ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @7PM

author img

By

Published : Jul 9, 2021, 6:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @7PM
టాప్​ టెన్​ న్యూస్​ @7PM

ఉద్యోగాల భర్తీకి గ్రీన్​సిగ్నల్​

రాష్ట్రంలో (telangana) ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ (cm kcr)​ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ (fill the 50 thousand jobs) అంశంపై అధికారులతో సమీక్షించిన ఆయన వెంటనే ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలలో కలిపి 50 వేల ఉద్యోగాలు మొదటి దశలో భర్తీ చేయాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

13న కేబినెట్​ భేటీ

రాష్ట్ర మంత్రివర్గం వచ్చే మంగళవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థితిని సమీక్షించటంతో పాటు చికిత్స, సదుపాయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేవంత్​పై రోజా ఫైర్​

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్​ల మంతనాలు జరిగాయని రేవంత్​రెడ్డి అంటున్నారని, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చారో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఆమె సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 729 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృత్యువాత పడ్డారు. కరోనా రికవరీ రేటు 97.67 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జికా వైరస్​పై కేంద్రం హైఅలెర్ట్​

జికా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరుగురు సభ్యులున్న కేంద్ర నిపుణుల బృందం.. కేరళకు బయలుదేరింది. వైరస్​ వ్యాప్తిని పర్యవేక్షించడం సహా​ కేసుల నిర్వహణలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహకరించనుంది. మరోవైపు.. వైరస్​ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేరళ ప్రభుత్వం రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లామ్డా వేరియంట్​పై కీలక ప్రకటన

కరోనా రెండో దశ ముప్పు ఇంకా వీడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పర్యటక ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్​ వ్యాప్తి మరితం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో లామ్డా వేరియంట్​పై కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చైనా సైన్యం దుష్ట పన్నాగం!

పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్‌ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచే నియామక ప్రక్రియ ప్రారంభం కాగా.. వాస్తవాధీన రేఖ వెంబడి వారిని మోహరించి సైనిక కార్యకలాపాల కోసం వినియోగించాలని డ్రాగన్ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అలెక్సా'కు కొత్త చిక్కు!

టెక్​ ప్రియులకు అలెక్సా అనే పేరు సుపరిచితమే. అమెజాన్​ తీసుకువచ్చిన ఈ వర్చువల్​ అసిస్టెంట్​కు కొత్తగా చిక్కులు వచ్చి పడ్డాయి. యూకేలో చాలా మంది తల్లిదండ్రులు ఈ అమెజాన్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌కు పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పేరు వల్ల వారి పిల్లలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

శ్రీలంక జట్టులో కరోనా కలకలం

శ్రీలంక క్రికెట్​ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే కోచ్ గ్రాంట్​ ఫ్లవర్, డేటా ఎనలిస్ట్​ జీటీ. నిరోషన్​ల​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో టీమ్​ఇండియాతో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్​ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరీనాకు మూడోబిడ్డ!

హీరోయిన్ కరీనా కపూర్​ మూడోసారి బిడ్డకు జన్మనిచ్చింది! అయితే ఇక్కడే చిన్న మెలిక. ఇంతకీ ఆ విషయమేంటి? దాని సంగతేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.