ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9PM
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jul 9, 2021, 8:56 PM IST

ఉద్యోగాల భర్తీకి గ్రీన్​సిగ్నల్​

రాష్ట్రంలో (telangana) ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ (cm kcr)​ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ (fill the 50 thousand jobs) అంశంపై అధికారులతో సమీక్షించిన ఆయన వెంటనే ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలలో కలిపి 50 వేల ఉద్యోగాలు మొదటి దశలో భర్తీ చేయాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరోసారి ఫీవర్​ సర్వే

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణపై సీఎం కేసీఆర్​ సమీక్షించారు. వైద్యారోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా మహమ్మారి నియంత్రణలోకి రాలేదన్న సీఎం.. వైరస్‌ వ్యాప్తికి కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

13న కేబినెట్​ భేటీ

రాష్ట్ర మంత్రివర్గం వచ్చే మంగళవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థితిని సమీక్షించటంతో పాటు చికిత్స, సదుపాయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేవంత్​ సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సరదాగా ముచ్చటించిన రేవంత్​... కిషన్​రెడ్డికి కేంద్ర కేబినెట్‌ హోదా తన వల్లే వచ్చిందని​... కేసీఆర్​ ఉన్నంత కాలం కేటీఆర్​ సీఎం కాలేరని ఆసక్తికర కామెంట్లు చేశారు. 2022లో కేసీఆర్​... ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చేప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జికా వైరస్​పై కేంద్రం హైఅలర్ట్

జికా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరుగురు సభ్యులున్న కేంద్ర నిపుణుల బృందం.. కేరళకు బయలుదేరింది. వైరస్​ వ్యాప్తిని పర్యవేక్షించడం సహా​ కేసుల నిర్వహణలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహకరించనుంది. మరోవైపు.. వైరస్​ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేరళ ప్రభుత్వం రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కప్పా కలకలం

ఉత్తర్​ప్రదేశ్​లో రెండు కరోనా కప్పా రకం(Kappa Variant) కేసులు వెలుగుచూశాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోరప్రమాదం

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి భవంతి పైనుంచి కిందికి దూకినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వెనక్కి తగ్గిన వాట్సాప్!

నూతన వ్యక్తిగత గోప్యత విధానంపై దిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వివరణ ఇచ్చింది. కొత్త పాలసీని అంగీకరించేలా వినియోగదారులను ఒత్తిడి చేయమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఒలింపిక్స్​.. అంత ఈజీ కాదు'

ఈసారి ఒలింపిక్స్ అంత సులభమేమి కాదని స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడింది. ప్రతి మ్యాచ్​, ప్రతి పాయింట్ ఎంతో కీలకమని చెప్పింది. లీగ్​ దశలో మంచి డ్రా లభించిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సినిమా అప్​డేట్స్​

కొత్త సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో నారప్ప, లాల్ సింగ్ చద్దా, స్టాండప్ రాహుల్, భూత్ పోలీస్ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.