ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

etv bharat top news
etv bharat top news
author img

By

Published : Aug 27, 2021, 5:58 AM IST

Updated : Aug 27, 2021, 10:14 PM IST

22:08 August 27

టాప్​ న్యూస్​ 10PM

  • వర్గీకరణ పూర్తి 

పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తైంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పోస్టుల వర్గీకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

  • ప్రసవ  వేదన 

ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌ ఆస్పత్రిలో గర్భిణీలు నరక యాతన అనుభవిస్తున్నారు. గైనకాలజీ వైద్యులతో పాటు మత్తు మందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో లేక ఆపరేషన్ల కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి గోడును పట్టించుకునే వారే కరయ్యారు.  

  • 'అఫ్గాన్​లో పరిస్థితులు ఆందోళనకరం'

కాబుల్​లో జరిగిన ఆత్మాహుతి దాడిని చైనా తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్​లో పరిస్థితులు చక్కదిద్దేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

  • తలైవాగా మారిన వార్నర్​

ఏ మాత్రం తీరిక సమయం దొరికినా నెట్టింట సందడి చేసే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్.. మరో కొత్త వీడియోను పోస్టు చేశాడు. ఈ సారి సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'రోబో' సినిమాలోని పాటతో అలరించాడు. వైరల్​గా మారిన ఆ వీడియోను మీరూ చూసేయండి..

  • సినీ పరిశ్రమలో విషాదం 

ప్రముఖ సినీ నిర్మాత నౌషద్ మరణించారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నౌషద్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

20:53 August 27

టాప్ న్యూస్ @9PM

  • పుట్టిన రోజునే విషాదం..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జయవర్ధన్, విష్ణు, వరప్రసాద్‌గా గుర్తించారు.

  • చంద్రబాబు ఏజెంట్ రేవంత్​రెడ్డి..

రాజీనామా చేద్దామన్న మంత్రి మల్లారెడ్డి సవాల్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలన్నారు. చర్య ఎలా ఉంటుందో ప్రతిచర్య అలా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించి ప్రధాని మోదీకి చెప్పి అమ్మించేందుకే బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

  • ప్రజా సంగ్రామ యాత్ర..

తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో నిర్వహించే పాదయాత్ర ద్వారా తెరాస సర్కారు హామీలు, వైఫల్యాలు, కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.

  • ప్రేమ పెళ్లి.. అంతలోనే..

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యం చూపరులను కలచివేసింది. ఓ ప్రేమ జంట వివాహం చేసుకుని తల్లిదండ్రులను కాదని వెళ్లిపోతున్న దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి.

  • రాహుల్​తో భూపేశ్ భేటీ..

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో భేటీ అయ్యారు ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ భఘేల్​. సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భేటీ అనంతరం ఈ వ్యవహారంపై మీడియా వద్ద భఘేల్​ సరిగ్గా స్పందించలేదు.

19:55 August 27

టాప్ న్యూస్ @8PM

  • అమెరికా వైఫల్యం..

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుళ్లతో(kabul airport blast) ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానాశ్రయం వద్ద తాలిబన్లు భద్రతా వ్యవహారాలను చూసుకుంటున్నారు. దీనికి అమెరికా ఎలా ఒప్పుకుందని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ దాడులకు తాలిబన్లతో(taliban news) సంబంధం లేదని అమెరికా చెబుతోంది.

  • వాటర్ బాటిల్ రూ.3 వేలు..

వాటర్ బాటిల్ ధర ఎంతుంటుంది? రూ.20, మరీ కాస్ట్​లీ అయితే రూ.50 అంటారా? మరి ఒక లీటర్​ బాటిల్ కోసం రూ.3000 వెచ్చించాల్సి వస్తే? అదే ఒక ప్లేటు భోజనం రూ.7500 అంటే? కానీ అత్యవసర వస్తువులకు విపరీతమైన ధరలు పెట్టి ప్రజలను దోచుకుంటున్న దృశ్యాలు కాబూల్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి.

  • గజ్వేల్‌లో పోటీకి నేను సిద్ధం..

మంత్రి మల్లారెడ్డిపై రేవంత్​రెడ్డి చేసిన భూ ఆరోపణలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుమ రాజకీయం వేడెక్కుతోంది. నిన్నటి వరకు సవాళ్లకే పరిమితమైన ఆరోపణలు.. ఇవాళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని రేవంత్​రెడ్డి సవాల్ విసిరే వరకు వెళ్లింది. 

