రూ.100 దాటిన పెట్రోల్ ధర
రాష్ట్రంలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధరలు(Petrol Price) రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిజామాబాద్. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రేపు ఈటల రాజీనామా
19 ఏళ్లుగా తెరాసతో ఉన్న బంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్... శాసనసభ్యుడి పదవికీ రేపు రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
బాధ్యతల స్వీకరణ
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా నియామకమైన భూపాల్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.కొత్త ఛైర్మన్ ఎన్నికయ్యే వరకు ఆయన ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'సైకిల్ గర్ల్'కు ప్రియాంక అండ
'సైకిల్ గర్ల్' జ్యోతి కుమారి తండ్రి మృతి పట్ల కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు జ్యోతితో ఆమె ఫోన్లో మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వైద్యుల రాజీనామా
మధ్య ప్రదేశ్‌లో దాదాపు 3,000మంది వైద్యులు రాజీనామా చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'బైడెన్ కంటే ట్రంపే బెటర్'
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కంటే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ బెటర్ అని చైనా తొలుత భావించింది. కానీ రానురాను బైడెన్ నిర్ణయాలు చూస్తుంటే.. ట్రంపే చాలా బెటర్ అని చైనా అనుకుంటోంది. చైనాను అడ్డుకోవడానికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ బైడెన్ కార్యవర్గం చేస్తుండటమే కారణం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సెన్సెక్స్ డౌన్
స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ స్వల్పంగా 20 పాయింట్లు నష్టపోయింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
దిగొచ్చిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధరల పెరుగుదలకు శుక్రవారం బ్రేక్ పడింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.388 తగ్గి 48 వేల మార్కును కోల్పోయింది. వెండి ధర భారీగా తగ్గి రూ.70వేల దిగువకు చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
డోప్ పరీక్షలో విఫలం
భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సినిమా అప్డేట్స్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రేమ్‌కుమార్, ఆకాశవాణి, కాలా, సెహరి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">