ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 23, 2021, 4:59 PM IST

2 నెలలు ఉచితంగా రేషన్!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గతేడాది మాదిరిగానే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది కేంద్రం. పీఎండీకేఓవైలో భాగంగా మే, జూన్​ నెలల్లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రైల్వే, వాయుసేన సాయంతో..'

కొవిడ్ ఉద్ధృతి కారణంగా మెడికల్ ఆక్సిజన్​ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు రైల్వే, వైమానిక దళం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్​లను బ్లాక్​ మార్కెట్​లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'నిర్లక్ష్యం చేయొద్దు'

కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి ఈటల సూచించారు. వైద్యులు సైతం ఫలితాలు కోసం ఆగొద్దని.. చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్​ను మంత్రి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సచివాలయంలో ఆంక్షలు

కొవిడ్ నేపథ్యంలో సచివాలయంలో పలు ఆంక్షలు విధించారు. సందర్శకులకు ఇచ్చే తాత్కాలిక పాసులను రద్దు చేశారు. సందర్శకుల అనుమతి నిషేధించారు. కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సుప్రీంకు జస్టిస్​ బోబ్డే వీడ్కోలు'

ఎంతో సంతృప్తి, సంతోషంతో పాటు ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీం కోర్టును వీడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్​వీ రమణ.. తన విధులను సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జైడస్​ వ్యాక్సిన్​కు అనుమతులు

దేశంలో త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రానుంది. కరోనా విజృంభిస్తున్న వేళ ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర వినియోగానికి జైడస్​ క్యాడిలా వ్యాక్సిన్​కు అనుమతులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పంతం వీడని అమెరికా!

భారత్​లో కొవిడ్​ టీకా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని అమెరికా ఇప్పట్లో సడలించేలా కనిపించడం లేదు. తమ దేశ ప్రజల అవసరాలకే తాము మొదటి ప్రాధాన్యమిస్తామని ఆ దేశం పేర్కొంది. అనంతరమే ఇతర దేశాలకు తాము సాయం చేస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.909 దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారాంతంలో నష్టాలు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 202 పాయింట్ల నష్టంతో 48 వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి.. 13,350 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సోనూ మరో సాయం

కరోనాతో బాధపడుతున్న ఓ మహిళను హైదరాబాద్​కు తరలించడంలో సాయం చేశాడు నటుడు సోనూసూద్. మెరుగైన చికిత్స కోసం నాగ్​పూర్ నుంచి హైదరాబాద్​కు విమానం ద్వారా ఆ మహిళను తరలించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.