  • నా పెళ్లి ఆపండి సార్..

మరికొన్ని గంటల్లో కూతురి వివాహం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఎవరికి వారు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. అంతా సవ్యంగా జరుగుతుండగా.. సీన్​లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి ఆపేయాలన్నారు. తమ కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిద్దామనుకున్న ఆ తల్లిదండ్రులు ఆ మాటలతో షాక్​కు గురయ్యారు. పోలీసుల ద్వారా అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు.

  • 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ఎలా ఉందంటే?

నటుడు సుశాంత్​, మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'(Ichata Vahanamulu Niluparadu review) సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దర్శకడు ఎస్‌.ద‌ర్శ‌న్‌ ఎలాంటి కథతో ముందుకొచ్చారు? లాంటి విషయాల కోసం ఈ రివ్యూ చదివేయండి.

18:52 August 27

టాప్ న్యూస్ @7PM

  • తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తారా?

అఫ్గానిస్థాన్​ను తాలిబ్లను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు 260 మంది భారతీయులను మన దేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి చెప్పారు. ఆరు విమానాల్లో సుమారు 550 మంది భారత్​కు వచ్చినట్లు పేర్కొన్నారు.

  • మురిసిపోయిన సీఎం కేసీఆర్..

మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. కరీంనగర్ పర్యటన నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో హెలికాప్టర్ నుంచి మల్లన్నసాగర్​ను సీఎం వీక్షించారు.

  • పాఠశాలల్లో కరోనా కలకలం..

ఆంధ్రప్రదేశ్​లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

  • మళ్లీ లాక్​డౌన్..

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతూ... రోజూ 30వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఆదివారం పూట లాక్​డౌన్​ విధించాలని నిర్ణయించింది.

  • చెమటోడుస్తున్న భారత్..

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంకా 320 పరుగుల వెనుకంజలో ఉంది.

17:52 August 27

టాప్ న్యూస్ @6PM

  • సీజే బాధ్యతలు..

తెలంగాణ హైకోర్టు ఇన్‌ఛార్జీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు నియమితులయ్యారు. జస్టిస్ రామచంద్రరావుకు సీజే కార్యాలయం బాధ్యతలు ఇస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

  • సీఎం కేసీఆర్​కు రేవంత్​రెడ్డి సవాల్..

  • 'కిల్​ లిస్ట్​'.. ఇచ్చింది అమెరికానే!

అఫ్గాన్​ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి(US afghanistan). ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అఫ్గానీల పేర్లతో కూడిన ఓ జాబితాను స్వయంగా అమెరికా వెళ్లి తాలిబన్ల చేతికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అఫ్గానీలను వేటాడి వెంటాడుతున్న తాలిబన్లు(taliban news) ఈ జాబితాలోని ప్రజలను ఏం చేస్తారనే ఆందోళన నెలకొంది.

  • డ్రోన్ చిలుక..

ఓ వ్యక్తి ఫోన్​ని చిలుక ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​​గా మారింది. ఫోన్ కెమెరా ఆన్​లోనే ఉండటం, చిలుక ఎగురుతుంటే వీడియో రికార్డవ్వటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  • ఉత్తమ విలన్, సింగర్స్​ వీరే..!

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (Siima Awards 2019) వేడుక త్వరలోనే హైదరాబాద్​ వేదికగా జరగనుంది. 2019కు సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లను ప్రకటించగా.. తాజాగా ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌ నామినేషన్ల వివరాల్ని సైమా వెల్లడించింది.

16:53 August 27

టాప్ న్యూస్ @5PM

  • తెలంగాణకు అడ్డంకి..

కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ 'విత్‌డ్రా' చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న తెలంగాణ నిర్ణయానికి అడ్డంకి ఏర్పడింది. విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి.

  • మల్లారెడ్డి అక్రమాలపై ఆధారాలున్నాయ్..

మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై నావద్ద ఆధారాలు ఉన్నాయని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. గిఫ్ట్ డీడ్‌ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని వివరించారు. రెండుసార్లు అమ్మిన భూమిని చూపి వర్శిటీకి ఎలా అనుమతి తెచ్చుకున్నారని ప్రశ్నించారు.

  • రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు!

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

  • పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?

కేసీఆర్​ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి అంటూ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. తెరాస ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఎవ‌రి పాల‌వుతున్నాయ‌ని ఆమె మండిపడ్డారు. త‌న‌కు 600 ఎకరాలు భూమి ఉందని మంత్రే స్వ‌యంగా చెప్పార‌ని, ఆ భూమిలో అసైన్డ్, దళిత, గిరిజనుల భూములు ఎన్ని ఉన్నాయో కూడా బ‌య‌ట పెట్టాల‌ని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు.

  • భారత్​పై భారీ ఆధిక్యం..

భారత్​తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 432 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్. భారత్​ ముందు 354 పరుగులు ఆధిక్యాన్ని ఉంచింది.

15:51 August 27

టాప్ న్యూస్ @4PM

  • హెలికాప్టర్లతో తాలిబన్ల 'టెస్ట్ ​రైడ్'​!

అమెరికా దళాలు విడిచిపెట్టి వెళ్లిన హెలికాప్టర్లను వాడుకునేందుకు తాలిబన్లు(taliban news) ఊవిళ్లూరుతున్నారు. కానీ సరైన శిక్షణ లేకపోవడం వల్ల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాందహార్​ విమానాశ్రయంలో ఓ హెలికాప్టర్​.. చాలా సేపు నేల మీదే చక్కర్లు కొడుతూ కనిపిచింది. అందులో తాలిబన్ ఫైటర్లు ఉన్నట్టు సమాచారం.

  • ఎన్జీటీ అసహనం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంప్లిడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

  • దళితుల సమగ్రాభివృద్ధి కోసం..

కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధుపై సమీక్ష నిర్వహించారు. రెండున్నర గంటలపాటు దళితబంధుపై అధికారులతో చర్చించిన సీఎం.. పథకం అమలుపై దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు కలెక్టర్లు, ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. 

  • ఎలాంటి ప్రమాదం జరగలేదు..

ఏపీలోని విశాఖపట్నం యారాడలో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని నేవీ స్పష్టం చేసింది. కొత్తగా 3 హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్లు తూర్పు నౌకాదళానికి వచ్చాయని.. యారాడ నౌకాదళం ప్రాంతంలో శిక్షణా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించింది. 

  • పాకిస్థాన్ గెలిచి తీరుతుంది..

త్వరలోనే టీ20 ప్రపంచకప్(T20 World Cup)t20​ జరగనుంది. ఈ మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో ఆడనుంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో భారత్​పై పాక్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు ఆ జట్టు సీనియర్ పేసర్.

14:37 August 27

టాప్ న్యూస్ @3PM

  • ముగిసిన సమీక్ష..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై సీఎం కేసీఆర్ తొలి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పథకం ప్రారంభం నుంచి అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ పథకానికి నిథుల కేటాయింపు కూడా జరిగిపోయింది.

  • సిట్​ నివేదికపై ఆరా..

దిశ కేసులో సిట్​ దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన డీసీపీ సురేందర్​రెడ్డిని.. దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నిస్తోంది. సిట్​ సమర్పించిన నివేదికలోని పలు అంశాలపై ఆరాతీస్తోంది.

  • 'దేశ్​ కా మెంటర్స్'​​ అంబాసిడర్​గా సోనూ..

దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'దేశ్​ కా మెంటర్స్​ (Desh ka mentors)' కార్యక్రమానికి సినీ నటుడు సోనూసూద్​(Sonu sood)ను బ్రాండ్ అంబాసిడర్​గా నియమించింది. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అధికారిక ప్రకటన చేశారు.

  • ముందు కాల్పులు- కాసేపటికే పేలుళ్లు!

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లోని విమానాశ్రయం వద్ద వరుస పేలుళ్లలో వంద మందికిపైగా మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే.. పేలుళ్లు సంభవించేందుకు ముందు విమానాశ్రయం వద్ద ఉన్న ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. 

  • బాత్రూంలో కింగ్​ కోబ్రా..

