ETV Bharat / offbeat

క్యాబేజీ ఇంట్లో ఎవ్వరూ తినట్లేదా? - ఇలా "క్యాబేజీ ఎగ్​ బుర్జీ" చేయండి! - టేస్ట్​ అదుర్స్​ అంతే!! - CABBAGE EGG BHURJI

-వేడివేడి అన్నం, చపాతీల్లోకి రుచి అమృతమే! - మీ పిల్లలు వదిలిపెట్టరు

Cabbage Egg Bhurji Recipe
Cabbage Egg Bhurji Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 1:26 PM IST

Cabbage Egg Bhurji Recipe : మనలో చాలా మందికి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం ఉండదు. కూరలో కారం, మసాలాలు చక్కగా వేసినా కూడా.. కొద్దిగా వాసన రావడమే దీనికి ప్రధాన కారణం! అయితే, క్యాబేజీ ఇష్టం లేనివారు ఈ విధంగా 'క్యాబేజీ ఎగ్​ బుర్జీ' ప్రిపేర్​ చేసుకోండి. చాలా సింపుల్​గా తయారయ్యే ఈ రెసిపీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా క్యాబేజీ ఎగ్​ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై ఓ లుక్కేయండి..!

కావాల్సిన పదార్థాలు:

  • క్యాబేజీ - 1 (మీడియం సైజ్​)
  • కోడి గుడ్లు -3
  • ఉల్లిపాయలు - 2
  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • కారం - సరిపడా
  • గరం మసాలా - పావు టీ స్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా క్యాబేజీని శుభ్రం చేసుకుని సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా ముక్కలు చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నె​లో నీరు పోసుకుని అందులో ఉప్పు వేసుకోవాలి. ఇందులో కట్​ చేసుకున్న క్యాబేజీ తరుగు వేసి బాగా కడిగి వడకట్టాలి.
  • ఆ తర్వాత ఓ ప్లేట్​లోకి క్యాబేజీ తరుగు తీసుకుని 15 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. క్యాబేజీ ఆరితేనే కర్రీ పొడిపొడిగా రుచిగా వస్తుంది.
  • ఇప్పుడు స్టౌ​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • నూనె హీట్​ అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​ మీద ఆనియన్స్​ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇందులోకి పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, టేబుల్​ స్పూన్​ నీళ్లు వేసి మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆరబెట్టుకున్న క్యాబేజీ తరుగు వేసి బాగా మిక్స్​ చేయాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద కలుపుకుంటూ క్యాబేజీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
  • క్యాబేజీ ఉడకడానికి దాదాపు 15 నిమిషాల టైం పడుతుంది.
  • ఇప్పుడు మూత తీసి కలిపి స్టౌ హై-ఫ్లేమ్​లో పెట్టి క్యాబేజీలో నీరు ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • వాటర్​ ఆవిరైన తర్వాత గుడ్లు పగలగొట్టండి. గిన్నెపై మూత పెట్టి ఓ ఐదు నిమిషాలపాటు మగ్గించాలి.
  • తర్వాత కోడిగుడ్లను క్యాబేజీ మొత్తానికి కలుపుతూ ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  • ఇప్పుడు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో టేస్టీ క్యాబేజీ ఎగ్​ బుర్జీ రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

10 నిమిషాల్లో తెలంగాణ స్పెషల్ చుక్కకూర తొక్కు- వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతమే!

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.