'ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం'
నోముల భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రచారంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలో భగత్‌తోపాటు సాగర్ నియోజకవర్గాన్ని సందర్శిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నందిగ్రామ్‌లో దీదీ జయకేతనం
బంగాల్ దంగల్‌లో అత్యంత కీలక ఘట్టానికి తెరపడింది. యావత్ దేశం ఎదురుచూసిన నందిగ్రామ్ రణంలో సువేందు అధికారిపై మమతా బెనర్జీ విజయఢంకా మోగించారు. చారిత్రక గెలుపుతో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు మమత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'విజయన్' ఫార్ములా హిట్
కేరళలో చరిత్ర తలకిందులైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెరపడింది. వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది వామపక్ష కూటమి. అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో కేరళ ప్రజల మనసులను గెలిచింది పినరయి సర్కార్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయానికి గల కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పీకే సంచలన నిర్ణయం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇక రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టబోనని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'నాన్న ఆశయాలు నెరవేరుస్తా..'
తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నాగార్జున సాగర్ ప్రజలకు తెరాస అభ్యర్థి నోముల భగత్ ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తిరుపతిలో వైకాపా విజయం
తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభపై గెలుపొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హరియాణాలో లాక్డౌన్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హరియాణాలో వారం పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి అమలులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాపై ప్రధాని సమీక్ష
కరోనాపై పోరుకు సంబంధించి దేశంలో మానవ వనరుల లభ్యత వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైద్య సిబ్బందిపై పనిభారం తగ్గించటం, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులను కొవిడ్ విధుల్లోకి తీసుకోవటంతో పాటు నీట్ వాయిదాపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కలవరపెడుతున్న కరోనా
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలేలో విధులు నిర్వహిస్తున్న మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సల్మాన్‌ఖాన్ సినిమా పేరు మార్పు!
సల్మాన్‌ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా పేరు మార్చాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. మతపరమైన వివాదాలు వస్తాయనే ఆలోచనతోనే ఇలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.