వర్ష సూచన
రాష్ట్రంలోకి రుతుపవనాల రాకతో రాగల మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈరోజు ముఖ్యంగా కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా రాష్ట్రంలో వీస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఈటలపై తమ్మినేని ఫైర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భాజపాలో చేరటంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమైన ఈటల.. లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి.. ఇప్పుడు ఏకంగా ఫాసిస్టు భాజపా పంచన చేరడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
దేశానికే ఆదర్శం
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ఎంతో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అన్‌లాక్‌పై రాష్ట్రాల దృష్టి
కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులు తగ్గిన రాష్ట్రాలు.. అన్‌లాక్‌పై దృష్టి సారిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు సడలింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
టీకా తీసుకున్న తర్వాత సుస్తీ చేస్తే..
ప్రస్తుత సమయంలో స్వల్ప అనారోగ్యానికి గురైనా.. ఆలోచన వైరస్ వైపే వెళుతుంది. ఒకవేళ.. కరోనా టీకా తీసుకున్న తర్వాత లక్షణాలు కనిపిస్తే.. ఏం చేయాలి? కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలా? వద్దా? వైద్యులు చెబుతున్నదేమిటి? తెలుసుకుందాం రండి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
తల్లి అంత్యక్రియలకు కొడుకు నిరాకరణ
కొవిడ్‌తో చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఓ కొడుకు నిరాకరించాడు. గ్రామస్థులు ఎంత నచ్చజెప్పినా.. తల్లి శవాన్ని ఇంటిలోపలికి రానివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు గేటు బద్దలు కొట్టి కాంపౌండ్లోనే దహన సంస్కారాలు నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'వారికి ఆ సామర్థ్యం ఉంది'
భారత్‌తో సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా- భారత్ మధ్య సమస్యలను ఇరుదేశాల నేతలు పరిష్కరించుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ, జిన్‌పింగ్ బాధ్యత గల నేతలని అన్నారు. క్వాడ్ కూటమి, అమెరికాతో సంబంధాలపైనా మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఏ బ్యాంక్‌లో ఎంత?
బంగారు రుణాలు 7% నుండి ప్రారంభమవుతున్నాయి. బంగారు రుణాలకు వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌కు ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో.. 75% మించని రుణ మొత్తాన్ని అందిస్తారు. దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న బంగారు రుణాలపై అమలు చేసే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'ఆర్సీబీ కాకపోతే ఆ జట్టుకు ఆడతా'
ఐపీఎల్లో(IPL) ఆర్సీబీకి కాకుండా చెన్నైసూపర్ కింగ్స్‌కు ఆడటమంటే తనకిష్టమని స్టార్ స్పిన్నర్ చాహల్ చెప్పాడు. తన బయోపిక్ తీస్తే రణ్‌దీప్ హుడా తన పాత్ర పోషించాలని అన్నాడు. హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తనకు క్రష్ అని తెలిపాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ప్రముఖ నటుడు అరెస్ట్
మైనర్‌ను రేప్ చేసిన కేసులో ప్రముఖ టీవీ నటుడు పెర్ల్ వి పూరీ అరెస్టయ్యాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశముంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.