1.వరిసాగులో నెంబర్.1
వ్యవసాయంలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో రైతు వేదికను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.యాదాద్రిపై కొవిడ్ ప్రభావం
కరోనా మహమ్మారి దెబ్బకు యాదాద్రి ఆలయం కళ తప్పింది. ఆలయ పరిసరాలు బోసిపోతున్నాయి. స్వామివారి లడ్డూలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఈ పరిణామాలు దేవస్థాన ఖాజానాకు గండికొట్టాయి. ఆదివారం నుంచి ఆలయంలో ఆర్జిత పూజలు మొదలు కానుండగా ఆదాయం పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.ఆమె కోసం ఊరు కదిలింది..
తమ గ్రామపంచాయతీ కార్యదర్శిని బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ.. నిజామాబాద్ జిల్లాలోని తిర్మన్‌పల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఉన్నతాధికారులు కక్షగట్టి బదిలీ వేటు వేశారని ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.'అసద్‌ది ప్రతీకార చర్యే'
అందరూ చూస్తుండగానే మైలార్‌దేవ్‌పల్లిలో ఓ హత్య జరిగింది. ఈ హత్య ప్రతీకారం తీర్చుకోవడానికి చేశారని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.'ప్రజలను దీదీ కించపరుస్తున్నారు'
మే 2న నందిగ్రామ్ ఫలితాలు అందరినీ అశ్చర్యపరుస్తాయని, దీదీ శకం ముగుస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హూగ్లీ అరంబాగ్ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.'భాజపా విభజన రాజకీయం'
ఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీలను భాజపా ప్రోత్సహిస్తోందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు భాజపా నుంచి డబ్బు తీసుకున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.'దాడులు చేయడం సంఘ్ నేర్పిస్తోంది'
దాడులు చేయటం మాత్రమే సంఘ్ నేర్పిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ అహింస, సత్యాగ్రహం ద్వారా రైతులు ధైర్యంగా ఉంటారని పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తాము ఐక్యంగా పోరాడతామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.బీజాపుర్‌లో ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు మృతి చెందారు. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.'బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా'
క్రికెటర్ బుమ్రాను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది సంజనా గణేశన్. ఇంతకీ ఆమె చెప్పింది? వీరి పెళ్లి గతనెల 15న గోవాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్ సీన్
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోని డిలిటెడ్ సన్నివేశాన్ని విడుదల చేసింది చిత్రబృందం. విపరీతంగా నవ్విస్తున్న ఈ సీన్‌ను మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.