కర్ణాటకలో ఓ ఇంటి స్నానాల గదిలో చిక్కుకుపోయిన 14 అడుగుల కింగ్‌ కోబ్రాను(King Cobra) పాములను పట్టే నిపుణుడు కాపాడాడు. దక్షిణ కన్నడ జిల్లా అలదంగడి గ్రామంలో గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన జీకే ఫామ్‌ హౌస్‌లోని బాత్‌రూంలో కింగ్‌ కోబ్రా ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. 

13:55 August 27

టాప్​న్యూస్​ @ 2PM

  • కరీంనగర్​లో కేసీఆర్​

సీఎం కేసీఆర్​ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తెరాస కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు రూప్​సింగ్ కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

  • కాబుల్​లో గుబుల్​​.. 

అఫ్గానిస్థాన్​లో (Afghan crisis) రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. కాబుల్​ విమానాశ్రయం (Kabul airport blast) వెలుపల జరిగిన జంట ఆత్మహుతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 103కు చేరింది. ఎయిర్​ పోర్ట్​ లక్ష్యంగా మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా హెచ్చరిస్తోంది. అయిప్పటికీ వేలాది మంది దేశం వీడేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • ఒక్కసారిగా కూలిన వంతెన

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లో భారీ వర్షాల కారణంగా రాణిపొఖారి-రిషికేష్​ హైవేపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా వారధిపై ప్రయాణిస్తున్న వాహనాలు జఖాన్​ నదిలోకి పడిపోయాయి. ఆ వాహనాల్లో ఉన్నవారు చాకచక్యంగా బయటపడ్డారు.

  • 'శ్రీదేవి సోడా సెంటర్' రివ్యూ

సుధీర్​బాబు, ఆనంది జంటగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' థియేటర్లలోకి వచ్చేసింది. అయితే సినిమా ఎలా ఉంది? దర్శకుడు కరుణ కుమార్ ఎలాంటి కథతో వచ్చారు? లాంటి విషయాల కోసం ఈ రివ్యూ చదివేయండి.

  • 'టీమ్ఇండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు'

లీడ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేశారని ప్రత్యర్థి ఆటగాడు డేవిడ్​ మలన్​ వెల్లడించాడు. ఆ బౌలింగ్​తో తమను పరుగులు చేయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని అన్నాడు. అయితే భారత ఆటగాళ్లకు పిచ్​ నుంచి సహకారం లభించలేదని అభిప్రాయపడ్డాడు.

13:06 August 27

టాప్​న్యూస్​ @ 1 PM

  • దళిత బంధుపై ముఖ్యమంత్రి సమీక్ష

కరీంనగర్​ కలెక్టరేట్‌లో దళిత బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. పథకం అమలుపై పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటున్న అధికారులతో చర్చిస్తున్నారు.

  • వెలిగొండ ప్రాజెక్టుపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇచ్చే విషయమై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖలోని స్టేట్ ప్రాజెక్ట్స్ వింగ్ కమిషనర్​కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వరద జలాల ఆధారంగా కృష్ణానదిపై ఏపీ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.  

  •  బ్రాండ్​ అంబాసిడర్​గా సోనూసూద్​

  • అమితాబ్ ప్రభుత్వ బాడీగార్డ్​కు అంత జీతమా?

బిగ్​బీ ప్రభుత్వ బాడీగార్డ్ కోట్ల రూపాయల జీతం ఆర్జిస్తున్నాడనే వార్త బీటౌన్​లో చక్కర్లు కొడుతోంది. దీంతో అతడిని వేరే చోటుకు బదిలీ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

  • అఫ్గానిస్థాన్​ క్రీడాకారులు సేఫ్​

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొనాల్సిన ఇద్దరు అఫ్గానిస్థాన్​ క్రీడాకారులు ఆ దేశ సరిహద్దులు దాటారని అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ(ఐపీసీ) వెల్లడించింది. ఆ దేశానికి చెందిన మహిళా అథ్లెట్​ జాకియా ఖుదాదాదితో పాటు మరో క్రీడాకారుడు హుస్సేన్ రసౌలి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తమకు తెలుసునని ఐపీసీ అధికార ప్రతినిధి క్రెయిగ్​ స్పెన్స్​(IPC spokesman Craig Spence) వెల్లడించారు. విశ్వక్రీడల్లో వారిద్దరూ పాల్గొనే విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలిపారు.

