) నిర్వహించింది. ఈ ఘటన ఆళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.\

  • కుక్కల దాడి.. 17 మందికి తీవ్రగాయాలు

ఇంటి ఎదుట ఆనందంగా చిన్నారులు ఆడుకుంటున్నారు. బయట కూర్చొని పెద్దలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ... ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా 17 మందిని (Dog Bite humans) కరిచాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

  • జూనియర్‌ ఆర్టిస్ట్‌ బలవన్మరణం

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసిబతకాలని అనుకున్నారు. ఫిలింనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... కట్​ చేస్తే.. అతనికి మరో యువతితో నిశ్చితార్థం. ఇంకేముంది... బాధిత యువతి.. ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణం (SUICIDE) చెందింది.

  • బాండ్ కొత్త సినిమా

జేమ్స బాండ్ సిరీస్​లో 25వ సినిమా 'నో టైమ్ టూ డై'(no time to die review).. భారత్​లోని థియేటర్లలో గురువారం(సెప్టెంబరు 30) విడుదలైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర ప్రత్యేకతలు, విశేషాలు మీకోసం.

09:58 September 30

టాప్​న్యూస్​ @10AM

  • వైద్యుల నిర్లక్ష్యం వల్లే...

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె(Baby girl death) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన మేడ్చల్ జిల్లా కాప్రాలో చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం, బాధితుల మధ్య రాజీకి ప్రయత్నించిన పోలీసులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా.. తమ బిడ్డ ప్రాణాలు తీసుకువస్తారా అని పోలీసులను నిలదీశారు.

  • 23వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య(Coronavirus update) మళ్లీ పెరిగింది. తాజాగా 23,529 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) పాజిటివ్​గా తేలింది. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 28,718 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు.

  • నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం కూడా (Stocks today) ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 60 పాయింట్లకుపైగా కోల్పోయి 59,351 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 10 పాయింట్ల నష్టంతో 17,703 వద్ద కొనసాగుతోంది.

  • తెలుగు క్రికెటర్​పై ప్రశంసలు

యువ బ్యాట్స్​మన్​ శ్రీకర్​ భరత్​పై(Srikar Bharat RCB) ప్రశంసలు కురిపించాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​(Glenn Maxwell News). రాజస్థాన్​ రాయల్స్​తో(RCB Vs RR) జరిగిన మ్యాచ్​లో భరత్​ అద్భుతంగా రాణించాడని అన్నాడు. భరత్​ ఒక టాప్​ క్లాస్​ బ్యాట్స్​మన్​ అని మ్యాక్సీ కితాబిచ్చాడు.

  • విజయ్ సినిమాలో నాని!

పాత్ర ఏదైనా తనదైన శైలిలో మెప్పించగల నటుడు నేచురల్​ స్టార్​ నాని. ఆయన త్వరలో మరోసారి ప్రతినాయక పాత్రలో నటించనున్నారట. వంశీ పైడిపల్లి, తళపతి విజయ్ కాంబినేషన్​లో(Thalapathy 66 Update) వస్తున్న చిత్రంలో నాని(Nani New Movie) విలన్​గా కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.

08:39 September 30

టాప్​న్యూస్​ @ 9AM

  • అడుగడుగునా వివక్షే!

తెల్లవారి జాత్యహంకారం.. వివక్ష అనగానే గాంధీజీని దక్షిణాఫ్రికా రైల్లోంచి తోసేసిన ఘటన గుర్తుకొస్తుంది. దానికి చాలాకాలం ముందే భారత్‌లో అంతకంటే ఘోరమైన సంఘటన నమోదైంది. అదీ సామాన్యులతో కాదు. కలెక్టర్‌ హోదాలోని భారతీయుడితో! చివరకు వివక్షను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారా ఐసీఎస్‌ అధికారి!

  • కుప్పకూలిపోతుంటే చూస్తూ ఉండకండి

కళ్ల ముందు గుండె వైఫల్యంతో ఎవరైనా కుప్పకూలిపోతుంటే.. చూస్తూ ఉండకుండా సీపీఆర్ చేయాలని ఏషియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి(Dr. Nageswara Reddy) చెప్పారు. ఈ ప్రక్రియతో గుండె ఆగిన వారిని బతికించే అవకాశం ఎక్కువ అని తెలిపారు.

