ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : May 1, 2021, 2:58 PM IST

వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ

తెరాస సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈటలను ఆయన నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను కొద్దిసేపటి క్రితం తప్పించింది. కరోనా నేపథ్యంలో అత్యంత సున్నితమైన ఆ శాఖను ముఖ్యమంత్రికి బదిలీ చేసింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రణాళికా ప్రకారమే'

నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు యావత్ తెలంగాణ భావిస్తోందని ఈటల రాజేందర్‌ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎవరిని కలవనని స్పష్టం చేశారు. అంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారన్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మేడే శుభాకాంక్షలు

మేడే సందర్భంగా శ్రమ జీవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టజీవుల చెమట చుక్కలతోనే అభివృద్ధి సాధ్యమని కొనియాడారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలు అమలవుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'జాతీయ విధానాన్ని రూపొందించాలి'

భారత్​లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జాతీయ విధానం రూపొందించాలని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. వైరస్​పై పోరాటంలో మోదీ సర్కార్​తో కాంగ్రెస్​ కలిసి పనిచేస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'లాక్​డౌన్​ వార్తలు అవాస్తవం'

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్​డౌన్ విధింపు​పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) స్పష్టం చేసింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పీఐబీ 'ఫ్యాక్ట్​ చెక్​' చేసి పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆక్సిజన్​ కొరతతో..

దిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్​ కొరతతో.. 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రోడ్డు పక్కన 2 లక్షల టీకాలు

మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న కంటైనర్​లో పెద్దఎత్తున కరోనా టీకాలు లభ్యమయ్యాయి. అందులో దాదాపు 2.40లక్షల టీకా డోసులు ఉండటం కలకలం సృష్టించింది. అయితే వ్యాక్సిన్​ లోడ్​తో ఉన్న ట్రక్కును అక్కడ నిలిపి.. డ్రైవర్, క్లీనర్​ పరారైనట్లు గుర్తించారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అమెరికా ఆంక్షలు

భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షల నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వర్షాకాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వివిధ దేశాల్లో కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారి ప్రయాణాలపై ఎలాంటి పరిమితులు ఉండబోవని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వీరే టాప్​

ఐపీఎల్​లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్​లు పూర్తి కావొస్తున్నాయి. ఈ దఫా బౌలింగ్​, బ్యాటింగ్​ విభాగాల్లో టీమ్​ఇండియా, విదేశీ ఆటగాళ్లతో పాటు.. దేశవాళీ క్రికెటర్లూ సత్తా చాటుతున్నారు. మరి ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​ రేసులో ఎవరున్నారో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సొంత ఓటీటీ యాప్​తో కింగ్​!

ప్రస్తుతమున్న ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లకు పోటీగా తెలుగులోకి మరో యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.