11:54 August 27

టాప్​న్యూస్​ @ 12 PM

  • రెండు కిలోల బంగారు ఆభరణాల చోరీ

హైదరాబాద్​ అమీర్‌పేట్‌లో ఓ బంగారు వ్యాపారి నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

  • 'భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారం కాదు'

చత్తీస్‌గఢ్‌ హైకోర్టు (Chhattisgarh high court) సంచన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతంగా శృంగారం చేసినా (Marital rape) దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఓ కేసు విచారణలో భాగంగా పేర్కొంది. 376వ అధికరణలోని రెండో మినహాయింపు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

  • ఐదుగురు సజీవదహనం

అసోంలో గుర్తుతెలియని కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏడు బొగ్గు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు.

  • రూ.106 కోట్ల సొమ్ము జప్తు

పీసీఎఫ్‌ఎస్‌ ఖాతాల్లోని రూ.106 కోట్ల సొమ్మును ఈడీ జప్తు చేసింది. అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేసి.. అలా వచ్చిన డబ్బును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది. రకరకాల పద్ధతుల్లో అక్రమంగా విదేశాల్లోని ఒపేరా గ్రూపునకు చెందిన చైనీయుల ఖాతాల్లోకి మళ్లించినట్లు వెల్లడైంది.

  • కౌబాయ్ సినిమాకు 50 ఏళ్లు

తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. హాలీవుడ్​ స్థాయి సాంకేతికతతో తీసిన ఈ కలర్ సినిమా విడుదలై నేటికి(ఆగస్టు 27) 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా తెలుగు తొలి కౌబాయ్​ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.

10:47 August 27

టాప్​న్యూస్​ @ 11AM

  • మూడు కిలోమీటర్లు బాలింత నడక

ఏటా బడ్జెట్​లో వేల కోట్ల కేటాయింపులు.. గ్రామీణ ప్రాంతాల్లోని కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరచలేకపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లోని గ్రామాల్లో ఎంత అత్యవసరమైనా కాలినడకనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటోంది. రహదారి సరిగ్గా లేక.. ఓ బాలింత ఏకంగా మూడు కిలోమీటర్ల నడిచి ఇంటికి చేరిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకొంది.

  • అఫ్గాన్​ నుంచి ప్రజల తరలింపు నిలిపేసిన దేశాలు!

అఫ్గాన్​లో ఆందోళనకర పరిస్థితుల(Afghanistan crisis) నేపథ్యంలో పలు దేశాలు ప్రజల తరలింపు ప్రక్రియను డెడ్​లైన్​కు ముందే నిలిపివేశాయి. కెనడా, బ్రిటన్​, పోలాండ్, బెల్జియం దేశాలు తమ పౌరుల తరలింపు(Evacuation from Kabul) పూర్తయినట్లు ప్రకటించాయి. మరోవైపు కాబుల్​లో పేలుళ్లు(Kabul Airport blast) జరిగినప్పటికీ తమ వాళ్లను స్వదేశం తీసుకెళ్లడం ఆపబోమని అమెరికా స్పష్టం చేసింది.

  • ఇంటికి లక్షల్లో కరెంట్​ బిల్లు

కరెంటు బిల్లు మోతతో ఓ రైతు లబోదిబోమంటున్నాడు. ఏకంగా లక్షల్లో బిల్లు రావడంతో ఎలా చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాడు. గ్రామంలో మరికొంతమందికి కూడా ఇదేవిధంగా బిల్లులు వచ్చాయని అంటున్నారు. విద్యుత్​ శాఖ సిబ్బంది తప్పిదాలకు తాము ఎందుకు బలి కావాలని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం సరిగా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.

  • భారత అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే?

భారత క్రికెట్​లో అత్యంత సంపన్న క్రికెటర్​ ఎవరా? అనే ప్రశ్న వస్తే మీరేం చెప్తారు. దిగ్గజ సచిన్, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని అనుకుంటారు. వీరెవరు కాకుండా ఓ ఫస్ట్​క్లాస్ క్రికెటర్ వారి కంటే సంపన్నుడని ఊహించగలరా? అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అతడు ఎవరంటే?