  • వాహనదారులకు పెట్రో వాత

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. గురువారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 24 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.66కు చేరగా.. డీజిల్​ ధర రూ.89.88కు పెరిగింది.

  • మీలో ఈ ఏడు లక్షణాలు గుర్తించారా?

కరోనా వైరస్​ బారిన పడినట్లు గుర్తించేందుకు పరీక్ష కేంద్రాల్లో రాపిడ్​, ఆర్​టీపీసీఆర్​ టెస్టులు చేసుకోవాలి. అయితే.. పరీక్ష వసతులు అంతగా లేనిచోట, టెస్టింగ్​ కిట్లను సమర్థంగా వినియోగించేందుకు, బాధితులను గుర్తించేందుకు పరిశోధకులు 7 లక్షణాలను సూచించారు. ఆ లక్షణాలేమిటి?

  • ​ఛాంపియన్​షిప్​లో మెరిసిన భారత్​

ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో(World Chess Championship 2021) భారత జట్టు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భక్తి కులకర్ణి(Bhakti Kulkarni Chess), మేరీ ఆన్‌ గోమ్స్‌ విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశారు.

07:42 September 30

టాప్​న్యూస్​ @ 8AM

  • మొదటి ప్రమాద హెచ్చరిక 

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక (First Warning At Godavari) జారీ చేశారు. గోదావరిలో కి 9,07,616 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 

  • బీఎస్‌ఎఫ్‌ పాత్ర ఎనలేనిది

దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడటంలో బీఎస్‌ఎఫ్‌ పాత్ర ఎనలేనిదన్నారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news). పాకిస్థాన్‌తో పోరాడి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందన్నారు. అయితే దేశ సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు భద్రత దళాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయన్నారు.

  • క్లిష్టమైన చికిత్సలు

రాష్ట్రంలో సర్కారీ దవాఖానాల తీరు మారుతోంది. పెద్దాసుపత్రులు పేదలకు అండగా నిలుస్తున్నాయి. లక్షలు ఖర్చయ్యే అరుదైన సర్జరీలకు సైతం పైసా వ్యయం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఏటా ఇలాంటి సర్జరీలు వందల్లో చేస్తున్నారు. కరోనా కాలంలో కొంతవరకు తగ్గినా.. మళ్లీ పుంజుకున్నాయి.

  • గులాబి బంతితో ఆడేందుకు ఆసక్తి

ఆస్ట్రేలియా, భారత్​ మహిళా జట్ల(INDW Vs AUSW Test) మధ్య చారిత్రక గులాబి టెస్టుకు(Pink Test) రంగం సిద్ధమైంది. గురువారం(సెప్టెంబర్ 30) ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత మహిళా క్రికెటర్లు తొలిసారి గులాబి బంతితో డేనైట్​ టెస్టు ఆడనుండడం ప్రత్యేకం. ఈ మ్యాచ్​ కోసం ఇరుజట్లు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారో కెప్టెన్ల మాటల్లోనే తెలుసుకుందాం.

  • ఖరీదైన ప్రాంతాల్లో 'పఠాన్' సాంగ్

'చెన్నై ఎక్స్​ప్రెస్' లాంటి భారీ విజయం తర్వాత షారుక్​(Shahrukh Khan News)​, దీపికా పదుకొణె(Deepika Padukone News) మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం 'పఠాన్​'(Pathan Movie News). అయితే.. ఈ చిత్రంలో ఓ పాటను యూరప్​లోని ఖరీదైన ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారట. అందుకోసం యశ్​రాజ్ నిర్మాణసంస్థ అత్యధికంగా ఖర్చు చేయనున్నట్లు బాలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి.

06:47 September 30

టాప్​న్యూస్​ @ 7AM

  • భవానీపూర్​ పోలింగ్​కు సర్వం సిద్ధం

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్​కు(Bhabanipur bypoll) సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. 

  • రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు అండాదండా

రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో(Breast Cancer Victims) మనోధైర్యం నింపడానికి ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ వినూత్న ఆలోచన చేసింది. చికిత్స సమయంలో కుంగుబాటుకు గురవుతున్న బాధితులకు కౌన్సెలింగ్ చేయడానికి హెల్ప్​లైన్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

  • హుస్నాబాద్​లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ (Huzurabad by election notification) రావటంతో భాజపా, తెరాస మధ్య (Bjp vs Trs) మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో మాట్లాడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... రాష్ట్రంలో గులాబ్‌ తుపాను పోయిందని... కానీ గులాబీ పార్టీని 2023లో ఓట్ల తుపానులో కొట్టుకుపోయేలా చేస్తామని తెలిపారు. ఉపఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నట్లు కమలదళం ప్రకటించింది. అక్టోబర్‌ 2 వరకు సిద్దిపేట జిల్లాలోనే పాదయాత్ర కొనసాగుతుందని తెలిపింది.

  • విషజ్వరాల ముసురు

కొవిడ్‌ను(Covid-19), సాధారణ విషజ్వరాలను(viral fever india) వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా వర్షాకాలంలో పలు విషజ్వరాలు జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఎస్​బీఐ బంపర్​ ఆఫర్​!

తమ క్రెడిట్​ కార్డు యూజర్లకు ఎస్​బీఐ(Sbi Card Offers) అదిరే ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పింది.

05:34 September 30

టాప్​న్యూస్​@6AM

  • కాలుష్య కోరల్లో గోదావరి నది

గోదావరి నది (Godavari River) గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్‌(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి.

  • 70 శాతం సిలబస్సే..

తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా ఇంటర్మీడియట్ (Intermediate) ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే (Inter Syllabus) ఉండనుంది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే.

  • న్యాయనిరాకరణే

ట్రైబ్యునళ్ల(Tribunals)లో సభ్యులను నియమించకపోవడం న్యాయనిరాకరణే అవుతుందని హైకోర్టు (High Court) వ్యాఖ్యానించింది. ట్రైబ్యునళ్లు లేనప్పడు సివిల్ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందేవారని పేర్కొంది.

  • రైతుల ఆవేదన

మొక్కజొన్న సాగుచేసిన రైతుల (Corn Farmers) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత నెల వరకూ దేశవ్యాప్తంగా క్వింటాకు రూ.2 వేల ధర పలికింది. ఇప్పుడు కొత్త పంట మార్కెట్‌కు వస్తుండటంతో వ్యాపారులు రోజురోజుకు తగ్గించేస్తున్నారు.

  • డీపీఆర్​లను ఆమోదించొద్దు

గోదావరి నదిపై తెలంగాణా నిర్మిస్తున్న అనధికార ప్రాజెక్టులకు అనుమతుల్ని ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(GRMB NEWS)ను కోరింది. ఈమేరకు జీఆర్ఎంబీకి, కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది.

  • సిద్ధూతో చన్నీ భేటీ

పంజాబ్​ కాంగ్రెస్​లో(punjab congress crisis) సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పీసీసీ పదవికి నవ్​జ్యోత్​ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో.. సిద్ధూతో ఫోన్​లో మాట్లాడినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​సింగ్ చన్నీ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను గమిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జ్​ హరీశ్ రావత్ తెలిపారు.

  • ఉరే సరి

21 హత్యాచారాలు చేసిన కరడుగట్టిన రేపిస్ట్​ ఉమేశ్​ రెడ్డికి(Umesh Reddy News) ఉరి శిక్ష విధించడమే సరి అని తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు(Karnataka High Court News). ఉరిశిక్ష రద్దు చేసి జీవితఖైదు విధించాలంటూ సీరియల్​ కిల్లర్ ఉమేశ్​ రెడ్డి చేసిన విన్నపాన్ని తోసిపుచ్చింది.

  • పీఎం పోషణ్

మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఇకపై పీఎం పోషణ్​గా (PM POSHAN scheme) పిలవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు పలు అదనపు కార్యక్రమాలను ఇందులో భాగం చేసింది. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. పోషకాహార లోపంపై పోరాడేందుకు పీఎం పోషణ్ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు.

  • బెంగళూరు ఘనవిజయం

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాజస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకెళ్లింది.

  • గుర్తుపట్టలేనంతగా

బిగ్​బాస్​(bigg boss ott winner 2021) ఓటీటీ విజేత దివ్యా అగర్వాల్​ నెటిజన్లను షాక్​కు గురిచేసింది(divya agarwal bigg boss). ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎందుకలా?

Last Updated : Sep 30, 2021, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.