ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5PM
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jul 9, 2021, 4:57 PM IST

కేసీఆర్​ సమీక్ష

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రానికి పెట్టుబడులు!

రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కైటెక్స్ గ్రూపు యోచిస్తోంది. మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గాంధీభవన్​ వద్ద ఉద్రిక్తత

విధుల నుంచి తొలగించిన నర్సుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్​ నుంచి డీఎంఈ కార్యాలయానికి ర్యాలీ తలపెట్టగా... పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్​ వద్దే నర్సులను అడ్డుకోగా.. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు నర్సులను అరెస్టు చేయగా.. కొందరు యువతులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ

పల్లె ప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు చుక్కెదురైంది. గ్రామంలో అభివృద్ధి పనుల ఆలస్యంపై మంత్రిని గ్రామస్థులు ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఎర్రబెల్లి అడగ్గా.. ఆయన పట్టించుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. కరీంనగర్ జిల్లా పెద్ద పాపయ్య పల్లి పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కప్పా కలకలం

ఉత్తర్​ప్రదేశ్​లో రెండు కరోనా కప్పా రకం(Kappa Variant) కేసులు వెలుగుచూశాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పోలీస్​ అధికారిపై దేశద్రోహం కేసు!

అక్రమాస్తుల కేసులో సస్పెన్షన్​కు గురైన ఛత్తీస్​గఢ్​ ఏడీజీ జీపీ సింగ్​పై దేశద్రోహం కేసు(Sedition charges) నమోదైంది. జీపీ సింగ్ అధికార నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వ వ్యతిరేక కుట్రకు సంబంధించిన పత్రాలు లభ్యమవ్వగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'లామ్డా​' వైరస్​ దెబ్బ

కరోనా డెల్టా వేరియంట్‌ కారణంగా ప్రపంచదేశాలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కొత్తగా వెలుగుచూసిన లామ్డా వెరియంట్​ అంతకంటే ప్రమాదకరమని నిపుణుల వెల్లడించడం మరింత ఆందోళన కల్గిస్తోంది. లామ్డా వేరియంట్ అన్ని రకాల కంటే ప్రాణాంతకమని మలేసియా ఆరోగ్య శాఖ తెలిపింది. గత నాలుగు వారాల్లో దాదాపు 30 దేశాల్లో ఈ రకం కరోనాను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మార్కెట్లకు మళ్లీ నష్టాలు

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 182 పాయింట్ల నష్టంతో 52,386 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ద్రవిడ్​ టీమిండియా కోచ్​గా వద్దు!'

అంతర్జాతీయ స్టార్ల కన్నా కుర్రాళ్లకే రాహుల్​ ద్రవిడ్​ మార్గనిర్దేశం అవసరమని మాజీ క్రికెటర్ వసీమ్​ జాఫర్ అన్నాడు. అండర్​-19, భారత్​-ఏ కోచ్​గానే ద్రవిడ్​ కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. ఒక అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఆయన తనకు తానుగా వెళ్లొద్దన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వివాదంలో రామ్​ సినిమా!

రామ్​ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో మొదలు కావాల్సిన చిత్ర కథపై కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ కథ విషయమై గతంలోనూ చిత్రదర్శకుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.