ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top
top
author img

By

Published : Jun 6, 2021, 2:59 PM IST

Updated : Jun 6, 2021, 3:25 PM IST

ప్రారంభోత్సవం వాయిదా

జిల్లాల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభోత్సవం ఈ నెల 9కి వాయిదా పడింది. సోమవారం నుంచి అందుబాటులోకి తేవాలని ముందుగా భావించినా.. మళ్లీ మార్చారు. బుధవారం నాడు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఆనందయ్య మందు పంపిణీ

ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల వాసులకు మందు తర్వాత పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​

హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమంలో... ఒకేచోట 40 వేలమందికి టీకా ఇచ్చేలా అతిపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రైవ్ చేపట్టారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రాహుల్​ ఎద్దేవా

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఎద్దేవా చేశారు. బ్లూ టిక్స్​ కోసం కేంద్రం తాపత్రయపడుతోందని ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఇంటికే రేషన్​ ఎందుకొద్దు?'

ఇంటివద్దకే రేషన్ సరుకులను అందించే కార్యక్రమాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కరోనా నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన కార్యక్రమం అని అభిప్రాయపడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'హైకమాండ్​ చెబితే తప్పుకుంటా'

కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారనే వార్తలు విస్తృతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్​ నిర్ణయమే తన నిర్ణయమని అన్నారు. హైకమాండ్​ చెబితే ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే.. నాయకత్వ మార్పు ఉండబోదని భాజపా అధిష్ఠానం ఇప్పటికే పలుమార్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

అంకురాలు అదరహో!

కరోనా సంక్షోభం గత ఏడాది కాలంగా అన్ని రంగాలను కుదిపేస్తోంది. అయినప్పటికీ దేశంలో అంకుర సంస్థల జోరు మాత్రం తగ్గడం లేదు. క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నా.. ఆరు నెలల్లో 10 వేల అంకురాలు ప్రారంభమయ్యాయి. అంకురాలు గత ఆర్థిక సంవత్సరం 1.70 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

చైనా మూల్యం చెల్లించాల్సిందే

కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​లోనే పుట్టిందన్న పరిశోధనల నేపథ్యంలో ఆ దేశంపై విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్​ కారణంగా ప్రపంచానికి జరిగిన నష్టానికి డ్రాగన్​ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

టీమిండియా ఆపద్భాందవుడు

సుదీర్ఘ ఫార్మాట్​లో టీమ్ఇండియాకు ఆపద్భాందవుడు. తన తాత్కాలిక కెప్టెన్సీతో జట్టుకు పలు అద్భుత విజయాలు అందించాడు. వేదిక ఏదైనా నిశబ్దంగా తన పని తాను చేసుకుపోయే వ్యక్తి. అతడే భారత టెస్టు వైస్ కెప్టెన్ ఆజింక్య రహానె. ఆదివారం అతడి 33వ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని మరపురాని ఇన్నింగ్స్​లు మీ కోసం..​ పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'సాహో' థీమ్​ వేలం

కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగీత కళాకారులను ఆదుకునేందుకు తమిళ మ్యూజిక్​ డైరెక్టర్​ గిబ్రాన్​ ముందుకొచ్చారు. తాను స్వరపరిచిన 'సాహో' సినిమాలోని హీరో థీమ్​ ట్రాక్​ను వేలం వేయగా వచ్చిన ఆదాయంతో వారికి సహాయం చేయడం సహా 50 శాతం మొత్తాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్​ఫండ్​కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 6, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.