  • సిరాజ్​ బౌలింగ్​కు ఫిదా అయిన పాకిస్థానీ యాంకర్​

టీమ్ఇండియా ఫాస్ట్​ బౌలర్​ మహ్మద్​​ సిరాజ్​.. అనతికాలంలోనే తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగడం సహ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. ఈ పేసర్​కు భారత్​లోనే కాకుండా.. దాయాది దేశమైన పాకిస్థాన్​లోనూ అభిమానులున్నారంటే నమ్ముతారా? అవునండి మీరు చదివింది నిజమే! పాకిస్థాన్​ స్పోర్ట్స్​ యాంకర్​, జర్నలిస్టు జైనాబ్​ అబ్బాస్​కు సిరాజ్​ అంటే విపరీతమైన అభిమానం అని ఆమె అనేకసార్లు వెల్లడించింది.

09:56 August 27

టాప్​న్యూస్​ @ 10 AM

  • ఏపీ ర్యాంకర్లకు ఈసెట్‌ ప్రవేశాలు లేవు

ఏపీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ఈసెట్​లో ర్యాంకు పొందిన ఆంధ్రప్రదేశ్​ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. కౌన్సిలింగ్​కు వచ్చే వరకు ఈ విషయం చెప్పలేదని... ఏపీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • 40వేలకు పైగా కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కొత్త కేసులు(Coronavirus India) 40వేలకు పైగా నమోదయ్యాయి. మరో 496 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

  • కాబుల్​ మృతులకు సంతాపంగా 

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన వరుస పేలుళ్లలో (Kabul airport blast) 13 మంది అమెరికా సైనకులు సహా 60 మంది అఫ్గాన్​ పౌరులు మృతి చెందారు. మృతులకు సంతాపంగా ఆగస్టు 30 వరకు అమెరికా జాతీయ పతాకం అవనతం (US flag to fly at half) చేయాలని ఆదేశించింది అమెరికా.

  • పెరిగిన బంగారం ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర శుక్రవారం భారీగా పెరిగింది. వెండి (Silver price today) కూడా మరింత ప్రియమైంది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

  • సెక్యూరిటీతో ఒలింపిక్స్ గోల్డ్​ మెడలిస్ట్​ ప్రాంక్​

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​ సెక్యూరిటీ సిబ్బందితో కెనడా క్రీడాకారిణి ప్రాంక్​ చేసింది. ఆ వీడియోను ఇప్పుడు పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్​గా మారింది.

08:52 August 27

టాప్​న్యూస్​ @ 9 AM

  • మత్తుమందు లావాదేవీల గుట్టు రట్టే లక్ష్యం

నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.

  • మోయలేని వైద్య చికిత్సల భారం

సగటు జీవి ఒక్కసారి అనారోగ్యం బారినపడితే ఆర్థిక భారం తడిసిమోపెడవుతోంది. జీవితాంతం కొద్దోగొప్పో కూడబెట్టిన సొమ్మంతా దవాఖానాల పాలు చేయాల్సి వస్తోంది. అది కూడా సరిపోక అప్పుల పాలు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

  • జైలు నుంచే దర్జాగా వ్యవహారాలు

ఇళ్ల కొనుగోలుదార్లను మోసగించారన్న ఆరోపణపై అరెస్టయిన యునిటెక్‌(unitech supreme court) సంస్థ వ్యవస్థాపకుడు రమేష్‌ చంద్ర దక్షిణ దిల్లీలో రహస్యంగా భూగర్భ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం దృష్టికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవీ దివాన్‌ తీసుకువచ్చారు. దీనిపై ఈడీ రెండు నివేదికలు సమర్పించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme court).. తిహార్ జైలు ఉద్యోగులపై(Tihar Jail) ఘాటు వ్యాఖ్యలు చేసింది. సూపరెంటెండెంట్‌, ఆయన సిబ్బందికి ఏ మాత్రం సిగ్గులేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  •  'వివాహ భోజనంబు' ఎలా ఉందంటే..

లాక్​డౌన్ నేపథ్య కథతో తీసిన 'వివాహ భోజనంబు' సినిమా.. ఓటీటీలో విడుదలైంది. అయితే చిత్రం ఎలా ఉంది? ఏయే అంశాలు ప్రేక్షకుల్ని నవ్వించాయి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

  • ఆరోగ్య బీమా.. క్లెయిం తిరస్కరిస్తే..

