ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@5pm

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

టాప్​టెన్​ న్యూస్​@5pm
టాప్​టెన్​ న్యూస్​@5pm
author img

By

Published : Nov 27, 2020, 5:00 PM IST

1.హైదరాబాద్​లో జేపీ నడ్డా

బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్​కు చేరుకున్నారు. బేగంపేట్​ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు రాష్ట్ర నాయకులు ఘనస్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'ప్రభుత్వం ఊరుకుంటుందా?'

జీహెచ్​ఎంసీ పరిధిలో లేని అంశాలను భాజపా మేనిఫెస్టోలో పెట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఉంటే రూ.25వేల వరదసాయం ఎలా ఇస్తారని, ప్రధానితో జీవో ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'పట్టం కట్టండి'

తెరాసపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటు వేయాలని సూచించారు. హైదరాబాద్​ అభివృద్ధి కావాలంటే.. భాజపాకు పట్టం కట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ఎంఐఎం జోరు

బల్దియా బరిలో ఎంఐఎం ప్రచారం ప్రత్యేక పంథాలో సాగుతోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్​లు ప్రచార తారలతో ఓటర్లను ఆకట్టుకుంటుంటే.. మజ్లిస్ గెలుపుబాధ్యతను ఓవైసీ సోదరులు తమ భుజాన ఎత్తుకున్నారు. అధికార తెరాసతో స్నేహపూర్వక పోటీ చేస్తున్న ఎంఐఎం గతంలో కంటే ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'వారిని ఏజెంట్లుగా అనుమతించొద్దు'

గ్రేటర్​ ఎన్నికల ఏజెంట్ల నియామక నిబంధనలను ఎన్నికల అధికారి లోకేష్​ కుమార్ ​వెల్లడించారు. ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా అనుమతించవద్దని ఆదేశించారు. ఏజెంట్లు అదే ప్రాంతానికి చెందినవారై ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.దీదీకి షాక్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్​లు​ ఇస్తున్నారు తృణమూల్​ పార్టీ సీనియర్​ నేతలు. ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడని పేరున్న సువేందు అధికారి కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో సీనియర్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి భాజపాలో చేరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.'ఆ రెండు టీకాల్ని కలిపితే'

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ను స్పుత్నిక్-వీ టీకాతో కలిపి ప్రయోగించాలని రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ సూచించింది. తద్వారా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతను పెంచొచ్చని పేర్కొంది. ఇలా టీకాలను కలిపి ప్రయోగించడం రీవ్యాక్సినేషన్​కు ఉపయోగపడొచ్చని ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.లోతైన చర్చలు

సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు భారత్​తో లోతైన చర్చలు జరుపుతున్నామని చైనా మిలిటరీ తెలిపింది. రెండు దేశాలు సమన్వయంతో ఉన్నాయని పేర్కొంది. ఇరు దేశాలు శాంతిని నెలకొల్పే దిశగా అడుగేయాలని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రెన్​ గోకియాంగ్​​ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.రణరంగంలా​ పార్లమెంట్​​

అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్​ పార్లమెంట్​లో జరిగిన చర్చ ఘర్షణకు దారితీసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు మాంసం విసురుకుంటూ.. చట్టసభను రణరంగంలా మార్చివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.మార్కెట్లు డీలా

జీడీపీ రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో పయనించాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోగా... నిఫ్టీ 18 పాయింట్లు పతనమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.