ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jun 2, 2021, 4:57 PM IST

పైలట్‌ విధానంలో డిజిటల్‌ సర్వే

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎస్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'మూడో దశ ఎలా ఎదుర్కొంటారు?'

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు.... వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సల లైసెన్స్‌లు రద్దు చేశామని డీహెచ్‌ హైకోర్టుకు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మంత్రికి నిరసన సెగ

నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 2015లో కుబీర్​ రోడ్డు విస్తీర్ణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని మంత్రిని నిలదీశారు. ఇప్పటివరకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఆపరేషన్​ యూపీ

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల కోసం ఆర్​ఎస్​ఎస్​ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంస్థ అధినేత మోహన్ భగవత్.. గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీలోని ఆర్​ఎస్​ఎస్​ కీలక ప్రతినిధులతో సమావేశం కానున్నారు. యూపీ అంశంపైనే వీరు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఉద్యోగులకు కొత్త రూల్

నిఘా సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం మాజీ ఉద్యోగుల నుంచి బయటకు పొక్కకుండా ఉంచేందుకు కేంద్రం నిబంధనలను సవరించింది. సంస్థలో పనిచేసిన విభాగం, సిబ్బంది వివరాలను బహిర్గతం చేయకుండా చూసేలా నూతన క్లాజ్​ను అమలులోకి తెచ్చింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఆ దేశ లేబర్ పార్టీ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు వచ్చే నెల దిగిపోయిన తర్వాత ఐజాక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర(Gold Price today) రూ.116 తగ్గింది. వెండి కిలో ధర(Silver rate today) రూ.71వేల మార్కును కోల్పోయింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మిశ్రమ ఫలితాలతో ముగిసిన సూచీలు

మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన వేళ.. స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు కోల్పోయి.. 51,849 పాయింట్ల వద్ద ముగిసింది. కేవలం 1 పాయింట్​ లాభపడిన నిఫ్టీ.. 15,576 వద్ద స్థిరపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'ఆ దృశ్యాలు చూసి కలత చెందా'

భారత్​లో ఆక్సిజన్​ లేక పలువురు ప్రజలు ప్రాణాలు వదిలేయడం, శ్మశానాల్లో జనాలు ఎక్కువగా ఉండటం లాంటి దృశ్యాలు చూసి తమ మనసు కలత చెందిందని వార్నర్ అన్నాడు. ఐపీఎల్ వాయిదా వేసి, బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సుమ ఫన్నీ వీడియో

తన మాటలతో, చలాకీతనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు యాంకర్ సుమ(Anchor Suma). ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియోలతోనూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆమె మామిడి పండ్లు తినడం గురించి ఓ వీడియో చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.