ఆరోగ్య బీమా (Health insurance) తీసుకున్నప్పటికీ.. అన్ని ఆస్పత్రులు దానిని ఆమోదించవు. ఇలాంటి సందర్భాల్లో ముందు చేతి నుంచి ఆస్పత్రి బిల్లులు చెల్లించి తర్వాత.. బీమా సంస్థ నుంచి ఆ మొత్తాన్ని క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సార్లు క్లెయిమ్​ తిరస్కరణకు గురవచ్చు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బీమా తీసుకున్న వ్యక్తి (insurance claim rejected help) ఏం చేయాలి?

07:56 August 27

టాప్​న్యూస్​ @ 8 AM

  • బైరాన్‌పల్లి నరమేధానికి 73 ఏళ్లు

తెల్లదొరలను తరిమిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. పరాయి పాలకులు దేశాన్ని వదిలి సంవత్సరం గడుస్తున్నా.. నిజాం ప్రాంతంలో స్వేచ్ఛకు తావు లేదు. రోజురోజుకు నిజాం నిరంకుశత్వం పెరుగింది. ప్రజల మానప్రాణాలకు కనీస విలవ లేకుండాపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బైరాన్​పల్లి కూడా ఇటువంటిదే. కానీ దాని నేపథ్యం.. చరిత్ర విభిన్నం. బైరాన్​పల్లి అమరుల త్యాగానికి 73 ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

  • 'దేశవ్యాప్త ఉద్యమంగా రైతుల ఆందోళన'

రైతుల ఉద్యమాన్ని(Farmers Protest) దేశవ్యాప్తం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా భావిస్తోంది. వ్యవసాయ చట్టాలపై మాతో చర్చించడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడం విచారకరమని, అంతమాత్రాన మనం నీరుగారిపోవాల్సిన అవసరం లేదని బీకేయూ నేత రాకేష్​ టికాయిత్ అన్నారు. సెప్టెంబరు 25న భారత్‌ బంద్‌ పాటించాలని నిర్ణయించారు.

  • 'ఆ విషయం త్రివిక్రమ్ పసిగట్టేశారు'

'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సుశాంత్.. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల్ని చెప్పారు. సినిమాల విషయంలో ఒత్తిడి తీసుకోవడం గత కొన్నేళ్ల నుంచి మానేశానని అన్నారు.

  • ఈ బంతి చాలా స్మార్ట్​ గురూ!

ప్రొఫెషనల్​ క్రికెట్​లోకి స్మార్ట్​ బంతి(Smart Ball Cricket) అడుగుపెట్టింది. కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో(Caribbean Premier League) ఈ బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. మరి ఈ కొత్త బంతి విశేషాలు ఏంటంటే?

  • రిటైౖల్‌ రుణాలకు అధిక గిరాకీ

కేరళ కేంద్రంగా పని చేస్తున్న సీఎస్​బీ బ్యాంక్ ఇటీవల పలు కొత్త శాఖలను (CSB bank Expansion) ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణతో పాటు.. పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొత్త శాఖలను ఏర్పాటు చేసి.. కార్యకలాపాలను భారీగా విస్తరించాలని భావిస్తోంది. తమ భవిష్యత్ (CSB bank future plans)​ కార్యచరణతో పాటు.. ప్రస్తుత వ్యూహాల గురించి పలు కీలక విషయాలు సీఎస్‌బీ బ్యాంకు ఎండీ అండ్‌ సీఈఓ సివిఆర్‌ రాజేంద్రన్‌ 'ఈనాడు' ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

07:03 August 27

టాప్​న్యూస్​ @ 7AM

  • అందుకే ప్రజాసంగ్రామ యాత్ర

రాష్ట్రంలో అవినీతి, అరాచక, కుటుంబ పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాక్షస ప్రభుత్వం పాలిస్తోందని మండిపడ్డారు. ఇందుకోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని చెప్పారు. శనివారం నుంచి ‘ప్రజా సంగ్రామయాత్ర’ పేరిట పాదయాత్ర చేపడుతున్న సంజయ్‌ ‘ఈనాడు- ఈటీవీభారత్​’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • కాబుల్​ ఆత్మాహుతి దాడుల ఖండన 

కాబుల్‌ పేలుళ్ల(kabul airport blast) ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగశాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు(Terror Attacks) వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది.

