యథావిధిగా మినీ పురపోరు
రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు జరగనుంది. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని... ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'జోక్యం చేసుకోలేం'
రాష్ట్రంలో పుర, నగరపాలక ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణకు అంగీకరించని ధర్మాసనం...ఎస్‌ఈసీని ఆశ్రయించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కేంద్రానిదే బాధ్యత'
రాష్ట్రంలో రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటే.. కేంద్రం మాత్రం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తమిళనాడు నుంచి రాష్ట్రానికి 30 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించారని.. ఆ రాష్ట్రం ఒక్క టన్ను కూడా ఇవ్వబోమని చెబుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వర్షసూచన
రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యువతకు టీకా కోసం
మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా వేయించుకోవచ్చు. ఇందుకోసం ఏప్రిల్ 28 నుంచి కొవిన్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో ఆక్సిజన్ కొరత నెలకొన్న వేళ ప్రాణవాయువు సరఫరాపై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపింది. తయారీ సంస్థలకు ఎలాంటి ఆంక్షలు విధించొద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రైవేటు ఆస్పత్రులకు అందని ఆక్సిజన్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదని స్థానిక భాజపా ఎంపీ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులకే ఆక్సిజన్ సరఫరా చేయాలని తయారీదారులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాణవాయువు కొరత వల్ల పలువురు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బుల్ జోరు
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సెన్సెక్స్ 375 పాయింట్లు పెరిగి.. 48 మార్క్ దాటింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 14,400 పైకి చేరింది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు రాణించడం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మా జట్టు బలం అదే'
చివరి బంతి వరకు పోరాడటమే తమ జట్టు బలమని అన్నాడు ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. తమ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరింత బాగా ఆడాలని పరోక్షంగా సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పవన్‌తో దిల్‌రాజు మరో చిత్రం!
'వకీల్‌సాబ్' చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న నిర్మాత దిల్‌రాజు.. పవన్ హీరోగా మరో చిత్రం నిర్మించేందుకు సిద్ధమయ్యారని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. అందుకు పవర్‌స్టార్ కూడా అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.