ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Apr 9, 2021, 12:59 PM IST

1.'వేగంగా కరోనా వ్యాక్సినేషన్​'

టీకా తీసుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోందని ఆయన అన్నారు. సికింద్రాబాద్​లోని​ గాంధీ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.నీటి విడుదలపై చర్చ

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.అభిమానుల ఆగ్రహం

వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా గద్వాల్​లో అభిమానులు హంగామా సృష్టించారు. థియేటర్​లో మూవీ చూసేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు సినిమా ముందుగానే స్టార్ట్ చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ థియేటర్ ముఖద్వారంపై దాడి చేశారు. పాక్షికంగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'సరైన చర్యేనా?'

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో.. విదేశాలకు కొవిడ్​ టీకాలు సరఫరా చేయడం సరైన చర్యేనా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్రం ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని రాష్ట్రాలకు టీకాలను అందించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.మమతకు మరోసారి నోటీసులు

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాల మోహరింపుపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'సీబీఎస్​ఈ బాధ్యతారాహిత్యమే'

బోర్డు పరీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యార్థులపై.. సీబీఎస్​ఈ ఒత్తిడి తెస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బోర్డు పరీక్షల్ని రద్దు లేదా రీ షెడ్యూల్​ చేయాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

గుజరాత్ అహ్మదాబాద్​లోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.భారత్​-చైనా చర్చలు

భారత్​-చైనా మధ్య 11వ దఫా సైనిక స్థాయి చర్చలు తూర్పు లద్దాఖ్​లోని చుషుల్​ ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. లద్దాఖ్​లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు జరుపుతున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.క్యాచ్​ల వీరులు వీరే..

క్రికెట్​లో క్యాచ్​లు ఎంత ప్రభావం చూపిస్తాయో మనకు తెలియంది కాదు. వాటిని చేజార్చడం ద్వారా ఒక్కోసారి మ్యాచ్​ను కోల్పోవాల్సి వస్తుంది. అవే క్యాచ్​లను ఒడిసి పడితే మ్యాచ్​ స్వరూపానే మార్చేయొచ్చు. మరి ఐపీఎల్​లో అలాంటి క్యాచ్​లను పట్టడంలో మొనగాళ్లు ఎవరు? ఇప్పటివరకు అత్యధిక క్యాచ్​లను పట్టిన ఆటగాళ్లెవరు అనేది ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సినిమా అప్​డేట్స్​

రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడి' టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అలాగే ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గంగూబాయ్ కతియావాడి' తెలుగు టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.