  • పేలుళ్లను ఖండించిన తాలిబన్లు

కాబుల్‌ విమానాశ్రయం వద్ద పేలుళ్ల ఘటనను తాలిబన్లు ఖండించారు. అమెరికా బలగాలున్న ప్రాంతంలోనే పేలుళ్లు జరిగాయని స్పష్టం చేశారు. పేలుళ్లకు అమెరికా బలగాలే బాధ్యత వహించాలన్నారు తాలిబన్లు.

  • భారత రెజ్లింగ్​కు​ అండగా

భారత రెజ్లర్లకు అండగా నిలిచేందుకు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. 2032 ఒలింపిక్స్​ వరకు భారత రెజ్లింగ్​కు స్పాన్సర్​గా వ్యవహరించేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకోసం రూ.170 కోట్లు ఖర్చు పెట్టునుంది!

  • 'ఆ విషయమే ఎక్కువ మాట్లాడతారు..'

'శ్రీదేవి సోడా సెంటర్'తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైన హీరో సుధీర్​బాబు.. పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. పాఠశాల స్థాయిలో హాస్టల్​లో ఉండటం వల్ల ఈ చిత్రం కోసం గోదావరి యాస పలకడం తేలికైందని అన్నారు.

03:22 August 27

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

72 మంది మృతి

కాబుల్‌ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.

వాళ్లను క్షమించం..

కాబుల్‌ విమానాశ్రయంలో పేలుళ్లకు పాల్పడినవారిని క్షమించమని.. వెంటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడుల్లో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. బాంబు దాడులు జరిగినా కాబుల్‌ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు.

సీఎం సమీక్ష

నేడు దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రులు హరీశ్​రావు, గంగుల, కొప్పులతో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరుకానున్నారు. నిన్న రాత్రే కరీంనగర్​లోని తీగలగుట్టపల్లికి సీఎం చేరుకున్నారు.

106 కోట్ల రూపాయల జప్తు

చైనా రుణ యాప్​ల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. క్యాష్ బిన్ రుణ యాప్ నిర్వాహకులకు చెందిన 106 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసింది. యాప్ నిర్వహించే బ్యాంకింగేతర సంస్థ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్​ను చైనా జాతీయులు చేజిక్కించుకొని.. హవాలా దందా నడిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరికొన్ని రుణయాప్​లపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.

తనిఖీలు

బ్యాంకులను మోసం చేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేశారు. పలు లాప్ టాప్​లు, ఐఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

 సీబీఐ

నాలుగు నక్షత్రాల హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని ప్రభుత్వ రంగ నిథమ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు పేరిట బ్యాంకు నుంచి రుణాలు పొందిన సొమ్మును ఇతర వ్యాపారాల కోసం మళ్లించి రుణాలు ఎగవేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియానికి 159 కోట్ల నష్టం చేశారన్న అభియోగంపై సప్తర్షి హోటల్స్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫర్నీచర్, ఇంటీరియల్ వస్తువుల పేరిట సొమ్ము చేజిక్కించుకున్న సంస్థలనూ నిందితులుగా చేర్చింది.

రాజద్రోహం కేసులా!

సర్కారు మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం.. దేశంలో ఇబ్బందికర పరిణామంగా మారిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు పోలీసులూ కారకులేనని సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
కూరగాయలు అమ్ముతున్న కలెక్టర్​

ఓ ఐఏఎస్ అధికారి ఒక్కసారిగా కూరగాయలు అమ్మే వ్యక్తి అవతారమెత్తారు. తన వద్ద టమాటాలను కొనండి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటో పోస్ట్ చేశారు. దీంతో కంగుతినడం నెటిజన్ల వంతైంది. ఇంతకీ కథేంటంటే?

గిన్నిస్‌ రికార్డ్‌!

భారత్​లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది.

రూట్‌ శతకమోత..

మూడో టెస్టు రెండో రోజున ఆతిధ్య జట్టు మెరుగైను ప్రదర్శనతో భారత్​పై ఆధిపత్యం కొనసాగించింది. మూడో సెషన్​ ముగిసే సమయానికి ఇంగ్లాండ్​ 8 వికెట్లు కోల్పోయి 423 పరుగులు చేసింది.

Last Updated : Aug 27, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.