ETV Bharat / state

తాడేపల్లి ప్యాలెస్​ ఖర్చులకే రూ.15 కోట్లు - ఆ విషయాల్లో జగన్ ఘనుడే!

వైఎస్​ జగన్​కు టీడీపీ నేత పట్టాభి స్ట్రాంగ్​ కౌంటర్​. జగన్​ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి ఇంటి చుట్టూ కంచెకు రూ.12.85 కోట్లు. ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పట్టాభి మీడియా సమావేశం.

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

TDP Leader Pattabhiram on YS Jagan
TDP Leader Pattabhiram on YS Jagan (ETV Bharat)

TDP Leader Pattabhiram on YS Jagan : వైఎస్​ జగన్​పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్​ జగన్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఆయన ఇంటి చుట్టూ కట్టిన ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. దేశంలోని అత్యున్నతమైన రాష్ట్రపతి భవన్​, ప్రధానమంత్రి నివాసాలకే అలాంటి కంచెను ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. ఏపీలోని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పట్టాభిరామ్​ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టాభిరామ్​ మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్​లోని బాత్​టబ్​లు, మసాజ్​ టేబుళ్లు, కప్​బోర్డులు, ప్రతి జిల్లాలోనూ వైఎస్సార్​సీపీ కార్యాలయాలు, తాడేపల్లి ప్యాలెస్​లే ఆయన విలాసాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సాధారణ పరిపాలన విభాగం జగన్​ ఇంటి చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిందన్నారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్​ దక్షిణం వైపు 0.148 ఎకరాల స్థలంలో వ్యూకట్టర్​ నిర్మాణానికే రూ.3.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

ఆ ఘనత జగన్​కే సొంతం : వైఎస్​ జగన్​ తన ఇంటి చుట్టూ భద్రతా ఏర్పాట్లకే మొత్తం రూ.16.10 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారని టీడీపీ నేత పట్టాభిరామ్​ దుయ్యబట్టారు. ప్రజలను అణిచివేసే నియంతలే ఇలా ఇనుప కంచెలు వంటివి వేసుకుంటారని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్​ హయాంలో విలాసాల పేరుతో ఏకంగా రూ.5 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.

ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై వైఎస్సార్​సీపీ రంగులకు రూ.3000 కోట్లు, సర్వే రాళ్లపై తన అపురూప చిత్రాలను వేసుకోవడానికి రూ.700 కోట్లు, రుషికొండ ప్యాలెస్​కు రూ.600 కోట్లు ఖర్చు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాక్షి పత్రికలో ప్రకటనల పేరుతోనే రూ.500 కోట్లు, ప్రజల పాసుపుస్తకాలపై బొమ్మలు వేయడానికి రూ.13 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్​లో ఖర్చులకు రూ.15 కోట్లు ఖర్చు చేసిన ఘనుడు జగన్​ అని. ఆ ఘనతలు ఆయన ఖాతాలోనివేనని పట్టాభి ధ్వజమెత్తారు.

సొమ్మునంతా రాబతాం : గత ఐదేళ్లలో జగన్​ దోచుకున్న సొమ్మంతా కక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్​ హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్​ కంచె ఎత్తు మరింత పెంచే సమయం ఆసన్నమైందని ఎక్స్​లో ట్వీట్​ చేశారు. జగన్​ ఇంటి కంచెకు ప్రజల సొమ్ము రూ.13 కోట్లు ఖర్చు చేశారని, ఐదేళ్లలో ఇలానే జనం సొమ్ము కాజేసి తాడేపల్లి ప్యాలెస్​లో గుట్టలు గుట్టలుగా పోగేసుకున్నారని మండిపడ్డారు.

జగన్​ సుద్దపూస కాదు - నేను ముమ్మాటికీ సనాతన హిందువునే : పవన్ - Pawan Kalyan On Sanatana Dharama

''సాక్షి'కి ప్రభుత్వ నిధులు దోచిపెట్టారు - వాటి అన్నింటి మొత్తం కలిపినా అంత లేదు' - AP Govt Clears New Liquor Policy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.