ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@5PM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

top ten news
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Nov 26, 2020, 4:59 PM IST

1.పరీక్షలు పెంచాలి: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.ఎన్నికల సంఘం హెచ్చరిక

రాజకీయ పార్టీ నేతల ప్రసంగాలపై ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రసంగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.కేటీఆర్​ వ్యంగాస్త్రాలు

భాజపా మేనిఫెస్టోలో... తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు వ్యంగాస్త్రాలు సంధించారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'చర్యలేందుకు తీసుకోవట్లేదు?'

లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకానితనమని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'సీరం'కు మోదీ

ప్రధాని మోదీ శనివారం పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాను సందర్శించనున్నారు. వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరాపై సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.కశ్మీర్​లో ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. శ్రీనగర్​ హెఎమ్​టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ట్రంప్​ను బ్యాన్​ చేస్తాయా?

వివాదాలకు మారు పేరు..​ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. సంచలన పోస్టులు, ట్వీట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతుంటారాయన. విద్వేషపూరిత ట్వీట్లతో చాలాసార్లు నిబంధనలు అతిక్రమించిన ఘనత ఆయనది. కానీ, అగ్రరాజ్యం అధ్యక్షుడి స్థాయిలో ఇన్నాళ్లూ 'ప్రత్యేక హోదా' అనుభవించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ఆద్యంతం ఒడుదొడుకులు

ఆరంభం నుంచి ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్​ సాగించిన సూచీలు.. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 400, నిఫ్టీ 120 పాయింట్లకుపైగా పెరిగాయి. లోహరంగం షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఫార్మా, బ్యాంకింగ్​ షేర్లూ రాణించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.రికార్డులకు అడుగు దూరంలో కోహ్లీ

తొలి వన్డేకు ముందు కోహ్లీపై ఆసీస్ కెప్టెన్​ ఫించ్ పొగడ్తలు కురిపించాడు. అత్యుత్తమ వన్డే ఆటగాడని కితాబిచ్చాడు. అయితే ఈ సిరీస్​లో విరాట్ కొన్ని రికార్డులు అధిగమించే అవకాశం కూడా ఉంది. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) సిడ్నీలో మ్యాచ్​​ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.విభిన్న గెటప్​లో అభిషేక్​

'బాబ్ విశ్వాస్' సినిమా కోసం విభిన్న గెటప్​లో కనిపించనున్నారు అభిషేక్ బచ్చన్. ఆ ఫొటోలు కొన్ని లీక్​ కావడం వల్ల అభిషేక్​ లుక్​ బయటకొచ్చింది. ఇటీవలే 'లూడో' చిత్రంతో వచ్చిన ఈ నటుడు.. ఆకట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.