ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

author img

By

Published : Nov 19, 2020, 8:59 PM IST

టాప్​టెన్​ న్యూస్​@9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

1.నామినేషన్ల పర్వం

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో ఇవాళ పెద్దఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'గులాబీ జెండా ఎగురవేస్తాం'

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఎంఐఎం సహా ఎవరితోనూ పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠంపై తెరాస అభ్యర్థే ఉంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో అరాచకం కావాలా.. అభివృద్ధి కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.మాటల యుద్ధం

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ ఎన్నికల వేళ బాధితులకు అందించే వరద సాయం నిలిపేయటం తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నగరంలోని మీ సేవా కేంద్రాల్లో భారీ ఎత్తున గుమిగూడి ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్న తరుణంలోనే పంపిణీ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్ని జారీ చేయటం ఎన్నికల వేడిని మరింత పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'ఆ పాపం వాళ్లదే'

కాంగ్రెస్, భాజపా పార్టీలు... పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వరదల సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుంటే... చూసి ఓర్వలేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.భారత్​ లక్షిత దాడులు!

పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేస్తోందా? సాధారణ పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ముష్కరులను ఏరివేస్తోందా? ఔనంటూ ఓ కథనం ప్రచురించింది పీటీఐ వార్తా సంస్థ. అయితే.. భారత సైన్యం మాత్రం ఈ వార్తపై భిన్నంగా స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'మరికొన్ని నెలల్లో టీకా'

మరికొన్ని నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఆగస్టు నాటికి 40 లేదా 50 కోట్ల డోసులు అందుబాటులో వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే టీకా పంపిణీకి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమవుతోందని, శాస్త్రీయత ఆధారంగా అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.హఫీజ్​ సయీద్​కు 10 ఏళ్ల జైలు

2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్​ ఉద్​ దవా చీఫ్ హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్​ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన రెండు కేసులకు సంబంధించి యాంటీ-టెర్రరిజం కోర్టు ఈ తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.చైనా భయపడుతోందా?

ప్రపంచ స్థాయిలో భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి పొరుగు దేశం చైనా భయపడుతున్నట్లే కన్పిస్తోంది. భారత్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌కున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూస్తోంది. ఇందుకోసం చైనా అనేక పన్నాగాలు పన్నుతోందని అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ విభాగానికి చెందిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.యువ జోరు... చోటు పక్కా!

కరోనా కష్టకాలంలోనూ ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించారు​. యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన 13వ సీజన్​ ఆల్​టైమ్​ హిట్​గా నిలిచి, అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచింది. ఈ సీజన్​లో కొందరు వర్ధమాన ఆటగాళ్లు ఔరా అనిపించే ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.పైలట్​గా రకుల్​

కొంతకాలంగా బాలీవుడ్​పై దృష్టిసారించిన సొగసరి భామ రకుల్​ ప్రీత్​ సింగ్​.. మరో ఆఫర్​ కొట్టేసింది. ఈసారి అమితాబ్​, అజయ్​ దేవగణ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమాలో కనువిందు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.