కత్తి మహేశ్ మృతి
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈటల పాదయాత్ర
హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్(ETALA RAJENDER) ప్రకటించారు. బత్తినివానిపల్లె నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఉప ఎన్నికల్లో(by-election) గెలుపే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేసీ తండాకు గవర్నర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజనులతో కలిసి కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. రేపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రెండో డోసు తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సంస్కృతంపై ఇంటర్ బోర్డు వివరణ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతంపై ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. సంస్కృతం రెండో భాషగా ఉండాలని ఆదేశాలు ఇవ్వలేదని బోర్డు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్వరలో నిర్ణయం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే అంశంపై 4-6 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ప్రసాద్
కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇటీవలే మంత్రి వర్గ విస్తరణకు ముందు.. కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చెంప చెళ్లుమనిపించిన డీకే!
మాజీ మంత్రిని పరామర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా ఓ కార్యకర్తపై కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చెయ్యి చేసుకున్నారు. భుజంపై చెయ్యి వేసేందుకు ప్రయత్నించాడని.. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశంలోనే పొట్టి లాయర్
సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్‌కు చెందిన హర్విందర్ కౌర్ అలియాస్ రూబి. మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె.. లాయర్ అయి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగుల కోసం కోర్టులో ఉచితంగా వాదనలు వినిపిస్తానని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
శబ్దాలు చేస్తే రూ.లక్ష జరిమానా!
శబ్దకాలుష్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకలకు, సమావేశాలకు నిబంధనలు ఉల్లంఘించి లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు దిల్లీ సర్కారు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చీర్ ఫర్ ఇండియా
టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్లు విజయం సాధించాలని ఆకాంక్షించారు టీమ్ఇండియా క్రికెటర్లు. కెప్టెన్స్ మిథాలీ రాజ్(Mithali Raj), విరాట్ కోహ్లీ(Kohli) సహా పలువురు ఆటగాళ్లు 'చీర్ ఫర్ ఇండియా' అంటూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.