ప్రైవేటు ఆస్పత్రులకు డోసుల నిలిపివేత
రాష్ట్రంలో కొవిడ్ టీకాల కొరత రావటంతో ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డీఎంహెచ్‌వోలకు ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రజలను ఆశ్చర్యపరచవద్దు: హైకోర్టు
రాష్ట్రంలో మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగించామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించగా.. ఎలాంటి ఎన్నికలు లేవని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డ్రోన్ల సాయంతో...
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ అనుమతి అమల్లో ఉండనుంది. పౌరుల ఇంటివద్దకే ఆరోగ్య సేవలు అందించడం ప్రధానోద్దేశంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చేయాల్సినవి.. చేయకూడనివి
దేశంలో రెండో దశ కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఈ తరుణంలో చాలామందిలో వ్యాధి కంటే భయం, ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పనులు చేయకూడదు? లాంటి వివరాలను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.45కోట్ల రిజిస్ట్రేషన్లు
మే 1 నుంచి 18 ఏళ్లుపైబడిన వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం మొదలవనున్న నేపథ్యంలో.. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య భారీగా నమోదైంది. 2.45 కోట్లకు పైగా మంది లబ్ధిదారులు.. టీకా కోసం కొవిన్ డిజిటల్ వేదిక ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 15.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాతో బిహార్ సీఎస్ మృతి
కరోనా మహమ్మారి కాటుకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ బలయ్యారు. ఇటీవలే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు అరుణ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరలు మరింత తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.46,283కు చేరింది. వెండి ధర కిలోకు రూ.1,062 దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్కెట్లు కుదేలు
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 984 పాయింట్లు తగ్గి 49 వేల మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ 264 పాయింట్లు పడిపోయింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఫార్మా షేర్లు కాస్త సానుకూలంగా స్పందించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'టీ20 ప్రపంచకప్ యూఏఈలోనే!'
భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని బీసీసీఐ ఇప్పటికే ధ్రువీకరించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నివేదికను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
థియేటర్లపై ఆంక్షలు పొడిగింపు
థియేటర్లలో సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు పొడిగించారు. మే 8 వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడగించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.